Akhanda 2 New Release Date : అఖండ 2 కొత్త రిలీజ్ డేట్? అప్డేట్ ఇచ్చిన నిర్మాత

తెలుగు ప్రేక్షకులకు గాడ్ ఆఫ్ మాసెస్, టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అంటే ఎంతో అభిమానం. ఎనలేని ప్రేమ. ప్రస్తుతం బాలకృష్ణ – బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో రానున్న అఖండ 2 : తాండవం చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నారు. Akhanda 2 : Thandavam మూవీ డిసెంబర్ 5వ తేదీనే వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అనుకున్న సమయానికి విడుదల చేయలేక పోతున్నామని మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అఖండ 2 చిత్రాన్ని థియేటర్లలో చూద్దామని ఎంతగానో ఆశ పడ్డ అభిమానులు, ప్రేక్షకులకు ఊహించని వార్త అందిన సంగతి విధితమే.

అనుకోని కారణాలతో నిలిపివేత..

అఖండ 2 : తాడవం చిత్రం విడుదల నిరవధికంగా నిలిచిపోవడంతో మళ్లీ కొత్త డేట్ ఎప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. టాలీవుడ్ లో సరికొత్త కథలను, భారీ స్కేల్లో నిర్మించే నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అఖండ 2 చిత్రాన్ని నిర్మించింది. సినీరంగంలో ఎంతో అనుభవం ఉన్న ప్రముఖ నిర్మాతలు రామ్ అచంట, గోపీచంద్ ఆచంట కలిసి నిర్మించారు. రూ.200 కోట్ల బడ్జెట్ వెచ్చించి ఎక్కడా చిత్ర నిర్మాణంలో వెనక్కి తగ్గకుండా రూపొందించారని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే సినిమా విడుదలకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. కానీ అనుకోని కారణాలతో సినిమాను డిసెంబర్ 5న విడుదల చేయలేకపోతున్నామని నిర్మాతలు ఇప్పటికే తెలియజేశారు.

Akhanda 2 New Release Date

వారికి నిర్మాతల క్షమాపణలు

నందమూరి బాలకృష్ణ Nandamuri Balakrishna అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు కూడా నిర్మాతలు క్షమాపణలు తెలిపారు. ఎంతో ఆశగా ఎదురు చూసిన నందమూరి అభిమానులు, ఆడియెన్స్ ను కాస్తా వేచి ఉండేలా చేశామని తెలిపారు. సినిమా తాత్కాలికంగా వాయిదా పడిందని చెబుతూనే మరోవైపు కొత్త రిలీజ్ డేట్ పైనా కూడా నిర్మాత రామ్ ఆచంట తాజాగా స్పందించడం విశేషం. సోషల్ మీడియా వేదికన ప్రొడ్యూసర్ రామ్ ఆచంట అఖండ 2 కొత్త విడుదల తేదీపై అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే ప్రకటిస్తామని చెబుతూనే.. బ్లాక్‌బస్టర్ తేదీని అనౌన్స్ చేయబోతున్నామని ప్రకటించారు. కానీ పక్కా తేదీని ఇంకా అనౌన్స్ చేయలేదు. ఆ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Akhanda 2 Critic Review : బాలకృష్ణ అఖండ 2 క్రిటిక్ రివ్యూ, రేటింగ్!

అఖండ 2 కొత్త రిలీజ్ డేట్..

ఇదిలా ఉంటే.. సినీ నిపుణులు మాత్రం పలు డేట్లను లాక్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అసలే డిసెంబర్ క్రిస్టమస్ పండగ ఉండటం కారణంగా అఖండ 2 చిత్రాన్ని ఇదే నెలలో విడుదల చేసే ఛాన్స్ ఉందని అభిప్రాయ పడుతున్నారు. ఇదే సమయంలో అఖండ 2 చిత్రం కోసం నిర్మాతలు 2 డేట్లను లాక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. డిసెంబర్ 12 లేదంటే డిసెంబర్ 25వ తేదీని ప్రకటించే అవకాశం ఉందని జ్యోష్యం చెబుతున్నారు. ఇప్పటికే అభిమానులు కూడా మేకర్స్ నుంచి ఎంత త్వరగా రిలీజ్ డేట్ పై అప్డేట్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇదే క్రమంలో మేకర్స్ పైనా ఒత్తిడి నెలకొంది. అయినప్పటికీ ఫ్యాన్స్ ను, ఆడియెన్స్ ను సంతృప్తి పరిచేలా సాలిడ్ అప్డేట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

భారీ అంచనాలు..

అఖండ 2 చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ఇప్పటికే బాలకృష్ణ 2021లో వచ్చిన అఖండ చిత్రంలో అఘోరగా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఈ క్రమంలో అఖండ 2 చిత్రంపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందస్తుగా వచ్చిన రివ్యూలు కూడా సినిమాపై ఆకాశానంటే అంచనాలను పెంచేసింది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఎంతగానో వేచి ఉన్నారు.

Andhra King Taluka Day 7 Box Office Collections: 7 రోజుల్లో ఆంధ్రా కింగ్ తాలుకా కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే?

3డీ, EPIQ ఫార్మాట్లతో రెడీ..

ఈ భారీ యాక్షన్ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆది పినిశెట్టి, ప్రగ్యా జైశ్వాల్, హార్షాలీ మల్హోత్రా, జగపతి బాబు, పూర్ణ, సాయి కుమార్, హర్ష చీముడు కీలక పాత్రల్లో నటించారు. ఇక టెక్నికల్ సైడ్ సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీటెక్ సినిమాటోగ్రఫీగా, తమ్మిరాజ్ ఎడిటర్ గా, సంగీతం థమన్ అందించడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని 3డీ, ఐమాక్స్, 4డీఎక్స్, డీ-బాక్స్, పీవీఆర్ ఐస్, డాల్బీ సినిమా, ఎపిక్యూ ఫార్మాట్స్ లో రిలీజ్ కు సిద్ధం చేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button