Andhra King Taluka Day 7 Box Office Collections: 7 రోజుల్లో ఆంధ్రా కింగ్ తాలుకా కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనని నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఆంధ్రా కింగ్ తాలూకా. ఈ చిత్రానికి మహేశ్ బాబు పాచిగోళ్ల దర్శకత్వం వహించారు. కాగా రామ్ పోతినేని – భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించారు. ఈ చిత్రం నవంబర్ 27న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ స్కేల్లో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. మంచి హైప్‌తో బాక్సాఫీస్ వద్ద రంగంలోకి దిగిన ఈ చిత్రం ఆసక్తికరంగా వసూళ్లను సాధిస్తోంది. టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, సిద్ధార్థ్ నూని–జార్జ్ సీ విలియమ్సన్ సినిమాటోగ్రఫీ, వివేక్–మెర్విన్ సంగీతం అందించారు.
ఆంధ్రా కింగ్ తాలూకా బడ్జెట్, బిజినెస్ వివరాలు..
ఈ మూవీకి సంబంధించిన నిర్మాణ వ్యయం, నటీనటుల రెమ్యునరేషన్లు, ప్రింటింగ్, ప్రమోషన్ ఖర్చులు కలిపి మొత్తంగా బడ్జెట్ రూ. 70 కోట్లు అయ్యిందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై క్రేజ్ పెరగడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా వరల్డ్‌వైడ్‌గా రూ. 27 కోట్లు దాటిందని ట్రేడ్ పండితులు వెల్లడించారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
రామ్ పోతినేని సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మాక్సిమమ్ కలెక్షన్లు ఉంటాయనే సంగతి తెలిసిందే. సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ మోత మోగుతుంది. ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆంధ్రా కింగ్ తాలుకా చిత్రం లాభాల్లోకి రావాలంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్ల షేర్, రూ. 60 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు విలువ గట్టారు.
Gunde Ninda Gudi Gantalu December 4th: మీనాకు ఘోర అవమానం.. ప్రభావతి రచ్చ
ఆంధ్రా కింగ్ తాలుకా 7 రోజుల వసూళ్లు..
మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాలు (AP/TS) కలిసి రూ. 2.50 కోట్లు, కర్ణాటక + Rest of India కలుపుకొని రూ. 1 కోటి, ఓవర్సీస్ రూ.1 కోటి వసూల్ చేసింది. ఇలా ఓపెనింగ్ డే వరల్డ్ వైడ్ గా మొత్తం రూ.5 కోట్ల వరకు వసూళ్లు చేసిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఇక 2వ రోజు వరల్డ్ వైడ్ గా రూ. 3.1 కోట్లు ఇండియా నెట్, 3వ రోజు రూ.3.65 కోట్ల ఇండియా నెట్, 4వ రోజు రూ.3.7 కోట్ల నెట్, 5వ రోజు రూ.1.3 కోట్ల ఇండియా నెట్, 6వ రోజు రూ.1.05 కోట్లు నెట్, 7వ రోజు రూ.90 లక్షలు మాత్రమే వసూళ్లు చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇలా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 7 రోజుల్లో రూ.17.85 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసింది. ఇక 8వ రోజు + 9వ రోజు కలుపుకొని ఇండియా నెట్ రూ.21 కోట్లు ఇండియా గ్రాస్, రూ.5 కోట్ల ఓవర్సీస్ కలెక్షన్లు, రూ.26 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిక్ లెక్కలు తెలుపుతున్నాయి.
లాభాల్లోకి రావాలంటే..
రామ్ పోతినేని చిత్రం లాభాల్లోకి రావాలంటే ఇంకా వసూళ్లు సాధించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.26 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకుంది. అంటే ఇంకా 34 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. కాగా 2వ వారంలోని 2వ వీకెండ్ ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు కలిసి వస్తుందనేది చూడాలి.
Disclaimer: ఈ పేజీలోని సినిమా బాక్సాఫీస్ రిపోర్టులకు సంబంధించిన సమాచారం sacnilk.com, ప్రొడక్షన్ హౌస్‌లు, ప్రముఖ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించిన వివరాల ఆధారంగా పొందుపరచడమైంది. సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లకు సంబంధించి వెల్లడించే రిపోర్టులకు ఫిల్మ్ టాకీస్ ఎలాంటి బాధ్యత వహించదు.


