Akhanda 2 Critic Review : బాలకృష్ణ అఖండ 2 క్రిటిక్ రివ్యూ, రేటింగ్!

Akhanda 2 Review : బాలకృష్ణ అఖండ 2 క్రిటిక్ రివ్యూ, రేటింగ్!

నందమూరి నటసింహం, టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ అఖండ 2 (Akhanda 2). ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అని ఎదురు చూశారు. కానీ కొన్ని కారణాల వల్ల అఖండ 2 చిత్రం తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే ఈ చిత్రం ఏ రేంజ్ లో ఉంటుందోనని అభిమానులు, ప్రేక్షకులు చాలా అంచనాలు పెంచుకున్నారు. దీంతో సినిమా రివ్యూల కోసం అంతా వేచి ఉన్నారు. కానీ సినిమా విడుదల కాలేదు. కానీ చిత్రాన్ని ముందే ప్రత్యేక ప్రివ్యూల ద్వారా వీక్షించిన కొందరు నిపుణులు ఈ సినిమాపై వారి సమీక్షలను వెల్లడించారు. ఈ క్రమంలో అఖండ 2 సినిమా రివ్యూను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అఖండ 2 మూవీ భారీ కాస్టింగ్..

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ 2 : తాండవం. బాలకృష్ణ అఘోరాగా మరోసారి వెండితెరపై దర్శనం ఇవ్వబోతున్న చిత్రం. ఈ చిత్రానికి బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంటలు నిర్మాతలుగా వ్యవహరించడం విశేషం. ఇలాంటి ప్రముఖ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ నటించింది. ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా ముఖ్యమైన పాత్రలు పోషించారు.

Akhanda 2 Movie Critic Review

టాప్ టెక్నీషియన్లు..

హై యాక్షన్, ఆధ్యాత్మికతను తెలియజేసే ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్లు భారీ బడ్జెట్ తో నిర్మించారు. కాగా ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ నుంచి ప్రముఖ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేశారు. సంతోష్ డీ డీటాకే, సీ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని అందించారు. ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్స్ డైరెక్టర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా, కోటీ పర్చూరి కార్యనిర్వాహక నిర్మాతగా వ్యవహరించారు. ఇండియాస్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహించారు. ఇక డిసెంబర్ 5నే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం తాత్కాలికంగా వాయిదా పడింది.

Gunde Ninda Gudi Gantalu December 5th: ప్రభావతికి శిక్ష.. చిన్నబోయిన బాలు

ప్రముఖ క్రిటిక్ రివ్యూ..

నిన్న డిసెంబర్ 5నే ప్రపంచ వ్యాప్తంగా అఖండ 2 : తాండవం చిత్రం విడుదలకు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు, రిలీజ్ కు సంబంధించిన సంప్రదాయ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది. ఇదే సమయంలో దుబాయ్ లో అఖండ 2 : తాండవం చిత్రం సెన్సార్ కోసమని ప్రముఖ సినీ విమర్శకులకు ప్రివ్యూను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు క్రిటిక్స్ అఖండ 2 : తాండవం చిత్రంపై తమ రివ్యూలను ఇలా పంచుకున్నారు.

Andhra King Taluka Day 7 Box Office Collections: 7 రోజుల్లో ఆంధ్రా కింగ్ తాలుకా కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే?

పక్కా పైసా వసూల్..

అఖండ 2 : తాండవం సినిమా చూసిన తర్వాత ప్రముఖ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు తన సమీక్షను వెల్లడించారు. సినిమా విడుదలకు 2 రోజుల ముందే ఈ సమీక్షను అందించడం గమనార్హం. ఉమైర్ సంధు రివ్యూ ప్రకారం.. అఖండ 2 చిత్రంపై ఫస్ట్ రివ్యూ ఇస్తున్నాను. ఇది పక్కా పైసా వసూల్ మాస్ ఎంటర్‌టైనర్ అని చెప్పడంలో సందేహం లేదు. బాలకృష్ణ అభిమానులకు ఈ చిత్రం ఎంతగానో నచ్చుతుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో యాక్షన్, భారీ డైలాగ్స్ లు ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టిస్తాయి. క్లైమాక్స్ మాత్రం ఊరమాస్ గా ఉంటుంది. ఈ చిత్రానికి నేను 3/5 రేటింగ్ ఇస్తున్నాను.. అని ఉమైర్ సంధు తన రివ్యూను అందించారు.

భారీ అంచనాలు..

ఇలా విమర్శకుల నుంచి బాలకృష్ణ – బోయపాటి శ్రీనివాస్ కాంబోలో విడుదల కాబోతున్న అఖండ 2 : తాండవం చిత్రం ప్రశంసలు అందుకుంటుండం విశేషం. ఈ క్రమంలో బాలకృష్ణ అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మళ్లీ విడుదల తేదీని టీమ్ త్వరలోనే ప్రకటించనుంది. ఇప్పటికే అఖండ 2 : తాండవం నిర్మాత రామ్ అచంట సినిమా తాత్కాలిక వాయిదాపై చింతించారు. త్వరలోనే బ్లాక్‌బస్టర్ విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి నిర్మాతల నుంచి రాబోయే అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంతో బాలకృష్ణకు మరో భారీ బ్లాక్‌బస్టర్ హిట్ అందినట్టే అని చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button