Karthika deepam 2 December 1st: కార్తీక్ బాబుకు కొత్త సవాల్.. దీపాకు అత్త కాంచన వార్నింగ్

Karthika deepam 2 December 1st Episode 529 : కార్తీక దీపం 2 సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతున్న ఈ ఫేమస్ సీరియల్ తాజా ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే నవంబర్ 29వ తేదీ 528వ ఎపిసోడ్ లో కార్తీక్ బాబు జ్యోత్స్నకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అంతకంటే ముందు శివ నారాయణ అల్లుడు శ్రీధర్ శివ నారాయణ ఇంటికి వెళ్లి తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు. కొన్నాళ్లుగా తను అనుభవిస్తున్న బాధను కాంచన అన్నయ్య దశరథతో చెప్పుకుంటాడు. కాంచనను శ్రీధర్ వదిలి పెట్టి వెళ్లడంతో ఇక కాంచన అస్సలే మాట్లాడటం మానేసింది. అయితే కాంచనతో ఎన్నడూ శ్రీధర్ బంధాన్ని తెంచుకోలేదు. ప్రస్తుతం కుటుంబ వ్యవవహారాలన్నీ చక్కదిద్దుతున్నా కాంచన శ్రీధర్ మధ్య బంధం చిగురించడం లేదు.

దాంతో శ్రీధర్ తన బావమరిది దశరథను ఇలా వేడుకుంటాడు. తనతో కాంచన మాట్లాడేలా చేయాల్సిన బాధ్యత నీపైనే ఉందని శ్రీధర్ అంటాడు. కానీ దశరథ మాత్రం ఎలాంటి సమాధాం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇదే సమయంలో పారుజాతం ఎంట్రీ ఇస్తుంది. శ్రీధర్ జీవితం గురించి చాలా కఠినంగా మాట్లాడుతుంది. నీకు ఇద్దరు పెళ్లాలు కావాల్సి వచ్చిందా? అల్లుడు అని ప్రశ్నిస్తుంది. దాంతో పారుజాతంపై కార్తీక్ బాబు, దీపా ఫైర్ అవుతారు. వీలైతే సాయం చేయాలే కానీ దెప్పి పోవడం మంచి పద్ధతి కాదని దీపా అంటుంది. మరోవైపు దీపాను కిందపడేయాలని జ్యోత్స్న కాలు అడ్డం పెడుతుంది. దాంతో దీపాపై అందరికీ మరింత సానుభూతి పెరుగుతుంది. అది చూసిన జ్యోత్స్న తట్టుకోలేకపోతోంది. ఈ విషయంలోనే కార్తీక్ బాబు జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు. ఇలాంటివి మానుకోవాలని హెచ్చరిస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది కార్తీక దీపం ఇది నవ వసంతం డిసెంబర్ 1న తేదీ 529వ ఎపిసోడ్ లో చూద్దాం..

Karthika Deepam 2 December 1st Episode

శ్రీధర్ కు షాకిచ్చిన కావేరి..

శివ నారాయణ ఇంట్లో శ్రీధర్ కు అవమానం జరగడంతో వెంటనే శ్రీధర్ ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తాడు. కాంచనతో మళ్లీ తన బంధం బలపడాలని కోరుకుంటున్న శ్రీధర్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే దశరథను సాయం కోరాడు. అలాగే కాంచనను కూడా అడిగేందుకని నేరు వాళ్ల ఇంటికి వెళ్తాడు. ఇంట్లో కాంచన ఒక్కతి మాత్రమే ఉంటుంది. శ్రీధర్ రాగానే కార్తీక్ బాబు లేడని చెబుతుంది. నేను వచ్చి కూడా కార్తీక్ బాబు కోసం కాదు నీకోసమే అని కాంచనతో అంటాడు. నాతో మీకేం పని ఉంటుందని శ్రీధర్ ను ప్రశ్నిస్తుంది. నాకు నీతోనే పని ఉంది. మీ ఇంటికి వెళ్తే అక్కడ జ్యోత్స్న, పారుజాతం నన్ను అవమానించారు. నాకు కాంచనతో ఉండాలని ఉందంటే దారుణంగా మాట్లాడారని చెబుతాడు. అసలు నేను కావేరి వదిలి వస్తే నువ్వు నన్ను నీ జీవితంలోకి తిరిగి స్వాగతిస్తావా? అని అడుగాడు. అందుకు కాంచన అంగీకరం ఇవ్వదు. అది జరగని పని అని అంటుంది. ఇక శ్రీధర్ మరింతగా ఆవేదన చెందుతాడు. అసలు నీకు ఏమైందని ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. ఇదే సమయంలో కావేరి అనుకోకుండా కాంచన ఇంటికి వస్తుంది.

Gunde Ninda Gudi Gantalu December 1st: రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మనోజ్, ప్రభావతి.. తాట తీసిన బాలు

శ్రీధర్ గుట్టు రట్టు..

కావేరి కాంచన ఇంటికి వస్తుంది. వస్తు వస్తూ తాటిబెల్లం ముద్దలు, కొన్ని పిండి వంటలు చేసుకొని వస్తుంది. దీపా ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా సంతోషించానని అంటుంది. అసలు నా కోడలు దీపా ఎక్కడ ఉందని పిలుస్తూ ఉంటుంది. ఇక కాంచన స్పందిస్తూ దీపా ఇంట్లో లేదని చెబుతుంది. రావడానికి టైమ్ పడుతుందని చెబుతుంది. ఇదే సమయంలో శౌర్య పాప ఎంట్రీ ఇస్తుంది. కావేరితో హాయ్ నాన్నమ్మ అని అంటుంది. నాకు హాయ్ చెప్పావు గానీ మరీ శ్రీధర్ తాతకు చెప్పవా? అని ప్రశ్నిస్తుంది. ఇక శౌర్య స్పందిస్తూ శ్రీధర్ తాత ఎప్పుడూ వస్తూనే ఉన్నాడు కదా.. కొత్తగా హాయ్ చెప్పడం దేనికీ అని అంటుంది. దాంతో కావేరి శ్రీధర్ వైపు గుర్రుగా చూస్తుంది. శ్రీధర్ తరుచుగా ఆ ఇంటికి వచ్చి వెళ్తున్నాడని తెలుసుకుంటుంది. వస్తే ఏం పర్లేదులే ఈ ఇల్లు కూడా ఆయనదే కదా అని వ్యంగ్యంగా బదులిస్తుంది.

Karthika deepam 2 November 29th: జ్యోత్స్నకు వణుకు పుట్టించిన కార్తీక్ బాబు.. శ్రీధర్ ఆవేదన

కాంచనపై శ్రీధర్ ఫైర్..

కావేరి, శ్రీధర్, కాంచన మాట్లాడుతూ ఉండగానే కార్తీక్ బాబు, దీపలు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. ఇక కార్తీక్ బాబు ఇంట్లో వస్తూ వస్తూనే తండ్రి శ్రీధర్ ను పలకరిస్తాడు. పిన్ని తీసుకొని ఇప్పుడే వచ్చారా? మాస్టర్ అని అడుగుతాడు. దాంతో కావేరి స్పందిస్తూ నేను ఒక్కదాన్నే వచ్చాను బాబు, అప్పటికే మీ నాన్న ఇక్కడ ఉన్నారని చెబుతుంది. ఇక శ్రీధర్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కాంచనపై ఫైర్ అవుతాడు. అసలు నీకు దీపాపై ప్రేమ లేదు, పగ ఉందని అంటాడు. ఆయన మాటలతో అందరూ షాక్ అవుతారు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావని కాంచన కూడా ఆశ్చర్యపోతుంది. ఇక శ్రీధర్ మాట్లాడుతూ దీపా ఈ రోజు మీ నాన్న ఇంట్లో పని చేస్తూ కింద పబోయింది. తన కడుపు హాలులో ఉన్నటేబుల్ కు తగిలి ప్రమాదం జరిగి ఉండేది. దేవుడి దయవల్ల ఏం కాలేదని చెబుతాడు. ఆ విషయం విన్న కాంచన షాక్ అవుతుంది. అసలు నువ్వు దీపా, కార్తీక్ బాబులను మీ నాన్న ఇంటికి ఎందుకు పంపిస్తున్నావని కాంచనపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నీ కోడలు దీపపై నీకు ఎలాంటి ప్రేమ లేదని మండిపడుతాడు. ఈ విషయంపై కాస్తా ఆలోచించమని అంటాడు.

Andhra King Taluka Day 1 Box Office Collections: రామ్ పోతినేని స్టామినా.. ఆంధ్రా కింగ్ తాలూకా ఓపెనింగ్ డే ఎన్ని కోట్లంటే?

కాశీకి జాబ్ ఆఫర్.. కానీ..

కార్తీక్ బాబు ఇంట్లో దీప గురించి అసలు విషయాలను శ్రీధర్ కాంచనకు చెప్పి ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి వెళ్లిన తర్వాత శ్రీధర్ తన అల్లుడు కాశీకి షాకింగ్ న్యూస్ చెబుతాడు. కాశీ తన బెడ్ రూమ్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇదే సమయంలో కాశీ భార్య స్వప్న ఒక లెటర్ వచ్చిందని సంతోషంగా తీసుకొని వచ్చి కాశీకి అందిస్తుంది. దాంతో కాశీ ఆ లెటర్ జాబ్ గురించేనా అని ప్రశ్నిస్తాడు. నువ్వే చూడమని స్వప్న చేతికి అందిస్తుంది. ఎంతో సంతోషంగా ఆ లెటర్ ను ఓపెన్ చేసి చదువుతాడు. కానీ చాలా అప్సెట్ అవుతాడు. వెంటనే వెళ్లి తన మామ శ్రీధర్ పై ఫైర్ అవుతాడు. నాకు జాబ్ ఆఫర్ ఇచ్చింది మీరేనా అని ప్రశ్నిస్తాడు. అందుకు శ్రీధర్ అవునని అంటాడు. ఇంతకీ ఏం జాబ్ అని కావేరి అడుగుతుంది. దాంతో ఆగ్రహంతో ఉన్న కాశీ స్పందిస్తూ జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈవో శ్రీధర్ గారికి పీఏగా నాకు జాబ్ ఆఫర్ చేశారని అంటాడు. పీఏ అయితే చేయవా? అని శ్రీధర్ అడుగుతాడు. నాకు ఇష్టం లేదని లెటర్ అక్కడ పెట్టేసి తన గదిలోకి వెళ్తాడు. ఇక ఆ వెంటనే స్వప్న కాశీ ఈ ఉద్యోగానికి వస్తాడు నాన్న అని తండ్రి శ్రీధర్‌కు హామీనిస్తుంది. వెంటనే వెళ్లి కాశీని ఒప్పిస్తుంది.

దీపాకు కాంచన హెచ్చరిక..

శ్రీధర్ అన్న మాటలకు కాంచన బుర్ర గిర్రుమని తిరుగుతుంది. అసలు ఎందుకని కార్తీక్ బాబు, దీపాలు మా నాన్న శివ నారాయణ ఇంటికి పని మనుషులుగా వెళ్తున్నారు. దీపా ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉండి కూడా ఎందుకు వెళ్తుందని ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీధర్ అడిగిన మాటల్లోనూ న్యాయం ఉంది కదా అని అనుకుంటుంది. ఇక వెంటనే ఈ విషయంపై అడిగేందుకు దీపా, కార్తీక్ ల దగ్గరకు వెళ్తుంది. అప్పటికే వారిద్దరూ కాంచనకు ఎలా సమాధానం చెప్పాలని చర్చిస్తూ ఉంటారు. అసలు తాత శివ నారాయణ ఇంటికి ఎందుకు వెళ్తున్నావో నిజం చెప్పేద్దామా? అని దీప కార్తీక్ తో అంటుంది. ఆ విషయం కాంచన వింటుంది. అసలు ఆ నిజం ఏంటని నిలదీస్తుంది. అసలు మీరు ఆ ఇంటికి పని మనుషుల్లాగా ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నిస్తుంది. ఇకపై దీప ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదని, వెళ్తే పరిణామాలు మరోలా ఉంటాయని కాంచన దీపాను హెచ్చరిస్తుంది. అలాగే కార్తీక్ బాబును కూడా మందలిస్తుంది. ఇకపై మీరు నా మాట వినాల్సిందేనని చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కార్తీక్ బాబు తండ్రి శ్రీధర్ పై మండిపడుతాడు. ఆయన వల్ల ఇప్పుడు నేను ఇరుక్కోవాల్సి వచ్చిందని ఆవేదన చెందుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button