వార్ 2కి ఎన్టీఆర్ భారీ పారితోషికం.. హృతిక్ రోషన్, కియారా అద్వానీ ఎన్ని కోట్లు తీసుకున్నారంటే?

వార్ 2 చిత్రం బడ్జెట్..
బాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న వార్ 2 చిత్రానికి మేకర్స్ భారీగానే ఖర్చు చేశారు. భారీ కాస్ట్ మరియు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండటంతో సినిమాకు బడ్జెట్ ఎక్కువనే అయ్యింది. నటీనటులు, టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేయడంతో వారి రెమ్యునరేన్లు, నిర్మాణ ఖర్చులు కలుపుకొని వార్ 2 చిత్రానికి రూ.400 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తారక్, హృతిక్, కియారా రెమ్యునరేషన్లు..
ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు వరల్డ్ వైడ్ గా గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. దాంతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఫలితంగా రెమ్యునరేషన్ కూడా పెరిగింది. ఇక వార్ 2 చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ రూ.60 కోట్లు తీసుకున్నారంట. మరోవైపు బాలీవుడ్ స్టార్ హృతి రోషన్ రూ.48 కోట్లు తీసుకున్నారంట. హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ రూ.15 కోట్లు, దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ.32 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

War 2 Movie Latest Update

హృతిక్, తారక్ రాబోయే చిత్రాలు..
తారక్ చివరిగా దేవర చిత్రంతో అలరించారు. నెక్ట్స్ వార్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు హృతిక్ రోషన్ వార్ 2 చిత్రం తర్వాత క్రిష్ 4 చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి స్వయంగా ఆయనే దర్శకత్వం వహించబోతుండటం విశేషం.

Karthika deepam 2 October 6th : అతి తెలివి ప్రదర్శించిన జ్యోత్స్న.. అగ్రిమెంట్‌ పేపర్లను కార్తీక్‌కు ఇచ్చేసిన శివనారాయణ

Gunde Ninda Gudi Gantalu Octobert 3rd: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మీనా.. ప్రభావతి, రోహిణి కుట్రకు పూలగంప బలి

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ తో బిజీ..
ఇక ప్రస్తుతం జూనియర్ తన రాబోయే చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో భారీ ప్రాజెక్ట్స్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇదే సమయంలో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే నెక్ట్స్ మరిన్ని భారీ చిత్రాలకు సిద్ధమవుతున్నారు. అందులో నెక్ట్స్ జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోయే చిత్రం ఎన్టీఆర్ 31. ఈ చిత్రానికి ఇండియాస్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ భారీ స్కేల్లో రూపుదిద్దుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనూ ఓ పౌరాణిక చిత్రంలో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు. నాగవంశీ నిర్మాతగా ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతోంది.  మున్ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా రానున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button