మూడేండ్లుగా మనస్సులో అదే బాధ.. బాంబ్ పేల్చిన సమంత

స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సమంత రూతు ప్రభు 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. చిన్న హీరోయిన్ నుంచి
స్టార్ హీరోగా తను ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఇప్పటికీ సమంత అంతంతకు ఎదుగుతూనే ఉండటం విశేషం.

అయితే సమంత రూత్ ప్రభు గత కొన్ని రోజులు తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూనే ఉంది. ఇప్పటికే పెళ్లి గురించి చెప్పి తన అభిమానులను ఖుషి చేసింది. కాగా తాజాగా తన సోషల్ మీడియా పోస్ట్ తో మరింతగా ఆసక్తిని పెంచింది. తన తాజా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లో జిమ్ వర్కౌట్ ఫొటోలను పంచుకుంటూ తన అభిమానులకు కొత్త విషయాన్ని తెలియజేసింది.

Samantha Ruth Prabhu Wedding

 

సమంత రూత్ ప్రభు పోస్ట్ ప్రకారం.. ‘ఈ బ్రాండ్‌ను నిర్మించడంలో గత పన్నెండు నెలలు ఉత్తేజకరమైనవి, పునాది వేయడం మరియు చాలా ఉద్దేశపూర్వకంగా ఉన్నాయి. భయం మరియు స్వీయ సందేహం నెమ్మదిగా నమ్మకంగా రూపాంతరం చెందాయి. మూడు సంవత్సరాల క్రితం, నేను ప్రతిదానినీ ప్రశ్నించాను… నేను ఎవరు, నేను ఏమి అందించాను.

నన్ను భిన్నంగా చేసింది ఏమిటి. నేడు, దృష్టి స్పష్టంగా ఉంది. నేను నా స్వంత స్థితికి వస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. ఇది ఒక మలుపులా అనిపిస్తుంది: నన్ను నేను విశ్వసించడం, నా నిర్ణయాలకు కట్టుబడి ఉండటం మరియు మెరుగైన జీవనం వైపు మనల్ని నడిపించే ఉత్పత్తులను సృష్టించడం.

రేపు మనం ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి సిద్ధమవుతున్నప్పుడు, నేను ఉత్సాహంగా ఉన్నాను… మరియు కొంచెం భావోద్వేగానికి గురవుతున్నాను.
కృతజ్ఞత. పునాది. గర్వం. ప్రయాణం. వృద్ధి. నా లక్ష్యాన్ని కనుగొనడమే.. అంటూ చెప్పింది. అయితే ఆ విషయం ఏంటనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం తన జీవితంలో హ్యాపీగా ఉంటూనే.. మరోవైపు తన కెరీర్ లోనూ స్పీడ్ పెంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button