Sasivadane Movie Review: కోమలి ప్రసాద్ శశివదనే మూవీ రివ్యూ!

నటీనటులు : రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, శ్రీమాన్
దర్శకుడు : సాయి మోహన్ ఉబ్బన
బ్యానర్ : ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్ స్టూడియోస్
నిర్మాతలు : అహితేజ బెల్లకొండ, అభిలాష్ రెడ్డి గొడల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీపాల్ చొల్లెటి
సినిమాటోగ్రఫీ : సాయికుమార్ దారా
ఎడిటర్ : గ్యారీ బీహెచ్
మ్యూజిక్ డైరెక్టర్ : శరవణ వాసుదేవన్
బీజీఎం : అనుదీప్ దేవ్
విడుదల తేదీ : 10/10/2025

ప్రేమ కథ చిత్రాలకు ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సరికొత్తగా ప్రదర్శించగలిగితే బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఖాయం. ఇటీవల అత్యల్ప బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించిన లిటిల్ హార్ట్స్ చిత్రమే అందుకు ఉదాహారణ. ఈ క్రమంలోనే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ స్టోరీనే శవివదనే సినిమా. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కథ ఏంటీ? కథనం ఎలా ఉంది? ప్రేమ కథ సరికొత్తగా ఉందా? యువ నటీనటుల పెర్ఫామెన్స్ ఎలా ఉంది? టెక్నీకల్ టీమ్ పనితీరు మెప్పించిందా? నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయి? ఇంతకీ మెప్పించిందా లేదా? అనే వివరాలు ఫిల్మ్ టాకీస్ ప్రత్యేక సమీక్ష ద్వారా తెలుసుకుందాం..

Sasivadane Movie Review

శశివదనే సినిమా కథ..
డిగ్రీ పూర్తి చేసిన కుర్రాడు, అంగన్ వాడీ టీచర్ గా పనిచేసే యువతీ మధ్య సాగే ప్రేమ కథనే ఈ శశివదనే. ఏపీలోని గోదావరి జిల్లాలో గల ఓ గ్రామంలో రాఘవ (రక్షిత్ అట్లూరి) పుట్టి పెరుగుతాడు. చిన్న వయస్సులోనే రాఘవ తల్లిని కోల్పోతాడు. దాంతో రాఘవను తన తండ్రి (శ్రీమాన్) పెంచి పోషిస్తాడు. అన్నీ నేర్పిస్తాడు. చదువుపై ధ్యాస మర్లకుండా ఎప్పుడూ జాగ్రత్త వహిస్తాడు. దీంతో రాఘవకు తండ్రి ప్రేమనే అన్నీ అవుతాయి. ఇక రాఘవా డిగ్రీ పూర్తి చేస్తాడు. ఆపై పీజీ కూడా చదవాలని అందుకు సంబంధించిన పరీక్షలకు సిద్ధం అవుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే రాఘవా శశి(కోమలి ప్రసాద్) అనే అంగన్వాడీ టీచర్ తో ప్రేమలో పడిపోతాడు.

Gunde Ninda Gudi Gantalu Octobert 7th : ఇంటికి తిరిగి వచ్చిన మీనా.. షాక్‌లో బాలు.. అసలు ఎక్కడికి వెళ్లిందంటే?

తొలిచూపులోనే వీరిద్దరి మనస్సులు కలిసిపోతాయి. ఇలా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు కూడా వస్తుంది. కానీ ఇంతలోనే వీరికి శశి వాళ్ల మేన బావ నుంచి ఆపద వస్తుంది. శశిపై అతని కన్ను ఉండటంతో రాఘవకు శశిని దక్కకుండా చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే రాఘవా జైలుకు కూడా వెళ్తాడు. అంతకు ముందు తండ్రిని కూడా కొందరు హత్య చేస్తాడు. ఇలా ఎంతో ప్రశాంతంగా సాగిపోయే రాఘవా జీవితం, శశి ప్రేమతో ఎలాంటి పరిస్థితులకు దారి తీసిందనేది సినిమా కథ అని చెప్పొచ్చు. అయితే రాఘవా జీవితం లక్ష్యం ఏంటీ? శశిని ఎందుకు లవ్ చేశాడు? శశికి వాళ్ల బావతో గొడవ ఏంటీ? రాఘవా శశిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అసలు రాఘవా ఎందుకు జైలు పాలయ్యాడనేది మిగితా కథ.

Idly Kadai Movie Review : ధనుష్ ఇడ్లీ కడాయ్ మూవీ రివ్యూ!

శశివదనే సినిమా కథనం..
సినిమా కథనం చెప్పుకోదగినంతగా లేదనిపిస్తుంది. స్టోరీ రొటీన్ గానే అనిపిస్తుంటుంది. హీరో ప్రేమలో పడటం, హీరోయిన్ వాళ్ల తరుఫు నుంచి ఎవరో ఒకరు వారి ప్రేమకు అడ్డుగా ఉండటం. ఇదే కనిపించింది. అసలు ప్రస్తుతం యూత్ ను ఆకట్టుకునే లవ్ అస్పెక్ట్ ఏదీ అంతగా కనిపించినట్టు లేదు. వారి ప్రేమకు బలమైన సన్నివేశాలు కనిపించలేదు. కథ రొటీన్ గా ఉన్నప్పటికీ కథనం ప్రత్యేకంగా ఉండి ఉంటే మాత్రం సినిమాకు థియేటర్లలో చప్పట్లు పడేవని చెప్పొచ్చు. ఇక మొదటి అర్థం తండ్రితో రాఘవ ఎమోషనల్ సీన్స్, ఆ తర్వాత కోమలి ప్రసాద్ తో లవ్ ట్రాక్ తో సాగుతుంది. గోదావరి అందాలను చూపిస్తూనే వీరి ప్రేమను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశారు. కానీ అది ఎక్కడా వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. ద్వితీయార్థం కూడా కాస్తా సాగదీతలా ఉంటుంది. ముఖ్యంగా ఈ తరం యువత ఆకర్షితులయ్యే అంశాలు మెండుగా ఉంటే బాగుటుందనిపించింది. ఆ విషయంలో కాస్తా హోం వర్క్ చేయాల్సింది.

నటీనటులు, టెక్నీకల్, ప్రొడక్షన్..
నటీనటులుగా రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, శ్రీమాన్ తమదైన శైలిలో మెప్పించారు. సినిమా మొత్తంగా తమ పెర్ఫామెన్స్ తోనే ఆకట్టుకుంటుంది. దీనికి తోడు సరైనా టేకింగ్ ఉంటే శశివదనే గురించి ఓ రేంజ్ లో మాట్లాడుకునే వారు. మిగితా ఆర్టిస్టులు కూడా తమ పెర్ఫామెన్స్ తో దుమ్ములేపారు. టెక్నీకల్ అంశాలు బలంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ తో మెప్పించారు. కథలోనే రుచి ఉండుంటే బాగుండనే భావన కలిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button