Gunde Ninda Gudi Gantalu November 28th: ప్రభావతి, మనోజ్‌లకు ప్రాణగండం.. బాలు దెబ్బకు మైండ్ బ్లాక్
Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్ తెలుగు టెలివిజన్ డైలీ సీరియల్స్‌లో మంచి రేటింగ్‌తో ఆసక్తికరంగా కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. గుండె నిండా గుడి గంటలు నవంబర్ 27వ తేదీ 563 ఎపిసోడ్లో ఆసక్తికరమైన సన్నివేశాలు సాగాయి. చెల్లి మౌనిక విషయంలో కాస్తా అప్సెట్ అయిన బాలు దృష్టి మళ్లీ అన్న మనోజ్ వైపు మళ్లుతుంది. అసలు ఇంట్లో దాచిన మీనా బంగారు నగలు నకిలీ నగలుగా ఎలా మారాయనేది తెలుసుకోవాలని మళ్లీ ప్రయత్నాలు మొదలు పెడుతాడు. దాంతో మనోజ్ స్నేహితుడు పార్క్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి అసలు విషయం ఏంటని అడుగుతాడు. అతను ఎంతకు చెప్పడు.
దాంతో బాలు తనకు అప్పుగా 2 లక్షలు కావాలని అడుగాడు. దాంతో మనోజ్ పార్క్ ఫ్రెండ్ నా దగ్గర అన్నీ లక్షలు ఉంటే పార్క్ లు ఎందుకు ఖాళీగా కూర్చుంటానని అంటాడు. మీ అన్నయ్యకు కూడా 4 లక్షలు నేను ఇవ్వలేదని చెబుతాడు. ఆ 4 లక్షలు కూడా మీ ఇంట్లో బంగారం అమ్మేసి తెచ్చాడని అంటాడు. దాంతో మనోజ్ అమ్మేసిన బంగారం మీనాదే అని బాలు స్పష్టం చేసుకుంటాడు. దీంతో ఎలాగైనా మనోజ్ చేతనే నిజం కక్కించాలని అనుకుంటాడు. ఇందుకు ఒక మాస్టార్ ప్లాన్ వేస్తాడు. ఒక స్వామిజీ దగ్గరకు వెళ్లి మంత్రించిన నిమ్మకాయ తీసుకొని వచ్చానని, ఆ నిమ్మకాయ ఒక్కరోజు ఇంట్లో కూడా బంగారు నగలు కొట్టేసిన వారి శరీరంలో అవయవాలన్నీ పాడైపోతాయని హెచ్చరిస్తాడు. దాంతో మనోజ్, ప్రభావతి వణికిపోతారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నవంబర్ 28వ తేదీ 564వ ఎపిసోడ్ లో చూద్దాం..

బాలు మాస్టర్ ప్లాన్..
మీనా సొంత బంగారాన్ని దొంగలించిన మనోజ్ ఎంతకు నిజం ఒప్పుకోకపోవడంతో బాలు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఎలాగైనా మనోజ్ అసలు విషయం కక్కించాలని ప్రయత్నిస్తాడు. అందుకు ఒక మంత్రించిన నిమ్మకాయ అంటూ నాటకం ఆడుతాడు. ఆ నిమ్మకాయను తీసుకొచ్చి మీనా నగలు దొంగలించిన వారికి పక్షవాతం వస్తుందని, వారి శరీరం పూర్తిగా పని చేయకుండా పోతుందని వారిద్దరిని భయపెడుతాడు. ఇక వెంటనే వెళ్లి ఆ నిమ్మకాయను తమ ఇంట్లోని దేవుడి గదిలో పెట్టి వస్తాడు. ఆ నిమ్మకాయకు చాలా పవర్ ఉందని గట్టిగా నొక్కి చెబుతాడు. నగలు దొంగలించిన వారు ఎంతటి వారైనా సరే ఆ మంత్రించిన నిమ్మకాయ వారి సంగతి చూస్తుందని చెబుతాడు. దాంతో మనోజ్, ప్రభావతి ఇద్దరూ వణికిపోతారు.
మీనాతో బాలు నిజం..
అసలు బాలు నుదిట మొత్తం విభూతి, బొట్లు, స్వామిజీ దగ్గరకు వెళ్లానంటూ, మంత్రించిన నిమ్మకాయ తెచ్చానంటూ ఇంట్లో హాడావుడి చేస్తుంటాడు. దాంతో బాలు చేసిన రచ్చకు మీనా ఆశ్చర్యపోతుంది. అసలు విషయం ఏంటో తెలియక కాస్తా కంగారు పడుతుంది కూడా. అయితే అందరూ వెళ్లిపోయిన తర్వాత బాలు మీనాను కిచెన్ గదిలోకి తీసుకొచ్చి అసలు విషయం చెబుతాడు. మీనా బాలును ఇలా ప్రశ్నిస్తుంది. అసలు మీరు ఏ స్వామిజీ వద్దకు వెళ్లి వచ్చారని అడుగుతుంది. దాంతో బాలు ఆ స్వామిజీ చాలా పవర్ ఫుల్ అని చెబుతాడు. దీంతో ఆయన మరెవరో కాదు బాలు స్వామిజీ అని అంటాడు. దాంతో మీనా మంత్రించిన నిమ్మకాయ తెచ్చింది బాలునే అని కనిపెడుతుంది. మొత్తానికి ఇక బాలు కూడా మీనా దగ్గర నిజం ఒప్పుకుంటాడు. అన్న మనోజ్, తల్లి ప్రభావతి తప్పించుకుంటూ తిరుగుతున్నారు అని ఈ కొత్త నాటకం మొదలు పెట్టానని అంటాడు.
ఆందోళనలో మనోజ్, ప్రభావతి..
మంత్రించిన నిమ్మకాయ అంటూ బాలు మనోజ్, ప్రభావతి గుండెల్లో ఆందోళన పెంచాడు. బాలు వ్యూహానికి మనోజ్ చిక్కుకున్నాడు. అంతే కాదు ఇక రాత్రి పడుకున్న తర్వాత మనోజ్ కూడా బాలు చెప్పినట్టుగానే తనకు ఏదేదో అయినట్టుగా ఊహించుకుంటాడు. నిద్రలోంచి సడెన్ గా లేచి తన మూతి, చేతులు వంకర పోయినట్టుగా భ్రమలో ఉంటాడు. మరోవైపు ప్రభావతి కూడా ఆ నిమ్మకాయ వల్ల భయపడుతుంది. ఇక ఎలాగైనా ఆ నిమ్మకాయను తీసి బయట పడేయాలని అనుకుంటుంది. నెమ్మదిగా హాలులోకి వస్తుంది. ఇదే సమయంలో మనోజ్ కూడా ఆ నిమ్మకాయను తీసేద్దామని హాలులోకి వస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు వెనకాల నుంచి గుద్దుకుంటారు. భయపడుతారు కూడా. వెంటనే భయం నుంచి తేరుకొని ఆ నిమ్మకాయ గురించి మాట్లాడుతారు. మరోవైపు దాని వల్ల ఏమౌతుందోననే భయం వెంటాడుతుందని మనోజ్ అంటాడు. నాకు కూడా అలాగే ఉందిరా అని తల్లి ప్రభావతి చెబుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.
Gunde Ninda Gudigantalu Latest Promo
గుండె నిండా గుడి గంటలు నవంబర్ 28వ ఎపిసోడ్ ముగింపులో ఆస్తికరమైన ప్రోమోను వదిలారు. బాలు తెచ్చిన మంత్రించిన నిమ్మకాయకు విరుగుడుగా మరో మంత్రించిన నిమ్మకాయను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలని ప్రభావతి నిర్ణయించుకుంటుంది. అందుకని వెంటనే ఏదైనా ఉపాయం చెబుతుందని ప్రభావతి కామాక్షికి ఫోన్ చేస్తుంది. కామాక్షి ఫోన్ లిఫ్ట్ చేసి ఒక మంత్ర విద్యలు చేసిన స్వామిజీ దగ్గరకు వెళ్దామని అంటుంది. వాళ్లు కూడా సరేనని చెప్పి అందుకు సిద్ధం అవుతారు. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.



