Karthika deepam 2 December 6th: జ్యోత్స్న మరో కుట్ర.. తిప్పికొట్టిన శివ నారాయణ
Karthika deepam 2 December 6th : కార్తీక దీపం 2 సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతున్న ఈ ఫేమస్ సీరియల్ తాజా ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. దీంతో డిసెంబర్ 5వ తేదీ 533వ ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన సన్నివేశాలు జరిగాయి. శివ నారాయణ తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ అవుతారు. దీపకు కడుపులో నొప్పి వచ్చిందని తెలుసుకున్న శివ నారాయణ హుటాహుటినా కుటుంబ సభ్యులందరితో కలిసి కార్తీక్ బాబు ఇంటికి వస్తాడు. అలాగే డాక్టర్ ను కూడా తీసుకొని వచ్చాడు. పరీక్షించిన డాక్టర్ దీపకు ఎలాంటి సమస్య లేదని, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతుంది. దాంతో శివ నారాయణతో పాటు దశరథ కూడా దీపను ఇకపై ఇంటికి పనికి రావొద్దని చెబుతారు.
అయితే, మరోవైపు జ్యోత్స్న మాత్రం ఇంట్లో వాళ్లందరూ దీప చూపిస్తున్న ప్రేమకు తట్టుకోలేకపోతుంది. వాళ్లకు దీపను ఎంత దూరంగా చేయాలని అనుకుంటే అంతలా దగ్గర అవుతున్నారని మనస్సులో మండిపడుతుంది. ఎలాగైనా దీపకు కార్తీక్ బాబును దూరం చేయాలని అనుకుంటూ ఉంటుంది. ఇదే సమయంలో పారుజాతం కూడా తన కుట్రతో దీప జీవితంలో కష్టాలు తీసుకురావాలని అనుకుంటుంది. దీంతో వెంటనే శౌర్య పాపను బయటికి తీసుకెళ్లి అనుమానపు మాటలు చెబుతుంది. మీ అమ్మ దీప కడుపులో ఉన్న బిడ్డ పుట్టిన తర్వాత నిన్ను అందరూ వదిలేస్తారు, పట్టించుకోరు అని చెబుతుంది. దాంతో శౌర్య పాప ఆందోళన చెందుతుంది. ఇదే సమయంలో దీప కూడా కుటుంబ సభ్యులకు షాకిచ్చేలా మాట్లాడుతుంది. ఈ క్రమంలో కార్తీక దీపం డిసెంబర్ 4వ తేదీ 534వ ఎపిసోడ్ లోకి వెళ్తే..




