Karthika deepam 2 December 5th: జ్యోత్స్నకు దెబ్బ.. దీప ఆనందం
Karthika deepam 2 December 5th : కార్తీక దీపం 2 సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతున్న ఈ ఫేమస్ సీరియల్ తాజా ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. దీంతో డిసెంబర్ 4వ తేదీ 532వ ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన సన్నివేశాలు జరిగాయి. దీపకు కడుపులో నొప్పి వచ్చిందన్న సంగతి తెలుసుకున్న శివ నారాయణ కంగారు పడుతాడు. వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో ఉన్న దశరథ, సుమిత్రలకు కూడా చెప్పి అప్రమత్తం చేస్తాడు. దీప ఆరోగ్యం ఎలా ఉందోనని కంగారు పడుతాడు. వెంటనే డాక్టర్ ను తీసుకొని ముందుగా పారుజాతం, సుమిత్రలతో పాటు శివ నారాయణ కార్తీక్ బాబు ఇంటికి వెళ్తారు. తన తండ్రి డాక్టర్ తోపాటుగా రావడం, పైగా సుమిత్ర, పారు కూడా రావడంతో కాంచన సంబర పడుతుంది.
ఇక వెంటనే సుమిత్ర డాక్టర్ ను తీసుకొని దీప గదిలోకి వెళ్తుంది. అప్పటికీ దీప ఇంకా పడుకొనే ఉంటుంది. ఇక దీపను నెమ్మదిగా సుమిత్ర లేపుతుంది. దీప ఆరోగ్యం నార్మల్ గానే ఉండటంతో సుమిత్ర ఊపిరి పీల్చుకుంటుంది. అయితే దీపకు కడుపు పోయిందేమోనని పారుజాతం లోలోపల సంబర పడుతూ ఉంటుంది. కానీ డాక్టర్ ఏమీ కాలేదని చెప్పడంతో అప్సెట్ అవుతుంది. మరోవైపు దశరథ కూడా వెనకాలే జ్యోత్స్నను తీసుకొని కార్తీక్ బాబు ఇంటికి వస్తాడు. దీప ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుంటాడు. దీప ఆరోగ్యం బాగానే ఉందని తెలుసుకొని కాస్తా శాంతిస్తాడు. మరోవైపు దీపను ఇకపై తమ ఇంటికి పనికి రావొద్దని, నీ ఆరోగ్యం చూసుకోమని దశరథ, శివ నారాయణ ఇద్దరూ చెబుతారు. దీనిపై జ్యోత్స్న ఎలా స్పందించిందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో కార్తీక దీపం డిసెంబర్ 4వ తేదీ 533వ ఎపిసోడ్ లోకి వెళ్తే..




