Karthika deepam 2 October 4th : శ్రీధర్ కు షాక్ ఇచ్చిన కార్తీక్ బాబు.. వంటక్కపై అసలు గురి
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 అక్టోబర్ 3వ తేదీ 479వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబును శివ నారాయణ ఇంటికి దూరంగా ఉంచాలని తండ్రి శ్రీధర్ ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ కార్తీక్ బాబు మాత్రం శ్రీధర్ మాటలను ఏమాత్రం పట్టించుకోడు. దీంతో శ్రీధర్ కు రోజురోజుకు ఆవేశం పెరిగి పోతుంది. అసలు కార్తీక్ ఎందుకు చెప్పినా వినిపించుకోవడం లేదంటూ మండి పడుతాడు. జ్యోత్స్నతో ఉన్న అగ్రిమెంట్ ను కూడా క్యాన్సిల్ చేయించడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. ఏకంగా రూ.10 కోట్ల చెక్ కూడా రాసి ఇస్తాడు. కానీ కార్తీక్ బాబు తీసుకోడు. ఇప్పుడు మీ సాయం ఏమీ అవసరం లేదని అంటాడు. దాంతో శ్రీధర్ కు మరింతగా మండి పోతుంది. అసలు కార్తీక్ బాబు మనస్సులో ఏం ఉందో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇక కార్తీక్ బాబును మరోవైపు తల్లి కాంచన కూడా అనుమానిస్తూ ఉంటుంది. నీ తండ్రి చెక్ ఇచ్చి జ్యోత్స్నతో అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేయించే ప్రయత్నం చేసినా కూడా నువ్వు ఎందుకు వినలేదని కార్తీక్ బాబును కాంచన తిడుతుంది. అసలు నీ మనస్సులో ఏముంది? నువ్వు ఎందుకు ఆ ఇంట్లో ఇంకా డ్రైవర్ గా పని చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతుంది.
దీంతో కార్తీక్ బాబు వాటన్నింటికీ నేను ఇప్పుడే సమాధానం చెప్పలేనని అంటాడు. మున్ముందు మీకే తెలుస్తుందని బదులిస్తాడు. ఇక ఇదే సమయంలో శ్రీధర్ కూడా వస్తాడు. నాకు ఇప్పుడు నిజం చెప్పే వరకు అస్సలు వదిలిపెట్టనని అంటాడు. ఆ వెంటనే కార్తీక్ బాబును తండ్రి శ్రీధర్ బయటికి తీసుకెళ్లి ఏం జరిగిందని అడుగుతాడు. దీప రుణం తీర్చుకునేందుకు ఆ ఇంట్లో డ్రైవర్ గా పని చేస్తున్నానని అంటాడు. దీప రుణం తీర్చుకోవడానికి ఆ ఇంట్లో డ్రైవర్ గా పని చేయడానికి సంబంధం ఏంటని అడిగితే ఇక కార్తీక్ బాబు సమాధానం చెప్పడు. కొద్ది రోజులు ఆగితే పూర్తి విషయాలు నీకే తెలుస్తాయని, ఇప్పుడు నన్నేమీ అడగొద్దని కార్తీక్ బాబు అంటాడు. దాంతో శ్రీధరే తెలుసుకోవాలని అనుకుంటాడు. ఈ సందర్భంగా తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక అక్టోబర్ 4వ తేదీ 480 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

జ్యోత్స్న తన తండ్రి దశరథ, తాత శివ నారాయణకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. నష్టాల్లో ఉన్న తమ రెస్టారెంట్ ను లాభాల్లోకి తీసుకు రావాలని అనుకుంటుంది. ఇదే సమయంలో మార్కెట్ లో తమ రెస్టారెంట్ లాభాల్లోనే ఉందని తెలియజేసేలా ఒక దివాలా తీసిన రెస్టారెంట్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇక తాజాగా దశరథ, శివ నారాయణతో కలిసి వేలం పాటకు వెళ్లాలని సిద్ధం అవుతుంది. ఇదే సమయంలో కార్తీక్ బాబు, దీపాలు కూడా రోజువారీగానే ఇంటికి పనికి వస్తారు. కార్తీక్ బాబు వస్తే రెస్టారెంట్ వేలం పాటలో పాల్గొనకుండా అడ్డుకుంటాడని జ్యోత్స్న ఎంతగానో కంగారు పడుతుంది. ఇక చివరికి తను అనుకున్నట్టుగానే కార్తీక్ బాబు సమయానికి వస్తాడు. వేలం పాటకు వెళ్తూ జ్యోత్స్న సుమిత్ర పాదాలకు నమస్కరించి ఆశీర్వదించు అమ్మ అని అడుగుతుంది. నీ ఆశీర్వాదాలు ఉంటే నేను ఎంతటి జఠిలమైన సమస్యల్లో ఉన్న సులువుగా బయట పడుతానని, విజయం తన సొంతమే అవుతుందని జ్యోత్స్న అంటుంది.
దాంతో సుమిత్ర తన కూతురుగా భావిస్తున్న జ్యోత్స్నను మనస్ఫూర్తిగా దీవిస్తుంది. నువ్వు అనుకున్నది జరగాలని అంటుంది. ఇక వీళ్లు బయల్దేరే సమయంలో కార్తీక్ బాబును కూడా దశరథ రమ్మని చెబుతాడు. కానీ మనకు ఇవ్వాళ డ్రైవర్ అవసరం లేదు నాన్న, కారు నేను డ్రైవ్ చేస్తానని అంటుంది. కారు నువ్వే డ్రైవ్ చేయు అమ్మ కానీ కార్తీక్ వస్తాడు అని దశరథ బదులిస్తాడు. మనతో డ్రైవర్ ఎందుకు అని మళ్లీ జ్యోత్స్న అంటుంది. కార్తీక్ బాబు వచ్చేది డ్రైవర్ గా కాదు మన ఇంటి మనిషిగా అని బదులిస్తాడు. ఎందుకు అని జ్యోత్స్న అడగ్గా అనుభవం ఉన్న వాళ్లు ఉంటే మంచిది కదా అని శివ నారాయణనే బదులిస్తాడు. మీరు ఉన్నారు కదా మళ్లీ కార్తీక్ ఎందుకని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. కొన్ని సందర్భాల్లో చిన్న వాళ్ల సలహాలు, సూచనలు కూడా పదునుగా ఉంటాయి. అందుకు కార్తీక్ ను కూడా తీసుకొని వస్తున్నామని చెబుతాడు. ఇంకేమీ మాట్లాడకుండా బయల్దేరమని శివ నారాయణ చెబుతాడు. దాంతో అక్కడి నుంచి వేలం పాట జరిగే హోటల్ కు వెళ్తారు. ఇక అక్కడ వీరికి పాత శత్రువు వైరా కలుస్తాడు. అతను శివ నారాయణ, దశరథను చూసి పలకరిస్తారు. కానీ 10 ఏళ్ల కింద వైరా చేసినా మోసాన్ని గుర్తు చేసుకొని వారు మండి పడుతారు. నీలాంటి వాడితో మాకు మాట్లాడటం కూడా ఇబ్బందిగానే ఉందని చెప్పి వేలం పాట జరిగే వేదిక వద్దకు వెళ్తారు.
Kantara Chapter 1: నీకు దండం.. కాంతార ఛాప్టర్ 1 మూవీపై సందీప్ రెడ్డి వంగ ఆసక్తికరమైన రివ్యూ!
ఇక జ్యోత్స్నను కూడా వైరా పలకరిస్తాడు. నేను మీ నాన్న స్నేహితుడిని, చాలా కాలం తర్వాత కలిశాము. ఇప్పుడు మీ రెస్టారెంట్స్ బాధ్యతలన్నింటినీ మీరే చూస్తున్నారని తెలుస్తోంది. అలాగే మీ రెస్టారెంట్ కూడా దివాలా తీసే పరిస్థితిలో ఉందని విన్నాను. ఎప్పుడైనా నడపడం ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పండి నేను కొంటాను. వీలైతే చెప్పండి లీజ్ కైనా తీసుకుంటానని జ్యోత్స్నను రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు. దాంతో జ్యోత్స్నకు మండిపోతుంది. నీకు అలాంటి అవకాశం ఎప్పటికీ రాదని, ఇప్పుడు వేలం పాటలోనూ మేమే నెగ్గుతామని ఛాలెంజ్ చేస్తుంది. ఇక వేలం పాట మరికొద్ది క్షణాల్లో జరుగుతుందనగా జ్యోత్స్న ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. దశరథ, శివ నారాయణ వేలం పాటలో ఉంటే తనను సరిగా వేలం పాడనివ్వరని, తమ రెస్టారెంట్స్ మీద ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని ఫేక్ కాల్ చేయిస్తుంది. ఇక వెంటనే దశరథ, శివ నారాయణ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అలాగే కార్తీక్ బాబును కూడా తీసుకొని వెళ్లిపోతారు. దాంతో వైరా మీద ఎలాగైనా గెలవాలని వేలం పాటకు జ్యోత్స్న సిద్ధం అవుతుంది. మరోవైపు దీపాను సుమిత్ర సూటిపోటు మాటలతో ఇబ్బంది పెడుతుంది. తనకు నచ్చిన వంటలు వండమని చెప్పి నానా మాటలు మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.



