Karthika deepam 2 December 4th: దీపకు శుభవార్త.. జ్యోత్స్న కళ్ల మంట
Karthika deepam 2 December 4th : కార్తీక దీపం 2 సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతున్న ఈ ఫేమస్ సీరియల్ తాజా ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. దీంతో డిసెంబర్ 3వ తేదీ 530వ ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన సన్నివేశాలు జరిగాయి. జ్యోత్స్నకు కార్తీక్ బాబు మాస్ వార్నింగ్ ఇచ్చాడు. అసలు దీపా కాలికి నువ్వు కాలు అడ్డుగా ఎందుకు పెట్టావని అనుమానిస్తాడు. అది నేను కాదని జ్యోత్స్న చెబుతుంది. నవ్వు కాదనే స్పష్టత లేదు. నాకు నీ మీద కేవలం అనుమానమే ఉంది. అదే నిజమని తెలిస్తే మాత్రం ఇప్పుడు నీ తల పగిలిపోయేది. సరిగ్గా పెద్దకర్రతో నీ తలకు వెనక భాగాన గట్టిగా కొట్టే వాడినని కార్తీక్ బాబు దీపతో అంటాడు. ఆ దెబ్బ మాములుగా ఉండేది కాదని చెబుతాడు. ఇకపై దీపను ఏదో చేయాలనే నీ పిచ్చి ప్రయత్నాలను పూర్తిగా మానుకోమని చెబుతాడు.
మరోవైపు దీపకు ఊహించిన సంఘటన జరుగుతుంది. దీపా శివ నారాయణ ఇంట్లో కాలు జారి పడిపోబోయిందనే విషయాన్ని శ్రీధర్ కాంచనకు వచ్చి చెబుతాడు. ఒక రకంగా చెప్పాలంటే అది చెప్పడం కాదు కాంచనను శ్రీధర్ ముఖం పట్టుకొని నిలదీస్తాడు. నీకు నీ కోడలు దీప పట్ల కొంచెమైనా ప్రేమ లేదని అంటాడు. ఇవ్వాళ నీ కోడలు దీప కాలు జారి పడితే తన కడుపులోని బిడ్డకు ఏమౌతుందని ప్రశ్నించాడు. దాంతో కాంచన కూడా దీపను ఇకపై ఆ ఇంటికి పనికి వెళ్లకూడదని చెబుతుంది. ఇక దీప కూడా వెళ్లకూడదనే నిర్ణయించుకుంటుంది. ఇక రాత్రి సమయంలో దీప, కార్తీక్ బాబు వీరిద్దరి మధ్య శౌర్య పాప పడుకుంటుంది. అయితే శౌర్య దీప కడుపులో గట్టిగా తంతుంది. దాంతో దీపకు విపరీతమైన కడుపునొప్పి లేస్తుంది. దాంతో గట్టిగా అరుస్తుంది. కార్తీక్ బాబు దీపను జాగ్రత్తగా చూసుకుని నొప్పి తగ్గే వరకు ఆమెకు రాత్రంతా సేవ చేస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది కార్తీక దీపం డిసెంబర్ 4వ తేదీ 532వ ఎపిసోడ్ లో చూద్దాం..

పారుజాతం ఆగ్రహం..
దీపకు రాత్రంతా కడుపు నొప్పి ఉండటంతో కార్తీక్ బాబు దీపను ఉదయం నిద్ర లేపకుండా అలాగే పడుకోనిస్తాడు. ఇక ఇంట్లో వాళ్లెవ్వరూ కూడా దీపను నిద్ర నుంచి మేల్కోల్పరు. అయితే కార్తీక్ బాబు ఒక్కడే రెడీ అయ్యి ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లాలి అనుకుంటాడు. మరోవైపు కార్తీక్ బాబు, దీపాలు సమయానికి డ్యూటీకి రావడం లేదు అని పారుజాతం ఎదురు చూస్తూ ఉంటుంది. అసలు వాళ్లు ఒక్క నిమిషం కూడా ఆలస్యం అయినా ఊరుకునేది లేదని పారుజాతం ఇంటి బయటనే కాపలా కాస్తూ ఉంటుంది. ఇదే సమయంలో పారుజాతాన్ని గమనించిన శివ నారాయణ దగ్గరకు వెళ్లి ఏమైందని అడుగుతాడు. ఆ కార్తీక్ గాడు దీప టైమ్ కు పనికి రావడం లేదని అంటుంది. ఈరోజు లేట్ గా వస్తే వాడి పని చెబుతా అని అంటుంది. కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని చెబుతుంది. దాంతో వెంటనే శివ నారాయణ కార్తీక్ తల్లి కాంచనకు ఫోన్ చేస్తాడు.
Gunde Ninda Gudi Gantalu December 4th: మీనాకు ఘోర అవమానం.. ప్రభావతి రచ్చ
దీప కోసం కీలక నిర్ణయం..
కాంచనకు శివ నారాయణ ఫోన్ చేసి అసలు కార్తీక్ బాబు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అడుగుతాడు. దాంతో కాంచన రాత్రి దీప కడుపు నొప్పితో బాధ పడిందని శివ నారాయణతో చెబుతుంది. దీంతో శివ నారాయణ కంగారు పడుతాడు. వారిని లేపకు అని చెప్పి, నేనే వస్తున్నానని అంటాడు. ఇక వెంటనే సుమిత్ర, పారుజాతం, డాక్టర్ ను కూడా వెంట పెట్టుకొని శివ నారాయణ కార్తీక్ బాబు ఇంటికి వెళ్తాడు. డాక్టర్ వెళ్లి దీపను పరీక్షిస్తుంది. రాత్రి నార్మల్ నొప్పినే వచ్చిందని డాక్టర్ చెబుతుంది. దీపకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతుంది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ పారుజాతం మాత్రం తను అనుకున్నది జరగలేదని అప్సెట్ అవుతుంది. దీంతో మొహం మొత్తం మాడ్చుకుంటుంది. ఎలాగైనా దీప సంతోషాన్ని పోగొట్టాలని అనుకుంటుంది.
Karthika deepam 2 December 3rd: కార్తీక్ బాబుకు ఆపద.. జ్యోత్స్న, పారుల కుట్ర
దశరథ నుంచి దీపకు సర్‌ప్రైజ్..
శివ నారాయణ ముందుగా డాక్టర్ ను తీసుకొని కార్తీక్ బాబు ఇంటికి వెళ్తాడు. శివ నారాయణతో పాటే సుమిత్ర, పారులు ఇద్దరు వెళ్తారు. ఇక వెనకాల జ్యోత్స్న, దశరథ ఇద్దరు కలిసి వస్తుంటారు. అయితే జ్యోత్స్న మాత్రం దీప విషయంలో తాత శివ నారాయణ, తల్లి సుమిత్ర, దశరథ ముగ్గురు చూపిస్తున్న ప్రేమను జీర్ణించుకోలేక పోతుంది. దీప అసలు కూతురు అని తెలియకుండానే ఇలా చూసుకుంటున్నారంటే ఇక నిజం తెలిస్తే ఇంకెలా చూసుకుంటారోనని మనస్సులో అనుకుంటుంది. దశరథతో కలిసి కార్తీక్ బాబు ఇంటికి వెళ్లిన తర్వాత దశరథ దీపకు, కార్తీక్ బాబుకు కలిపి బట్టలు కూడా పెడుతారు. అంతే కాదు ఇకపై నువ్వు మా ఇంటికి పనికి రావాల్సిన అవసరం లేదని శివ నారాయణ, దశరథలు ఇద్దరూ దీపతో చెబుతారు. కానీ జ్యోత్స్న మాత్రం షాకింగ్ గా స్పందిస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచింది.



