Gunde Ninda Gudi Gantalu December 4th: మీనాకు ఘోర అవమానం.. ప్రభావతి రచ్చ
Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్ తెలుగు టెలివిజన్ డైలీ సీరియల్స్‌లో మంచి రేటింగ్‌తో ఆసక్తికరంగా కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 3వ తేదీ 568 ఎపిసోడ్ ఇలా జరిగింది. మనోజ్, ప్రభావతిని బాలు అడ్డంగా బుక్ చేస్తాడు. అసలు మీరిద్దరూ బంగారం తీయనప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నారని ప్రశ్నిస్తాడు బాలు. అయితే బాలు నిమ్మకాయ డ్రామాను ప్రారంభించడంతో, మరోవైపు ప్రభావతి కూడా తనకు కూడా స్వామిజీ సాయం కావాలని వెళ్లి మరో మంత్రించిన నిమ్మకాయను తీసుకొని వస్తుంది. దాంతో ప్రభావతి ఆ నిమ్మకాయను బాలు తెచ్చిన నిమ్మకాయకు పక్కన పెడుతుంది. కానీ వారిద్దరికీ ఇంకా భయం మాత్రం పూర్తిగా పోదు. దీంతో ఎలాగైనా నిమ్మకాయ అంతు తేల్చాలని అనుకుంటారు.
దాంతో మనోజ్, ప్రభావతి ఇద్దరికీ అర్ధరాత్రి నిద్రరాదు. వారిద్దరికీ బాలు తెచ్చి ఇంట్లో పెట్టిన నిమ్మకాయ భయం ఎంతగానో ఉంటుంది. దాంతో వారిద్దరూ కలిసి ఆ నిమ్మకాయను తీసి బయట పడేయాలని నిర్ణయించుకుంటారు. దీంతో దేవుడి గది దగ్గరకు ఇద్దరు వెళ్తారు. ఇక ఆ నిమ్మకాయలను ప్రభావతినే ధైర్యంతో తీసి చేతుల్లో పట్టుకుంటుంది. ఆ రెండింటినీ బయట పడేద్దామని అనుకుంటారు. దాంతో ఇంటి నుంచి బయటికి వెళ్లాలని ప్రయత్నిస్తారు. ఇదే సమయంలో బాలు ఇంట్లో లైట్లు ఆన్ చేసి తండ్రి సత్యం, రోహిణి, మీనా, శృతి, రవి అందరినీ హాలులోకి తీసుకొని వస్తాడు. దాంతో మనోజ్, ప్రభావతి ఇద్దరూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు. దీంతో మనోజ్ పై తండ్రి సత్యం ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. మనోజ్ కూడా తన తప్పును ఒప్పుకుంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 4వ తేదీ 568వ ఎపిసోడ్ లో చూద్దాం..

మనోజ్ పై సత్యం ఫైర్..
రెడ్ హ్యాండెడ్ గా దొరిపోయిన తర్వాత మనోజ్ తన తప్పును అందరి ముందు ఒప్పుకున్నాడు. అంతే కాదు తన వల్లనే తల్లి ప్రభావతి కూడా నిందల పాలు అయ్యిందని చెబుతాడు. మీనా బంగారాన్ని తానే అప్పుల కోసం అమ్మాల్సి వచ్చిందని ఒప్పుకుంటాడు. చేసిన తప్పును త్వరగా ఒప్పుకోకుండా, పైగా చాలా నానా రచ్చ తర్వాత మనోజ్ తన తప్పును ఒప్పుకోవడం సత్యం కోసం కట్టలు తెంచుకుంటుంది. ఇక పెద్ద కొడుకు మనోజ్ వీపును వాయిస్తాడు. మొదటి నుంచి నీ వల్ల ఏదోక సమస్య వస్తూనే ఉందిరా అంటూ మండిపడుతాడు. నువ్వు ఇలా కావడానికి కారణం నీ తల్లి ప్రభావతినే అంటాడు. నీ వల్లనే కుటుంబంలో మనోజ్ అందరి కంటే చీప్ గా తయారయ్యాడని సత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అంతే కాదు ప్రభావతినే కోడలు శృతి, రవి, బాలు, మీనా కూడా తిడుతూ ఉంటారు. దీంతో ప్రభావతి కోపంగా వెళ్లి తన గది తలుపులు వేసుకుంటుంది.
Gunde Ninda Gudi Gantalu December 3rd: మనోజ్ జీవితం తలికిందులు.. మీనాపై నింద
కామాక్షి రాకతో కొత్త ట్విస్ట్..
ప్రభావతి కోపంగా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది. ఇక అర్ధరాత్రి మొత్తం తన గదిలో నుంచి అస్సలు బయటికి రాదు. దాంతో సత్యం ఇక గదిలో కాకుండా హాలులో నేల మీదనే పడుకుంటాడు. ఇది చూసిన మీనా గుండె తరుక్కుపోతుంది. ఇక బాలు దగ్గరకు వెళ్లి ఎలాగైనా అత్త ప్రభావతిని శాంత పరిచి గదిలో నుంచి బయటికి వచ్చేలా చేయమని అడుగుతుంది. నిన్న రాత్రి నుంచి గది నుంచి రాలేదంటే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని కంగారు పడుతుంది. ఇక బాలు అలాంటిదేమీ జరగదని ధైర్యం చెప్పి, వెంటనే కామాక్షిని తీసుకొని వస్తాడు. ఇక కామాక్షి వచ్చి ఎలాగోలా ప్రభావతిని బయటికి తీసుకొని వస్తుంది. దాంతో ఇంట్లో వాళ్లందరూ చాలా సంతోషిస్తారు. అయితే సత్యం మాత్రం ప్రభావతితో మాట్లాడటానికి అస్సలు ఒప్పుకోడు.
Karthika deepam 2 December 3rd: కార్తీక్ బాబుకు ఆపద.. జ్యోత్స్న, పారుల కుట్ర
మీనాకు ఘోర అవమానం..
ఇదే సమయంలో కామాక్షి సత్యం వద్దకు వచ్చి ప్రభావతిని క్షమించమని అడుగుతాడు. క్షమించమని నన్ను అడగటం కాదు.. నిందలు మోసిన మీనా, బాలును క్షమించమని అడిగితే సరిపోతుందని అంటాడు. అయితే సత్యం మాటలకు ప్రభావతి మరింతగా రెచ్చిపోతుంది. నేను ఈ ముష్టి మీనాను క్షమాపణలు అడగాలా అది జరగని పని అని అంటుంది. అసలు దీని గొడవ కారణం బంగారమే కదా.. ఇదిగో తీసుకోవే మీనా, నీ బొంద మీద కొట్టుకో అని తన ఒంటి మీద బంగారాన్ని తీసి మీనా మొహాన కొడుతుంది. దాంతో మీనా చాలా బాధ పడుతుంది. దీంతో సత్యం, బాలు ప్రభావతిపై ఇంకా ఫైర్ అవుతారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.
Gunde Ninda Gudigantalu Latest Promo
గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 4వ ఎపిసోడ్ ముగింపులో ఆసక్తికరమైన ప్రోమోను వదిలారు. ప్రభావతిపై సత్యం ఆగ్రహంతో ఉంటాడు. ప్రభావతితో అస్సలు మాట్లాడడు. దీంతో ప్రభావతి కూడా కాస్తా అలకతో ఉంటుంది. ప్రభావతి, మనోజ్ చేసిన తప్పులకు గానూ సత్యం తానే స్వయంగా మీనా, బాలును క్షమాపణలు కోరుతాడు. ఇక ప్రభావతి తనకు ఎదురుపడితే మనఃశ్శాంతి లేకుండా పోతుందని కఠినంగా మాట్లాడుతాడు. ఇదే సమయంలో వారిద్దరిని కలపాలని మీనా బాలుతో అంటుంది. ఈ క్రమంలో ఏం జరిగి ఉంటుందనేది వచ్చే ఎపిసోడ్స్ పై ఆసక్తిని పెంచుతోంది.



