Karthika deepam 2 December 3rd: కార్తీక్ బాబుకు ఆపద.. జ్యోత్స్న, పారుల కుట్ర
Karthika deepam 2 December 3rd : కార్తీక దీపం 2 సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతున్న ఈ ఫేమస్ సీరియల్ తాజా ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే డిసెంబర్ 2వ తేదీ 530వ ఎపిసోడ్ లో ఆసక్తికరమైన సన్నివేశాలు జరిగాయి. జ్యోత్స్న చేసిన పనికి శ్రీధర్, శివ నారాయణ, కార్తీక్ బాబు కూడా మండి పడుతారు. జ్యోత్స్న కావాలనే దీపా కాలుకు తన కాలిని అడ్డుగా పెట్టి కింద పడేయాలని చూస్తుంది. దాంతో దీపా కడుపులో పెరుగుతున్న బిడ్డకు హాని చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ దీపాను సుమిత్ర కాపాడుతుంది. అంతే కాకుండా దీపాను మరింత జాగ్రత్తగా చూసుకుంటారు. అది చూసిన జ్యోత్స్న జీర్ణించుకోలేక పోతుంది. దీపాను ఎంత దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే అంత దగ్గరవుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తుంది.
మరోవైపు జ్యోత్స్న చేసే పనులన్నీ తప్పుగా ఉన్నాయని చివరికి పారుజాతం కూడా చెబుతుంది. అసలు నువ్వు దీపా మీద ఎందుకు శ్రద్ధ వహిస్తున్నావని అంటుంది. దీపను నువ్వు కింద పడేయబోవడం నేను చూశానని పారుజాతం జ్యోత్స్నతో అంటుంది. ఇంకా ఎవ్వరు చూడలేదు కాబట్టి నీ సంగతి ప్రశాతంగా ఉంది. లేదంటేనా చాలా దారుణంగా ఉండేది. ఇక నువ్వు చేసే పనులకు నేను ఇంట్లో ఉండటం సాధ్యపడేలా లేదు. నేనే వెళ్లిపోతానని జ్యోత్స్నతో పారుజాతం అంటుంది. అందుకు జ్యోత్స్న పారిజాతాన్ని కూల్ చేస్తుంది. మరోవైపు దీపాకు రాత్రి కడుపులో నొప్పి లేస్తుంది. శౌర్య కాలుతో దీపాను కడుపులో తంతుంది. దాంతో భరించలేని నొప్పిని చూస్తుంది. ఇక కార్తీక్ బాబు ఓదార్చుతాడు. మరోవైపు కాంచనకు ప్రభావతి ఫోన్ చేసి దీప గురించి చెడుగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీపా ప్రెగ్నెన్సీ గురించి షాకింగ్ గా మాట్లాడుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది కార్తీక దీపం 2 డిసెంబర్ 3న తేదీ 531వ ఎపిసోడ్ లో చూద్దాం..

కాంచన మనస్సులో భయం..
దీప ప్రెగ్నెంట్ కావడంతో కాంచన, కార్తీక్ బాబు, శివ నారాయణ, దశరథ, సుమిత్ర ప్రతి ఒక్కరూ ఎంతగానో సంతోష పడుతారు. అయితే దీప విషయంలో జ్యోత్స్న మాత్రం అసంతృప్తిగా ఉంటుంది. మరోవైపు పారుజాతం కూడా జీర్ణించుకోలేక పోతుంది. దీంతో ఎలాగైనా దీప జీవితంలో వచ్చిన సంతోషాన్ని దూరం చేయాలని ప్రయత్నిస్తుంది. అందుకు దీప నుంచి ముందుగా దీప కూతురును వేరు చేయాలని పారిజాతం కుట్ర పన్నుతుంది. అందుకు వెంటనే పారుజాతం కాంచనకు ఫోన్ చేస్తుంది. కాంచన పారు నుంచి ఫోన్ రావడంతోనే కాస్తా కంగారు పడుతుంది. అసలు పారు ఏం మాట్లాడుతుందో అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేయగానే పారుజాతం ఇక తను చెప్పాలనుకున్న కల్లిబొల్లి మాటలను చెప్పడం ప్రారంభిస్తుంది. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటుంది. ఎందుకంటే అది మన బిడ్డ అని చెబుతుంది. దాంతో కాంచన స్పందిస్తూ శౌర్య పాప ముందుగానే పుట్టింది కదా అని చెబుతుంది. కానీ పారుజాతం మాత్రం నెమ్మదిగా తన మాటలతో కాంచన మనస్సులో అనుమానపు బీజం వేస్తుంది.
Gunde Ninda Gudi Gantalu December 3rd: మనోజ్ జీవితం తలికిందులు.. మీనాపై నింద
శౌర్య పాపపై కుట్ర..
కాంచనకు ఫోన్ చేసిన పారు నెమ్మదిగా అన్నీ విషయాలు చెప్పడం ప్రారంభిస్తుంది. అసలు శౌర్య పాపకు మనతో సంబంధం ఉండదని, మున్ముందు ఇదే జరుగుతుందని చెబుతుంది. ఇంతకీ కాంచన నువ్వు నన్ను ఎప్పుడైనా కన్న తల్లిలాగా చూస్తావా? చెప్పు కాంచన అని అంటుంది. నీకు నీకు ఎప్పుడూ పినతల్లినే కానీ సొంత తల్లిని కాలేను కదా అని అంటుంది. అలాగే శౌర్య పాపకు కూడా కార్తీక్ బాబు సొంత తండ్రి కాబోడు. అందుకని ఇప్పుడే శౌర్యను ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించడం మంచిందని, శౌర్య ఇంట్లోనే ఉంటే నెమ్మదిగా అందరికి శౌర్యపై ప్రేమ తగ్గిపోతుందని చెబుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ముందుగానే శౌర్యను దూరం చేయడం మంచిదని కాంచన చెవిలో ఊదుతుంది. దీంతో కాంచన కూడా ఆలోచనలో పడుతుంది. అదే సమయంలో అనసూయ కూడా శౌర్య పాపను తిడుతూ ఉంటుంది. ఇక దెబ్బకు కాంచనకు పారుజాతం మాట్లాడిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. మున్ముందు ఏం జరుగుతుందోనని శౌర్యను చూస్తూ ఉండిపోతుంది.
Gunde Ninda Gudi Gantalu December 2nd: మనోజ్, ప్రభావతికి గుండె దడ.. బాలు స్కెచ్
దీపపై కాంచన ఫైర్..
మరోవైపు దీప, కార్తీక్ బాబు శివ నారాయణ ఇంటి నుంచి తిరిగి వస్తారు. దీంతో ఇప్పటికే శ్రీధర్ వచ్చి దీప గురించి కొంచెం ఘాటు ప్రశ్నలు వేయడంతో కాంచన మదిలో ఉండిపోతాయి. దీంతో కాంచన దీప ఇంటికి తిరిగి రావడంతో వెంటనే ఫైర్ అవుతుంది. అసలు మీరు ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నారని కాంచన ప్రశ్నిస్తుంది. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ గా ఉండి కూడా ఆ ఇంటికి వెళ్లడం నాకు ఏమాత్రం నచ్చడం లేదని కార్తీక్ బాబుతో కాంచన అంటుంది. ఇకపై మీరు ఆ ఇంటికి వెళ్తే మాత్రం నేను అస్సలే సహించనని చెబుతుంది. దాంతో దీప సరైనా సమాధానం చెప్పదు. దాంతో కాంచన కోపంగా ఇంట్లోకి వెళ్లిపోతుంది. మరోవైపు దీప కూడా కోపంగా తన గదిలోకి వెళ్లిపోతుంది. కార్తీక్ బాబు ఇద్దరినీ ఓదార్చుతాడు.
Andhra King Taluka Movie Review: ఆంధ్రా కింగ్ తాలూకా – హిట్టా, ఫట్టా?
దీపకు కడుపు నొప్పి..
కాంచన అన్న మాటలకు దీప కాస్తా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. శివ నారాయణ ఇంటికి వెళ్లకూడదనే కాంచన మాటలకు కోపం చేస్తుంది. ఆ కోపాన్ని కార్తీక్ బాబుపై చూపిస్తుంది. ఇక కార్తీక్ బాబు వెంటనే దీపను శాంతించేలా చేస్తాడు. అయితే రాత్రి పడుకునే సమయంలో శౌర్య పాప వచ్చి కార్తీక్ బాబు, దీపల మధ్యలో పడుకుంటుంది. అప్పటికీ శౌర్యను నాన్నమ్మ దగ్గరే పడుకోమని అందరూ చెబుతున్నా వినకుండా వచ్చి వీరిద్దరి మధ్యలో పడుకుంటుంది. అయితే రాత్రి శౌర్య పాప నిద్రలో తన కాలుతో దీప కడుపులో తంతుంది. దాంతో దీప ఒక్కసారిగా అమ్మా అంటూ లేచి అరుస్తుంది. నొప్పి నొప్పి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ మాటలు విన్న కాంచన కూడా కంగారు పడుతూ వచ్చి డోర్లు తడుతుంది. అయినప్పటికీ దీపా నొప్పిని భరిస్తూ ఏం కాలేదని చెబుతుంది. కాంచన కూడా డోర్ నుంచి వెనక్కి వెళ్లిపోతుంది. దీపకు నొప్పి తగ్గే వరకు కార్తీక్ బాబు సేవ చేస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.



