Samantha Ruth Prabhu Wedding : సమంత రెండో పెళ్లి.. ఎక్కడ జరిగిందో తెలుసా?
ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి చేసుకుంది. తాజాగా ఈ విషయం తన స్నేహితురాలి ద్వారా వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సమంత రూత్ ప్రభు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందిన సంగతి తెలిసిందే. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. నార్మల్ హీరోయిన్ గా మొదలైన ఆమె కెరీయర్ ఇప్పుడు స్టార్ హీరోలకు ఏమాత్రం తీసి పోకుండా నిలబడింది. సమంత సినిమాలకూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ కూడా ఏర్పడటం గొప్ప విషయం. ఇలా కెరీయర్ విషయంలో సమంత ఎన్నో సవాళ్లను ఎదుర్కోంటూనే, వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ టాప్ హీరోయిన్ గా ఎదిగింది.

అప్పట్లో గుప్పుమన్న రూమర్లు..
సమంత రూత్ ప్రభు పెళ్లి వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. గతంలో ఈ స్టార్ హీరోయిన్ అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా జీవించిన వీరిద్దరి మధ్య ఏదో తెలియని చెడు గాలి వీచింది. ఎవరి దిష్టితో తగిలి వారిద్దరూ విడిపోయే వరకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళను పెళ్లి చేసుకుని తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇదే సమయంలో సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమైంది. గతం నుంచి సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ సమంత మాత్రం ఎప్పుడూ ఆ విషయాన్ని గతంలో అధికారికంగా ప్రకటించలేదు. కానీ వీరిద్దరూ త్వరలో ఒక్కటి కాబోతున్నట్టు ప్రకటనలు అందుతూనే ఉన్నాయి.
Karthika deepam 2 December 3rd: కార్తీక్ బాబుకు ఆపద.. జ్యోత్స్న, పారుల కుట్ర
ఎట్టకేళకు ఒక్కటై..
ఇక తాజాగా సమంత రూతు ప్రభు తన అభిమానులకు శుభవార్త చెప్పింది. డిసెంబర్ 1న ఘనంగా రెండో పెళ్లి చేసుకున్నట్టు తెలియజేసింది. కొన్నాళ్లుగా తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహాం చేసుకున్నట్టుగా తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. తన వెడ్డింగ్ కు సంబంధించిన పలు బ్యూటీఫుల్ ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది. ఇక వీరి వివాహాం తమిళనాడులోని కోయంబత్తూరులో గల ఇషా ఫౌండేషన్ లో ఘనంగా జరగడం విశేషం. ఏదేమైనా సమంత రెండో పెళ్లి చేసుకోవడం పట్ల అభిమానులు సంతోషిస్తున్నారు.
Gunde Ninda Gudi Gantalu December 3rd: మనోజ్ జీవితం తలికిందులు.. మీనాపై నింద
30 మంది అతిథులు..
సమంత రూత్ ప్రభు వివాహం బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఇషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో ఉదయం 6 గంటలకే వీరి వివాహా వేడుక మొదలైంది. వీరి వివాహానికి 30 మంది మాత్రమే అతి సన్నిహితులు అథితులుగా హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ఆధ్యాత్మిక బాటలో నడుస్తూ భూత కాల వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వారిని అతిథులు నిండు మనస్సుతో ఆశీర్వదించారు. అంతే కాదు సమంత రూత్ ప్రభు అభిమానులు కూడా ఆమె రెండో వివాహం పై ఆనందం వ్యక్తం చేశారు. సమంతను చెప్పిన శుభవార్తకు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇకపై ఎప్పటికీ సమంత నవ్వుతూ, సంతోషమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వారి విషెస్ ను తెలియజేస్తున్నారు.
View this post on Instagram

