Gunde Ninda Gudi Gantalu December 5th: ప్రభావతికి శిక్ష.. చిన్నబోయిన బాలు

Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్ తెలుగు టెలివిజన్ డైలీ సీరియల్స్‌లో మంచి రేటింగ్‌తో ఆసక్తికరంగా కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 4వ తేదీ 568 ఎపిసోడ్‌ ఇలా జరిగింది. బాలు ఆడిన నిమ్మకాయ నాటకంలో మనోజ్, ప్రభావతి ఇద్దరు బలైన సంగతి తెలిసిందే. మీనా నగలను తానే తీసి అమ్మేసినట్టు ఎట్టకేళకు మనోజ్ అందరి ముందు ఒప్పుకున్నాడు. దీంతో సత్యం కొడుకు మనోజ్ ను అందరి ముందే దారుణంగా కొట్టి, తిట్టాడు. ఇంకా ఎన్ని రోజులు ఇలా చేస్తావని మండి పడ్డాడు. నువ్వు చేసే తప్పులన్నింటికీ నీ తల్లి ప్రభావతి ఎందుకు వత్తాసు పలుకుతుందో నాకు ఇంకా అర్థం కావడం లేదని సత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటాడు.

మనోజ్ ఇలా తయారు కావడానికి తల్లి ప్రభావతినే అసలు కారణం అని సత్యం ఫైర్ అవుతాడు. నీ కొడుకును ఇన్నాళ్లు వెనకేసుకు వస్తూ ఒక దొంగని, క్రిమినల్ ను తయారు చేశావని సత్యం ప్రభావతిపై మండి పడుతాడు. మరోవైపు మీనా, బాలు, శృతి, రవి కూడా ప్రభావతిపైనే గట్టిగా మాట్లాడుతారు. దాంతో ప్రభావతి అలిగి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది. తెల్లవారాకా బాలుకు కామాక్షిని పిలిపించి తల్లి ప్రభావతిని బయటికి రప్పిస్తాడు. బయటికి వచ్చిన ప్రభావతి మీనాను దారుణంగా అవమానిస్తుంది. అసలు ఈ గొడవలన్నింటికీ కారణం మీనానే అని, నీకు బంగారమే కావాలి కదా? తీసుకోమని తన ఒంటిమీద ఉన్న బంగారం, గాజులను తీసి మీనా మొహాన విసిరి కొడుతుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 5వ తేదీ 569వ ఎపిసోడ్ లో చూద్దాం..

Gunde Ninda Gudi Gantalu December 5th Episode

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button