Karthika deepam 2 December 2nd: జ్యోత్స్న కుట్ర.. దీపకు ప్రమాదం
Karthika deepam 2 December 2nd Episode 530 : కార్తీక దీపం 2 సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతున్న ఈ ఫేమస్ సీరియల్ తాజా ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే డిసెంబర్ 1వ తేదీ 529వ ఎపిసోడ్ లో కార్తీక్ బాబు జ్యోత్స్నల మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. జ్యోత్స్న దీప విషయంలో పలు కుట్రలకు పూనుకుంటూ ఉంటుందనే విషయాన్ని కార్తీక్ బాబు గమనిస్తూ ఉంటాడు. దీంతో వెంటనే దీపకు కావాల్సినంత రక్షణను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాడు. ఇదే సమయంలో జ్యోత్స్న కుట్రలను కూడా తిప్పికొడుతూ వస్తుంటాడు. మరోవైపు జ్యోత్స్నకు కార్తీక్ బాబు వార్నింగ్ కూడా ఇస్తాడు. అందుకు జ్యోత్స్న చేసిన రచ్చే కారణం. దీపను జీవితంలో కోలుకో లేని విధంగా దెబ్బ తీయాలనే జ్యోత్స్న ప్రయత్నం కార్తీక్ బాబును ఆగ్రహానికి గురి చేస్తుంది.
ఎప్పటి లాగే కార్తీక్ బాబు, దీపాలు ఇద్దరు శివ నారాయణ ఇంటికి పని మనుషుల్లాగానే వస్తారు. అయితే దీప ప్రెగ్నెంట్ అయిన తర్వాత శివ నారాయణ, దశరథ, సుమిత్రలు దీప విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. దీపను ఇకపై కార్తీక్ ఇంట్లోనే రెస్ట్ తీసుకోమని చెబుతారు. ఇప్పటి నుంచి ఎక్కువగా పనులు చేయడం సరికాదని అంటారు. పలు జాగ్రత్తలు కూడా చెబుతారు. దాంతో దీప ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తుంది. అయితే ఇదే సమయంలో దీప కడుపు ఎత్తి పోయేలా చేయాలని జ్యోత్స్న పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. దీంతో హాలులో మాట్లాడిన తర్వాత తిరిగి కిచెన్ లోకి వెళ్తున్న దీపను కింద పడేసేలా కాలు అడ్డం పెడుతుంది. కానీ దీపను కింద పడకుండా సుమిత్ర కాపాడుతుంది. అయితే ఈ విషయంపై కార్తీక్ బాబు దీపకు వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది కార్తీక దీపం 2 డిసెంబర్ 2వ తేదీ 530వ ఎపిసోడ్‌లో చూద్దాం..

దీపను కాపాడిన సుమిత్ర
ఎప్పటికప్పుడు దీపను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు కార్తీక్ బాబు. ఇక దీప ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత నుంచి మరింత జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాడు. అయితే జ్యోత్స్న మాత్రం దీపను శోఖసంద్రంలోకి నెట్టి వేయాలని ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది. ఇదే సమయంలో తాజా ఎపిసోడ్ లో జ్యోత్స్న దీపను కింద పడేసే ప్రయత్నం చేస్తుంది. దీపకు శివ నారాయణ కుటుంబం పలు సూచనలు, సలహాలు చేసిన తర్వాత సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక వెంటనే దీప హాలులో నుంచి కిచెన్ లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో దీప వెళ్తూ ఉంటే పక్కనే జ్యోత్స్న కాలు అడ్డం పెడుతుంది. దాంతో దీప ముందర ఉన్న టేబుల్ పై తన కడుపు తగిలేలా పడబోతుంది. కానీ ఆ పక్కనే ఉన్న సుమిత్ర వెంటనే దీపను పట్టుకుంటుంది. టేబుల్ కు దీప కడుపు తగలకుండా అడ్డుకుంటుంది. ఇక దీప పడబోవడం చూసి శివ నారాయణ, దశరథ, కార్తీక్ బాబు అంతా కంగారు పడుతారు. సుమిత్ర పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకుంటారు.
Gunde Ninda Gudi Gantalu December 2nd: మనోజ్, ప్రభావతికి గుండె దడ.. బాలు స్కెచ్
కార్తీక్ బాబు అనుమానం..
దీపను కింద పడేయాలని జ్యోత్స్న కాలు అడ్డం పెట్టడాన్ని ఒక్క పారుజాతం తప్ప మరెవ్వరూ చూడబోరు. ఇక కార్తీక్ బాబు కూడా చూడలేకపోతాడు. దాంతో అసలు దీప కింద ఎలా పడబోయిందనే విషయంలో స్పష్టత లేకుండా పోతుంది. మరోవైపు దీప కూడా జ్యోత్స్ననే కాలు అడ్డం పెట్టిందనే విషయాన్ని ఎవ్వరికీ చెప్పదు. కానీ కార్తీక్ బాబుకు మాత్రం జ్యోత్స్న వల్లనే దీప కింద పడబోయిందనే అనుమానం వ్యక్తం అవుతుంది. దాంతో వెంటనే కార్తీక్ బాబు జ్యోత్స్న దగ్గరకు వెళ్తాడు. అప్పటికే జ్యోత్స్న దీప కింద పడకపోవడంతో అసంతృప్తిగా ఉంటుంది. అసలు దీపను తన నిజమైన తల్లి సుమిత్రనే కాపాడటం ఏంటనీ, పైగా గతంలో తన తల్లిని తన కూతురు దీపనే కాపాడింది. ఇలా విధి మాత్రం తల్లి కూతుర్లను ఒకరికొకరిని రక్షించుకునేలా సమయం కల్పిస్తుంది అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక రాబోయే మనవరాలిని కూడా సుమిత్ర కాపాడుకుందని అప్సెట్ అవుతూ ఉంటుంది. ఇదే సమయంలో జ్యోత్స్నపై అనుమానం ఉన్న కార్తీక్ బాబు వార్నింగ్ ఇచ్చేందుకు వెళ్తాడు.
Andhra King Taluka Movie Review: ఆంధ్రా కింగ్ తాలూకా – హిట్టా, ఫట్టా?
జ్యోత్స్నకు కార్తీక్ బాబు వార్నింగ్..
కార్తీక్ బాబు జ్యోత్స్న దగ్గరకు వచ్చే సమయానికి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. అసలు దీప కడుపును ఎలా ఎత్తగొట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇదే సమయంలో కార్తీక్ బాబు వచ్చి జ్యోత్సను పలు ప్రశ్నలు అడుగుతాడు. దీప కింద పడబోవటానికి కారణం నువ్వేనా అని ప్రశ్నిస్తాడు. అందుకు జ్యోత్స్న నేను ఏమాత్రం కాదని చెబుతుంది. అసలు నీకు నేనే పడేశానని స్పష్టం తెలుసా అని అడుగుతుంది. దాంతో కార్తీక్ బాబు నువ్వే అని అనుమానం మాత్రమే ఉంది. నిజమని తెలిస్తే ఇప్పటికే నీ తల ఇప్పటికే పలిగిపోయేదని చెబుతాడు. దాంతో జ్యోత్స్న వణికిపోతుంది. ఫస్ట్ టైమ్ కార్తీక్ బాబు చాలా సీరియస్ గా జ్యోత్స్నకు వార్నింగ్ ఇవ్వడంతో చెమటలు పడుతాయి. దీప విషయంలో ఏదైనా తేడా జరిగితే మాత్రం అస్సలు సహించేది లేదని అన్నాడు.
మరోవైపు పారుజాతం కూడా జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తుంది. పారిజాతం జ్యోత్స్న గదిలోకి వెళ్లి బ్యాగ్ లో బట్టలు సర్దుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావని జ్యోత్స్న పారుజాతాన్ని ప్రశ్నిస్తుంది. వెళ్లేది నేను కాదు నువ్వు అని అంటుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్తేనే ప్రశాంతంగా ఉండేలా ఉందని అంటుంది. అసలు నువ్వు దీపను కాలు అడ్డంపెట్టి పడేయడం నేను చూశాను. ఆ విషయం గనుక ఇంట్లో వాళ్లకు తెలిస్తే మాత్రం మెడ పట్టి గెంటేస్తారు. నీ వల్ల నేను ప్రమాదంలో పడేలా ఉన్నానని ఆందోళన వ్యక్తం చేస్తుంది. కానీ జ్యోత్స్న మాత్రం తనసైడ్ ఉండి ఆలోచించమని చెబుతుంది. దాంతో పారు అసలు మంట ఇక్కడ కాదు కార్తీక్ ఇంట్లో పెట్టాలని, వెంటనే కాంచనకు ఫోన్ చేస్తుంది. ఇక దీపా కూతురు శౌర్య పాప గురుంచి షాకింగ్ మాటలు మాట్లాడుతుంది. కాంచన మనస్సును మార్చే మాటలు చెబుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.



