Gunde Ninda Gudi Gantalu December 1st: మనోజ్, ప్రభావతికి పక్షవాతం.. ఇంటి దొంగలను పట్టేసిన బాలు
Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్ తెలుగు టెలివిజన్ డైలీ సీరియల్స్‌లో మంచి రేటింగ్‌తో ఆసక్తికరంగా కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. గుండె నిండా గుడి గంటలు నవంబర్ 28వ తేదీ 564 ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన సన్నివేశాలు సాగాయి. మౌనికా సంగతి ముగిన వెంటనే బాలు తన అన్న సంజూపై ఫోకస్ పెడుతాడు. అసలు ఇంట్లో దాచిన మీనా నగలు ఎలా నకిలీగా మారుతాయనే సందేహంలో మునిగిపోతాడు. ఎలాగైనా ఈ విషయంలో నిజానిజాలు తేల్చాల్సిందేనని పట్టుబట్టుకుని కూర్చుంటాడు. దీంతో వెంటనే మనోజ్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి అసలు విషయాలను తెలుసుకుంటాడు. మనోజ్ ఇంట్లో బంగారం అమ్మేశాడనే నిజాన్ని బాలు జీర్ణించుకోలేకపోతాడు.
ఇక మనోజ్ నోటితోనే అసలు నిజాన్ని కక్కించాలని ప్రయత్నిస్తాడు. ఇందుకు ఒక స్వామీజీ దగ్గరకు వెళ్లినట్టు ఇంట్లో వాళ్లందరికీ చెబుతాడు. ఆ స్వామీజీ తనకు ఒక మంత్రించిన నిమ్మకాయను ఇచ్చాడని, ఆ నిమ్మకాయ బంగారం దొంగలించిన వారి గురించి చెబుతుందని అంటాడు. ఆ నిమ్మకాయ చాలా పవర్ ఫుల్ అని, దాన్ని ఒక్కరోజు ఇంట్లో ఉంచితే ఆ దొంగల శరీరంలోని పూర్తి అవయవాలను పని చేయకుండా చేస్తుందని భయపెడుతాడు. బాలు మాటలకు అందరూ భయపడి పోతారు. ముఖ్యంగా మనోజ్, ప్రభావతి తమకు ఏమౌతుందోనని వణికిపోతారు. అప్పటికే వారికి కాళ్లు చేతులు పడిపోతున్న లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మనోజ్ కు, ప్రభావతికి రాత్రి నిద్ర కూడా పట్టదు. ఎవరి గదిలో వారు తమ శరీరాన్ని పదే పదే తడుముతూ, అద్దంలో చూసుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది డిసెంబర్ 1వ తేదీ 565వ ఎపిసోడ్ లో చూద్దాం..




