Karthika deepam 2 November 29th: జ్యోత్స్నకు వణుకు పుట్టించిన కార్తీక్ బాబు.. శ్రీధర్ ఆవేదన
Karthika deepam 2 November 29th Episode 529 : కార్తీక దీపం 2 సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతున్న ఈ ఫేమస్ సీరియల్ తాజా ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే నవంబర్ 28వ తేదీ 527వ ఎపిసోడ్ లో జ్యోత్స్న చేసిన కోట్ల దోపిడీని జ్యోత్స్న గ్రూఫ్ ఆఫ్ రెస్టారెంట్స్ కంపెనీ కొత్త సీఈవో శ్రీధర్ బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఎవ్వరికీ తెలియకుండా జ్యోత్స్న కంపెనీకి సంబంధించిన 2 కోట్ల 30 లక్షల రూపాయలను తప్పదీసిందని శ్రీధర్ సీఈవోగా లెక్కలు చేయించి బయట పెడుతాడు. ఈ విషయం తెలిసిన వెంటనే జ్యోత్స్నపై శివ నారాయణ, తండ్రి దశరథ ఇద్దరూ ఫైర్ అవుతారు. తమకు తెలియకుండా కంపెనీలో నుంచి అంతా డబ్బు తీసి ఏం చేశావని శివ నారాయణ, దశరథ ప్రశ్నిస్తూ ఉంటారు. మరోవైపు జ్యోత్స్న మాత్రం ఇప్పుడు వీళ్లకు ఇలా అడ్డంగా దొరికిపోయానని మదిలో టెన్షన్ పడుతూ ఉంటుంది.
అయినప్పటికీ జ్యోత్స్న తనను తాను రక్షించుకునేందుకు పలు విధాలుగా అబద్ధాలు కూడా ఆడుతుంది. అందులో ముఖ్యంగా జ్యోత్స్న తనలో తాను ఆలోచించుకుంటూ మౌనంగా ఉంటుంది. దాంతో పారుజాతం జ్యోత్స్నను ఒక చెంపదెబ్బ వేస్తుంది. నువ్వు మౌనంగా ఉంటావేంటీ అని ప్రశ్నిస్తుంది. దాంతో జ్యోత్స్న తేరుకొని అసలు విషయం చెబుతుంది. ఆ డబ్బుతో తన తల్లి సుమిత్ర కోసం సిటీ బయట ల్యాండ్ కొన్నానని అంటుంది. కానీ బహూకరించడానికి సరైన సమయం రాలేదని చెబుతుంది. ఇక దాంతో అందరూ సైలెంట్ అయిపోతారు. కంపెనీ డబ్బులను అలా నీ ఇష్టానికి ఖర్చు చేయడం ఏమాత్రం బాగాలేదని అంటారు. మరోవైపు జ్యోత్స్న దీపపై కుట్ర చేస్తుంది. దీపకు ప్రెగ్నెన్సీ కన్ఫమ్ కావడంతో జీర్ణించుకో లేకపోతుంది. ఎలాగైనా దీప సంతోషాన్ని విచ్ఛిన్నం చేయాలని భావిస్తుంది. అందుకు వ్యూహాలు రచిస్తుంది. అదే సమయంలో దాసు ఎంట్రీ ఇస్తాడు. జ్యోత్స్న మాటలను పూర్తిగా వింటాడు. కాబట్టి తర్వాత ఏం జరిగిందనేది కార్తీక దీపం 2 నవంబర్ 29వ తేదీ 529వ ఎపిసోడ్ లో చూద్దాం..

జ్యోత్స్నకు దాసు వార్నింగ్..
దీప విషయంలో జ్యోత్స్న మాటలకు దాసు షాక్ అవుతాడు. జ్యోత్స్న పారుతో మాట్లాడుతూ దీపకు ప్రెగ్నెంట్ అవ్వడం, అది కూడా కార్తీక్ బాబుతో దీప తల్లి కావడం నాకు ఏమాత్రం నచ్చడం లేదని జ్యోత్స్న అంటుంది. ఎలాగైనా దీపను కార్తీక్ బావకు దూరం చేయాలని పారుతో చెబుతూ ఉంటుంది. ఇక ఆ మాటలను దాసు వింటాడు. దాంతో వెంటనే జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు. అసలు నువ్వు దీప విషయంలో ఇంతటి విషంతో ఉండటం నీకే మంచిది కాదని హెచ్చరిస్తాడు. ఇకపై నువ్వు దీప గురించి ఎంత త్వరగా మర్చిపోతే నీకే అంత మంచిదని అంటాడు. లేదంటే నువ్వే ప్రమాదం చిక్కుకుంటావని సూచిస్తాడు. నేను పని మీద బయటికి వెళ్తున్నాను. మళ్లీ వచ్చే లోపు దీపకు ఏదైనా హాని చేశావని తెలిస్తే మాత్రం నువ్వే నా కూతురువి అని శివ నారాయణతో చెబుతాను అని హెచ్చరిస్తాడు. కానీ జ్యోత్స్న బతిమిలాడటంతో సరేనని వెనక్కి తగ్గుతాడు.
దశరథకు శ్రీధర్ విన్నపం..
శివ నారాయణ కొడుకు దశరథకు శ్రీధర్ ప్రత్యేకంగా విన్నపం తెలియజేస్తాడు. నాకు నువ్వు ఒక సాయం చేయాలి బావ అని అడుగుతాడు. నేను నీకు చేయగలిగే సాయం ఏమీ ఉంది బావ అని దశరథ శ్రీధర్ ను ప్రశ్నిస్తాడు. దాంతో శ్రీధర్ మాట్లాడుతూ.. నన్ను కాంచనను మళ్లీ కలిపే బాధ్యత నీపైనే ఉంది బావ అని శ్రీధర్ దశరథతో అంటాడు. దాంతో దశరథ ఆశ్చర్యంగా చూస్తాడు. చెల్లికి నీకు ఏ విధంగా చెప్పాలి బావ అని అడుగుతాడు. గతంలో తనతో కాంచన ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంటే సరిపోతుందని అంటాడు. ఇదే సమయంలో ఇంట్లో వాళ్లందరూ హాలులోకి వస్తారు. పారుజాతం, జ్యోత్స్న, కార్తీక్ బాబు, దీప, శివ నారాయణ అందరూ వస్తారు. అందరి ముందే పారుజాతం శ్రీధర్ పరువు తీస్తుంది. అనరాని మాటలు అంటుంది.
Gunde Ninda Gudi Gantalu November 28th: ప్రభావతి, మనోజ్‌లకు ప్రాణగండం.. బాలు దెబ్బకు మైండ్ బ్లాక్
పారుజాతం షాకింగ్ కామెంట్స్..
శ్రీధర్ తన మనస్సులోని బాధను బావ దశరథకు చెప్పుకోవడంతో పక్కనే పారు జాతం శ్రీధర్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తుంది. అసలు నీతో ఎందుకు కాంచన కలిసి ఉండాలని, అసలు నిన్ను ఎందుకు కాంచన క్షమించాలని అడుగుతుంది. దాంతో దీప పారుజాతంపై ఫైర్ అవుతుంది. వీలైంతే మనుషులకు సాయం చేయాలి కానీ హేళన చేయకూడదని అంటుంది. అయినప్పటికీ పారుజాతం తగ్గదు. శ్రీధర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటుంది. ఇక గతంలో లాగా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి? చేస్తావా? అని ప్రశ్నిస్తుంది. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే మాత్రం నిన్ను కాంచనతో కలిపే బాధ్యతను నేను తీసుకుంటానని అంటుంది. దాంతో శ్రీధర్ ఏం చేయాలని అడుగుతాడు. నువ్వు కావేరిని వదిలేస్తే కాంచనతో నేను మాట్లాడుతానని, నువ్వు అందుకు సిద్ధమా అని ప్రశ్నిస్తుంది. పారు మాటలకు అంతా షాక్ అవుతారు. ఇక శ్రీధర్ కూడా చాలా బాధ పడుతారు. దీంతో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి నేరుగా కాంచన ఇంటికి వెళ్తాడు.
కాంచన ఆవేదన..
పారుజాతం అన్న మాటలకు అవమానం భరించలేక శ్రీధర్ నేరుగా కాంచనతోనే ఈ వ్యవహరం తేల్చుకుంటానని అక్కడికి వెళ్తాడు. కాంచనను పిలిచి మీ ఇంట్లో నాకు అవమానం జరిగిందని అంటుంది. నువ్వు నన్ను మునుపటిలా చూడాలంటే నేను ఏం చేయాలని అడుగుతాడు. ఇదే విషయాన్ని మీ ఇంట్లో వాళ్తో అడిగితే వాళ్లు కావేరి వదిలేయమని సలహానిస్తున్నారు. అలా చేస్తే నీకు సమ్మతమేనా? అని శ్రీధర్ కాంచనను అడుతాడు. కానీ కాంచన మాత్రం అందుకు ఒప్పుకోదు. అసలు నీకు నా మనస్సులో ఏమాత్రం చోటు లేదని ముక్కుసూటిగా చెబుతుంది. ఇకపై ఇలాంటి విషయాలను అడగటానికి సాహసం చేయొద్దని అంటుంది. నువ్వు ముందు ఏ జీవితం కోసం వెళ్లావే అలాగే ఉండమని చెబుతుంది. అయినా నేను నిన్ను వదిలేసి రాలేదని, నువ్వు నన్ను వద్దనుకొని వెళ్లిపోయావని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాంచన మాటలకు శ్రీధర్ మౌనంగా ఉండిపోతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.



