The Raja Saab Twitter Review : ది రాజా సాబ్ ట్విట్టర్ రివ్యూ! రెబల్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ది రాజాసాబ్. ఈ చిత్రానికి టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా అందరూ ఎదురు చూశారు. కాగా, తాజాగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మరి కొద్ది గంటల్లో థియేటర్లలో అసలైన సందడి మొదలు కానుంది. అయితే అంతకంటే ముందే ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఏర్లీ రివ్యూస్ ట్విట్టర్ వేదికన దర్శనమిస్తున్నాయి.

ట్విట్టర్ లో రాజాసాబ్ హవా..
ది రాజాసాబ్ సినిమాపై ఎంతో ఆశలు పెంచిన దర్శకుడు మారుతీ రెబల్ ఫ్యాన్స్ ను ఏ మేరకు మెప్పించాడనేది తమ రివ్యూల ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకైతే ది రాజాసాబ్ (The Rajasaab) సినిమా ప్రీమియర్స్ ప్రపంచ వ్యాప్తంగా అటు యూఎస్, ఇటు ఇండియాలోనూ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అభిమానులు ముందుగానే ది రాజాసాబ్ సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు ఇస్తున్న రివ్యూలు ఇలా ఉన్నాయి.

The Rajasaab Movie Twitter Review

The Rajasaab ఫస్ట్ హాఫ్..
ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రం ప్రథమార్థం బాగుందనే టాక్ వినిపిస్తోంది. ఒక అభిమాని ది రాజా సాబ్ ఫస్ట్ హాఫ్ బ్లాక్ బాస్టర్ అని ట్వీట్ చేశాడు. ప్రభాస్ వింటేజ్ లుక్ తో అదరగొట్టాడని చెప్పుకొచ్చాడు. మారుతీ కూడా తన దర్శకత్వంతో ర్యాంప్ ఇచ్చాడని అభిప్రాయపడ్డాడు. థమన్ మొదటి భాగంలో మ్యూాజిక్, బీజీఎం ఇరగదీశాడని చెప్పుకొచ్చాడు.

మరో అభిమాని, ముఖ్యంగా ది రాజా సాబ్ చిత్రంలో నటించిన హీరోయిన్ నిధి అగర్వాల్ ఫ్యాన్ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. మొదటి భాగంలోనే సుహానా సాంగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఆ సాంగ్ అదిరిపోయిందని, థమన్ బీజీఎం, మ్యూజిక్ కూడా ఇరగదీశాడని చెప్పుకొచ్చింది.

ఇలా ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు, అభిమానులు ది రాజాసాబ్ మొదటి భాగం గుడ్ బాగుందని చెబుతున్నారు. ప్రభాస్ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటోందని, అలాగే మారుతీ దర్శకత్వానికి విజువల్ సపోర్ట్ అదిరిపోయిందని అంటున్నారు.

ప్రభాస్ ను పూర్తి స్థాయిలో ఫస్ట్ హాఫ్ లో వాడుకోలేక పోయినా ఇప్పటి వరకు కథ పర్లేదనే రివ్యూలు వస్తున్నాయి. ఇక ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ తన తాత (సంజయ్ దత్) కోసం వెతికే సన్నివేశాలు, సంజయ్ దత్ సీన్లు బాగుంటాయని చెబుతున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ కేక పుట్టిస్తుందని, 40 నిమిషాల పాటు ఆసక్తికరంగా సాగుందని తెలుపుతున్నారు. సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉందంటున్నారు.

ఇక సెకండ్ హాఫ్ కూడా అదిరిపోయిందని చెబుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం పీక్స్ లో ఉంటుందని, డార్లింగ్ అభిమానులను మెప్పించేలా మారుతీ డిజైన్ చేశారని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ మోడ్ లో ఉంటే, సెకండ్ హాఫ్ మొత్తం మాస్ జాతర అని చెబుతున్నారు. క్లైమాక్స్ 30 నిమిషాలు చాలా సరికొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే 4 రేటింగ్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇక మరి కొన్ని గంటల్లో పూర్తి స్థాయిలో రివ్యూ రాబోతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button