Trending

Gunde Ninda Gudi Gantalu Octobert 3rd: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మీనా.. ప్రభావతి, రోహిణి కుట్రకు పూలగంప బలి

Gunde Ninda Gudi Gantalu : తెలుగు టెలివిజన్ డైలీ సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ చాలా చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఎపిసోడ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక అక్టోబర్ 2వ తేదీ 523వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రస్తుతం రోహిణి అసలు కొడుకు చింటూ ఆస్పత్రిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయం కూడా ఇంట్లో వాళ్లకు తెలుస్తుంది. కానీ చింటూనే రోహిణి వాళ్ల అసలు కొడుకు అనే నిజాన్ని ఎవ్వరికీ తెలియకుండా రోహిణి జాగ్రత్త పడుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం చింటూకు కళ్లకు ఉన్న సర్జికల్స్ ను తీయిచేందుకు ఆస్పత్రికి తీసుకొని వస్తారు. చికిత్స తర్వాత చింటూ కళ్లు తెరిచి మొదటగా తల్లి రోహిణినే చూస్తాడు. అమ్మా నోరార పిలవడంతో రోహిణి కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతుంది. వెంటనే తన కొడుకు చింటూను గుండెలకు హత్తుకుంటుంది. నన్ను నీతో పాటే తీసుకెళ్లిపో అమ్మా అని చింటూ అడుగుతాడు. ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు నేనే తీసుకొని వెళ్లిపోతానని రోహిణి అంటుంది. ఇక అదే సమయంలో బాలు రోహిణి అటు వైపు రావడం చూసి రోహిణి చింటూను హెచ్చరిస్తుంది. నువ్వు వాళ్ల ముందు నన్ను అమ్మ అని పిలవకూడదని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచేసింది. ఇక అక్టోబర్ 3వ తేదీ 524 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu Serial October 3rd

బాలు స్నేహితుడు తన పెళ్లి ఉందని చెప్పి ఇంటికి వచ్చి వెడ్డింగ్ కార్డు ఇస్తాడు. ఈ క్రమంలో పెళ్లి కార్డు తీసుకున్న బాలు తన స్నేహితుడికి కొన్ని మాటలు చెబుతాడు. నీది అరెంజ్ మ్యారేజ్ కాబట్టి జాగ్రత్తగా ఉండమని బాలు తన ఫ్రెండ్ తో అంటాడు. మీ అన్నయ్య ఇంట్లో నుంచి పోయాడని అంటున్నావ్.. ఎవరో తీసుకొచ్చి అంటగట్టకుండా చూసుకోమని బాలు అంటాడు. దాంతో మీనా బాలు తనను ఉద్దేశించే అంటున్నాడని భావిస్తుంది. వెంటనే కిచెన్ లోకి వెళ్లిపోతుంది. ఇక బాలు చెప్పాల్సిన మాటలు చెప్పిన తర్వాత తన ఫ్రెండ్ ను సాగనంపుతాడు. ఇక మీనా కిచెన్ లో బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో అత్త ప్రభావతి మరింతగా బాధ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వెంటనే మీనాకు వినిపించేలా మనోజ్, రోహిణిలతో దారుణంగా మాట్లాడుతుంది.

OG Movie 7 Days Box Office Collection: 7 రోజుల్లో OG బాక్సాఫీస్ కలెక్షన్.. ఎన్ని కోట్లంటే?

మొత్తానికి బాలు తన మనస్సులో ఉన్న మాటలను ఇన్నాళ్లకు బయట పెట్టాడు. మీనాను బాలుకు అంట గట్టారని, అసలు మీనాపై ఎలాంటి ప్రేమ లేదని, తండ్రి సత్యం మాట కోసం మీనాతో కాపురం చేస్తున్నాడని తేలిపోయింది. బాలునే మీనాను పరోక్షంగా అంటున్నాడని ప్రభావతి మీనాకు వినిపించేలా అంటుంది. దీంతో మీనా ఆ మాటలు విని చాలా బాధ పడుతుంది. బాలు నిజంగానే తనను అన్నాడని నమ్ముతుంది. ఇక కిచెన్ లో తను కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. వెంటనే బాలును కడిగేయాలని అనుకుంటుంది. అత్త ప్రభావతి పెట్టిన చిచ్చుతో బాలు, మీనా మధ్య గొడవ మొదలు అవుతుంది. ఇక బాలు మీనా దగ్గరకి టిఫిన్ పెట్టమని తిరిగి వస్తాడు. కానీ మీనా మాత్రం కోపంతో రగిలిపోతుంది. నా స్నేహితుడి పెళ్లికి వెళ్దామని, గుర్తు చేయమని బాలు మీనాతో అంటాడు. అందుకు మీనా మాత్రం నేను ఎక్కడకి రాను, ఏదీ గుర్తుకు చేయబోనని అంటుంది. నాకు దేని గురించి అవసరం లేదని మీనా కోపంగా చెబుతుంది. దాంతో ఏమైంది మీనా నీకు ఎందుకలా అంటున్నావని అడుగుతాడు. మా అమ్మ ఏమైనా అందా అని ప్రశ్నిస్తాడు. ఎప్పుడూ ఆవిడే అనాలని ఏమైనా ఉందా అని మీనా ప్రశ్నిస్తుంది.

ఓటీటీలోకి హరిహర వీరమల్లు.. ఇక్కడ చూసేయండి

మరి ఇంకెవ్వరైనా ఏమైనా అన్నారా అని బాలు ప్రశ్నిస్తూనే ఉంటాడు. దీంతో మీనా నువ్వు మాత్రం ఏమీ అనలేదా అని అంటుంది. నేను ఏమీ అన్నానని బాలు మీనాతో అంటాడు. ఇక మీనాతో స్పందిస్తూ ఇందాక మీ ఫ్రెండ్ తో కలిసి నన్ను నీకు అంటగట్టారని చెబుతున్నావ్ కదా అని అంటుంది. నేను అలా చెప్పలేదని బాలు మీనాతో చెబుతాడు. కానీ నువ్వు చెప్పింది అలానే ఉందని అంటుంది మీనా. నేనంటే ఇష్టం లేకున్నా కూడా నువ్వు నాతో కాపురం చేస్తున్నట్టు నటిస్తున్నావ్ కదా అని మీనా మండి పడుతుంది. అలాంటిది ఏమీ లేదని బాలు మీనాకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ మీనా ఫైర్ మీద ఉండి బాలు చెప్పే మాటలను అస్సలు పట్టించుకోదు. దీంతో బాలు కూడా కోపంగా కిచెన్ నుంచి డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్తాడు. ఇక కోపంలో మీనా ఎలాంటి టిఫిన్ చేయదు. దాంతో అందరూ టిఫిన్ కోసమని కిందికి వస్తారు. మనోజ్, రోహిణి ఏం టిఫిన్ చేయలేదా? అని అంటారు.

విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్.. కింగ్డమ్ కు ఎన్ని కోట్లంటే?

దీంతో మీనా మండి పడుతుంది. నీకు పెళ్లాం ఉంది ఏం కావాలో ఆమెకు చెప్పి చేయించుకోండి అని మనోజ్ తో అంటుంది. దీంతో మనోజ్, రోహిణి, ప్రభావతి షాక్ అవుతారు. ఇక రవి, శృతి మాత్రం మీనాకు ఇవ్వాళ బాలేనట్టుగా ఉంది. ఏం ఫర్వాలేదు. మేం బయటికి వెళ్లి తింటాము. మీనా నువ్వు శాంతించేందుకు ప్రయత్నించు అని చెప్పి వెళ్లిపోతారు. మరోవైపు ప్రభావతి మాత్రం మీనాపై మండి పడుతుంది. నీకు పని చేయడం ఇష్టం లేక ఇలా మాట్లాడుతున్నావ్ కదానే అని ఫైర్ అవుతుంది. ఇకపై నేను టిఫిన్ చేసేదే లేదని చెప్పి తన గదిలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మీనాకు తన తల్లి నుంచి కూడా ఫోన్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఇంట్లో జరిగిన కోపంతో తల్లి పార్వతీపైనా కూడా మీనా అరుస్తుంది. ఇక బాలు, రోహిణి, మనోజ్, రవి, శృతి అందరూ తమతమ పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి చేరుకుంటారు. కానీ మీనా మాత్రం ఎవ్వరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. నా చావుకు ఎవ్వరు బాధ్యులు కాదని లెటర్ రాసి వెళ్లిపోతుంది. దీంతో బాలు మీనా కోసం నగరం మొత్తం వెతుకుతుంటాడు. కానీ ఎక్కడా కనిపించదు. దాంతో అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button