Gunde Ninda Gudi Gantalu December 3rd: మనోజ్ జీవితం తలికిందులు.. మీనాపై నింద

Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్ తెలుగు టెలివిజన్ డైలీ సీరియల్స్‌లో మంచి రేటింగ్‌తో ఆసక్తికరంగా కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 2వ తేదీ 566 ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన సన్నివేశాలు సాగాయి. బాలు కొద్దిరోజులుగా ఇంట్లోని బంగారాన్ని ఎవరు దొంగలించారో తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇదే సమయంలో బాలు ఒక మంత్రించిన నిమ్మకాయను తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ అదులుకే మనోజ్, ప్రభావతి చాలా కంగారు పడుతూ వచ్చారు. అంతే కాదు వారు కూడా తమకు ఏమీ కాకూడదనే ఉద్దేశంతో మరో స్వామిజీ వద్దకు వెళ్లి మరో మంత్రించిన నిమ్మకాయను తీసుకొని వస్తారు. దాంట్లో ఇంట్లో ఉంచుతారు.

బాలు మాత్రం ఎలాగైనా అసలు నిజాన్ని మనోజ్ నోటితోనే చెప్పించాలని అనుకుంటాడు. అందుకు అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత బాలు మనోజ్ ను టార్గెట్ చేస్తాడు. మళ్లీ నిమ్మకాయను ఆయుధంగా వాడి మనోజ్ ను భయ పెట్టాలని చూస్తాడు. అందుకు ఒక ప్లాన్ వేస్తాడు. బాలు మనోజ్ గది దగ్గరకు వెళ్లి తలుపు తడుతాడు. ఆ తర్వాత మనోజ్ పైన నిమ్మకాయ విసిరి భయపెడుతాడు. ఇక నిమ్మకాయతో పలు మాయలు చేసి మనోజ్ ను ఆందోళనకు గురి చేస్తాడు. మరోవైపు ప్రభావతి కూడా రాత్రంతా నిద్రపోకుండా ఉంటుంది. ఇదే సమయంలో మనోజ్ తన తల్లి ప్రభావతికి ఫోన్ చేసి భయంగా ఉందని చెబుతాడు. దాంతో ఇద్దరు హాలులోకి వచ్చి కలుస్తారు. ఇక ఆ నిమ్మకాయలను తీసి భయట పడేయాలని అనుకుంటారు. అలాగే వాటిని తీసి బయటకి వెళ్తుంటే బాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. ఇక వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది డిసెంబర్ 3వ తేదీ 567వ ఎపిసోడ్ లో చూద్దాం..

Gunde Ninda Gudi Gantalu Serial December 3rd

ప్రభావతిపై కుటుంబం ఫైర్..

మనోజ్, ప్రభావతి అర్ధరాత్రి నిమ్మకాయలను బయట పడేయాలని ప్రయత్ని కుటుంబం మొత్తానికి దొరికి పోతారు. దీంతో బాలు, మీనా, సత్యం, శృతి అందరూ వారిద్దరిపై ఫైర్ అవుతారు. అంతే కాదు మనోజ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అసలు ఎందుకు నువ్వు ఇలా చేశావని మనోజ్ ను అందరూ అడుగుతూనే ఉంటారు. దానికి మనోజ్ తడబడుతూ సమాధానాలు ఇస్తారు. దీంతో మనోజ్ ను కొన్నాళ్లుగా వెనకేసుకొని వస్తున్న తల్లి ప్రభావతిని బాలు, మీనా, సత్యం, శృతి గట్టిగా మందలిస్తారు. అసలు నీ వల్లే మనోజ్ ఇప్పుడు దొంగగా మారిపోయాడని అంటారు. దాంతో ప్రభావతి ఇందులో నా తప్పేమీ లేదని చెబుతుంది. వాడు బిజినెస్ లో మోసపోయాడని తెలిసి, రక్షిద్దామని అనుకున్నానని అంటుంది. నువ్వు రక్షించే పద్ధతి ఇదేనా అని సత్యం ప్రభావతిపై మండి పడుతాడు.

Karthika deepam 2 December 3rd: కార్తీక్ బాబుకు ఆపద.. జ్యోత్స్న, పారుల కుట్ర

తప్పును ఒప్పుకున్న మనోజ్..

ఇక మనోజ్ ఆ నగలు అమ్మేసింది నేనేనని ఒప్పుకుంటాడు. తనకు బిజినెస్ లో మోసం జరిగిందని, దాని నుంచి భయట పడేందుకు ఆ నగలు అమ్మేశానని, వాటి స్థానంలో గిల్ట్ నగలు పెట్టానని చెబుతాడు. దాంతో పక్కనే ఉన్న సత్యంకు ఒళ్లు మండిపోతుంది. నీలాంటి కొడుకు నాకు చెడపుట్టాడురా అని తండ్రి సత్యం ఫైర్ అవుతాడు. అంతే కాదు మనోజ్ వీపును వాయిస్తాడు. దీంతో తల్లి ప్రభావతి, కోడలు రోహిణి ఆపే ప్రయత్నం చేస్తారు. మరోవైపు బాలు కూడా మనోజ్ ను దారుణంగా తిడుతాడు. అసలు ఇలాంటి దొంగ బుద్ధితో ఉంటే నువ్వే బిజినెస్ మెన్ అవుతావురా? అని మండిపడుతాడు. అంతే కాదు మనోజ్ దొంగ బుద్ధి గురించి, నగలు అమ్మేసిన సంగతిని కనీసం నువ్వైనా చెప్పాలి కదా అని రోహిణిని కూడా ప్రశ్నిస్తాడు. ఇక రోహిణి నాకు ఆ విషయం ఇప్పుడే తెలుసని అంటుంది.

Samantha Ruth Prabhu Wedding : సమంత రెండో పెళ్లి.. ఎక్కడ జరిగిందో తెలుసా?

ప్రభావతిపై సత్యం ఆగ్రహం..

మనోజ్ చేసిన పనికి మీనా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎన్ని సార్లు మీరు మోసం చేసినా చూసీచూడనట్టుగా ఉన్నాం. ఈసారి మమ్మల్ని మోసం చేయడమే కాకుండా, మాపైనే నింద కూడా వేశారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసలు నీ భర్తకు కనీసం నువ్వైనా చెప్పుకోవాలి కదా అని రోహిణికి కూడా మీనా చివాట్లు పెడుతుంది. ఇదే సమయంలో మీనాపై ప్రభావతి నోరు పారేసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ సత్యం ప్రభావతి నోరు మూయిస్తాడు. ఇన్నాళ్లు చేసిన తతంగమే ఇదంతా.. వాడు 40 లక్షలు ఎత్తుకెళ్లినప్పుడు, పార్కులో పడుకున్నప్పుడు, లక్ష రూపాయలు దొంగలించినప్పుడు, ఇప్పుడు నగలు దొంగలించినప్పుడు ఎప్పుడూ సాయంగా నిలుస్తూనే వచ్చావు. నీ వల్లనే ఇవ్వాళ వాడి దొంగబుద్ధి బయట పడింది. ఇంకా నువ్వు మనోజ్ కు సపోర్ట్ చేస్తూనే చెడగొడుతున్నావు. నీవల్లే సమస్యలన్నీ అని సత్యం ప్రభావతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu December 2nd: మనోజ్, ప్రభావతికి గుండె దడ.. బాలు స్కెచ్

టెన్షన్ పెట్టిన ప్రభావతి..

సత్యం ఆవేశంలో అన్న మాటలకు ప్రభావతి సైలెంట్ అవుతుంది. నోరు మెదపకుండా కాసేపు చూస్తుంది. ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ నా వల్లే అన్నీ సమస్యలు ఇక నేను మీకు ఎవ్వరికీ కనిపించను. అందరూ నాపైనే అరుస్తున్నారు. తప్పు చేసింది ఒకరైతే నింద మాత్రం నాపై వేస్తున్నారని ఏడుస్తూ తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. దీంతో కొడుకులు, కోడళ్లు అందరూ వెళ్లి ప్రభావతిని బయటకి రమ్మని పిలుస్తూ ఉంటారు. కానీ ఎంతకు ప్రభావతి గది నుంచి బయటికి రాదు. దీంతో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందా? అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ బాలు వచ్చి మా అమ్మావతికి అంతటి ధైర్యం లేదని చెప్పి అందరినీ వెనక్కి తీసుకెళ్తాడు.

సత్యం కీలక నిర్ణయం..

మనోజ్, ప్రభావతిల దొంగ నాటకాల గురించి బాలు, మీనా బయట పెట్టడంతో పెద్ద గొడవగా మారిందని వారిద్దరు అనుకుంటారు. దాంతో తన తండ్రి సత్యం బాధ పడాల్సి వచ్చిందని బాలు బాధ పడుతాడు. ఇక అందరూ వెళ్లి సత్యంను ఓదార్చాలని ప్రయత్నిస్తారు. అలాగే గదిలో ఉన్న ప్రభావతిని కూడా పిలవండి అని కోరుతారు. కానీ సత్యం మాత్రం నేను అస్సలు పిలవను. ఆ మనిషితో నాకు ఇకపై ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తాడు. ఇకపై నేను మాట్లాడే సమస్యే లేదని అంటాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

Gunde Ninda Gudigantalu Latest Promo

గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 3వ ఎపిసోడ్ ముగింపులో ఆసక్తికరమైన ప్రోమోను వదిలారు. ప్రభావతిపై సత్యం ఇంకా ఆగ్రహంగానే ఉంటారు. మనోజ్ చేసిన పనికి సత్యం బాలు, మీనాలకు ప్రత్యేకంగా క్షమాపణలు చెబుతాడు. అలాగే ప్రభావతి చేసిన పనిని జీర్ణించుకోలేక పోయాయనని అంటాడు. ప్రభావతి నాకు ఎదురు పడితే మనఃశ్శాంతి పోతుందని అంటాడు. ఇదే సమయంలో సత్యం, ప్రభావతిని ఎలాగైనా కలపాలని బాలు, మీనా నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో ఏం జరిగి ఉంటుందనేది మున్ముందు ఎపిసోడ్స్ పై ఆసక్తిని పెంచింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button