Gunde Ninda Gudi Gantalu December 2nd: మనోజ్, ప్రభావతికి గుండె దడ.. బాలు స్కెచ్

Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్ తెలుగు టెలివిజన్ డైలీ సీరియల్స్‌లో మంచి రేటింగ్‌తో ఆసక్తికరంగా కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 1వ తేదీ 565 ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన సన్నివేశాలు సాగాయి. మనోజ్ పని పట్టాలని నిర్ణయించుకున్న బాలు మరో వ్యూహాన్ని రచిస్తాడు. గుడిలో పోతురాజుతో దెబ్బలు కొట్టించినా మనోజ్ దొంగలించిన బంగారం విషయంలో ఏమాత్రం నిజం ఒప్పుకోలేదు. దీంతో బాలు మరో ప్లాన్ కు సిద్ధమయ్యాడు. ఈసారి ఏకంగా మంత్రించిన నిమ్మకాయను ఇంట్లోకి తీసుకొస్తాడు. ఆ నిమ్మకాయను ఇంట్లో వాళ్లందరికీ చూపించి ఈ నిమ్మకాయను నాకు ఒక స్వామిజీ ఇచ్చాడని చెబుతాడు. మన ఇంట్లో అసలు బంగారం మాయమై, గిల్ట్ బంగారం రావడానికి అసలు కారణం ఏంటో, అలా చేసిన వారు ఎవరో ఈజీగా తెలిసిపోతుందని అంటాడు.

అసలు ఆ నిమ్మకాయతో ఏమౌతుందని మనోజ్, ప్రభావతి అడుగుతారు. అప్పటికే మంత్రించిన నిమ్మకాయ అని బాలు చెప్పడంతో వారిద్దరూ జల్లుమంటారు. ఇక బాలు మరింత భయం పెంచేలా ఈ నిమ్మకాయను ఈ రాత్రి మన ఇంట్లో పెట్టడం వల్ల బంగారం దొంగలను పట్టిస్తుందని చెబుతాడు. బంగారం దొంగతనం చేసిన వారి శరీరంలో అవయవాలు ఒక్కొక్కటిగా పడిపోతాయని బాలు చెబుతాడు. దాంతో మనోజ్, ప్రభావతి మరింతగా వణికిపోతారు. నిజంగానే నిమ్మకాయకు అంత పవర్ ఉంటుందా? అని భయపడుతూ ఉంటారు. అసలు దొంగలు వారే కాబట్టి లోలోపల వణికిపోతూ ఉంటారు. ఇక ఎలాగైనా ఆ నిమ్మకాయ శక్తి నుంచి కలిగే ప్రమాదాన్ని దాటాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో ప్రభావతి ఒక నిర్ణయానికి వస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది… గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 2వ తేదీ 566వ ఎపిసోడ్‌లో చూద్దాం..

Gunde Ninda Gudi Gantalu Serial December 2nd

ప్రభావతికి టెన్షన్..

బాలు స్కెచ్ తో మనోజ్, ప్రభావతి ఇద్దరు వణికిపోతారు. అసలు వాళ్లకు ఎప్పుడు ఏమౌతుందోనని భయంతో చావు రుచి చూస్తారు. ఇక ఇద్దరికీ రాత్రి నిద్ర పట్టదు. పైగా తమ శరీరంలోని అవయవాలన్నీ పడిపోయినట్టుగా ఊహించుకుంటూ ఉంటారు. ఇక ఇద్దరూ తమ గదిలోంచి హాలులోకి వస్తారు. ఒకరిని ఒకరు చూసుకొని బయపడుతారు. మనోజ్ తనకు ఎంతగానో భయం అవుతుంది అమ్మా అంటూ ప్రభావతితో చెబుతాడు. ప్రభావతి కూడా అలాగే చెబుతుంది. అసలు ఈ బాలు గాడి వల్ల ఎప్పుడూ ఏదోక సమస్యలో చిక్కుకోవాల్సి వస్తోందని ప్రభావతి మండిపడుతుంది. అసలు మనం ఆ నిమ్మకాయను తీసి బయట పడేస్తే ఒక పని అయిపోతుంది కదా అని ప్రభావతి సలహా ఇస్తుంది. అదే మాటతో వెంటనే దేవుడి గది దగ్గరకు వెళ్లి బాలు పెట్టిన నిమ్మకాయను తీసి బయట పడేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ వారిద్దరూ ఆ నిమ్మకాయను ముట్టుకుంటే ఏమౌతుందోనని భయంతో వెనకడుగు వేస్తారు.

Gunde Ninda Gudi Gantalu December 1st: రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మనోజ్, ప్రభావతి.. తాట తీసిన బాలు

కామాక్షి సలహా..

ఇక ఈ సమస్య నుంచి బయట పడేదెలా అని ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పటికే తమ శరీరంలో అవయవాలు పడిపోయినట్టుగా భ్రమ కలుగుతోందని అనుకుంటారు. వెంటనే ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలని అనుకుంటాడు. దాంతో ప్రభావతి వెంటనే కామాక్షికి ఫోన్ చేస్తుంది. కామాక్షి అర్ధరాత్రి ఫోన్ రావడంతో కాస్తా నిద్ర మత్తులోనే స్పందిస్తుంది. ప్రభావతి చెప్పిన మాటలు విని షాక్ అవుతుంది. మీరు చేసిన తప్పులను సరిచేసుకోవడానికి పరిష్కారం చూపమని నాకు చేశారు అంతే కదా అని కామాక్షి అంటుంది. అవును అంతే అని ప్రభావతి చెబుతుంది. దాంతో తనకు తెలిసిన ఒక స్వామిజీ ఉన్నాడని, తెల్లవారాక స్వామిజీ దగ్గరకు వెళ్దామని చెబుతుంది. ఆయన ఎలాంటి శక్తినైనా మటుమాయం చేస్తాడని అంటుంది. దాంతో వారిద్దరూ శాంతిస్తారు. ఇక ఉదయమే లేచి స్వామిజీ దగ్గరకు వెళ్లాలని అనుకుంటారు. కామాక్షి ఇచ్చిన ధైర్యంతో ఇక తమ గదుల్లోకి వెళ్లి హాయిగా పడుకుంటారు.

Karthika deepam 2 December 1st: కార్తీక్ బాబుకు కొత్త సవాల్.. దీపాకు అత్త కాంచన వార్నింగ్

మనోజ్ తడబాటు..

ఉదయం అవ్వగానే మనోజ్ లేచి నీట్ గా రెడీ అవుతాడు. అందరూ లేచి ఆఫీస్ కు వెళ్లే సమయం అయితే గానీ నిద్ర లేవబోని మనోజ్ ను చూసి రోహిణి షాక్ అవుతుంది. అంతే అసలు ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నిస్తుంది. దాంతో మనోజ్ తడబడుతూ సమాధానం చెబుతాడు. అమ్మను తీసుకొని కామాక్షి అత్త వాళ్ల ఇంటికి వెళ్తున్నామని చెబుతాడు. కామాక్షి అత్తతో కలిసి ఫంక్షన్ కు వెళ్తున్నామని, వాళ్లిద్దరితో పాటు నన్ను కూడా రమ్మని చెప్పారని అంటాడు. అప్పటికీ మనోజ్ మాటలను రోహిణి నమ్మబోదు. ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత ప్రభావతి మరో విషయం చెబుతుంది. అప్పటికే మనోజ్ కోసం వేచి చూస్తూ ప్రభావతి ఆగ్రహానికి గురవుతుంది. ఇక మనోజ్ వచ్చే సరికి ఇటు బాలు కూడా బయటి నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. దీంతో ఎక్కడికి వెళ్తున్నారని అడగటంతో కామాక్షిని తీసుకొని ఆస్పత్రికి వెళ్లాలని అంటుంది. ఇలా మనోజ్ ఒక మాట చెప్పడం, ప్రభావతి మరో మాట చెప్పడంతో అక్కడే ఉన్న బాలుకు సందేహం కలుగుతుంది.

Andhra King Taluka Day 1 Box Office Collections: రామ్ పోతినేని స్టామినా.. ఆంధ్రా కింగ్ తాలూకా ఓపెనింగ్ డే ఎన్ని కోట్లంటే?

బాలు ప్రశ్నల వర్షం..

అన్న మనోజ్, తల్లి ప్రభావతి ఇద్దరూ తన నిమ్మకాయ ప్లాన్ కు భయపడి పోతున్నారని బాలు అర్థం చేసుకుంటాడు. దాంతో అసలు మీరు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారని బాలు మనోజ్ ను ప్రశ్నిస్తూ ఉంటాడు. మరోవైపు తల్లి ప్రభావతిని కూడా అడుగుతాడు. అసలు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పి వెళ్లండని పదే పదే అడుగుతారు. కానీ ఎంతకీ మనోజ్, ప్రభావతి తమ మనస్సులోని మాటను చెప్పరు. ఇక ఇద్దరూ కలిసి స్వామిజీ వద్దకు వెళ్తారు. ఇక ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

Andhra King Taluka Movie Review: ఆంధ్రా కింగ్ తాలూకా – హిట్టా, ఫట్టా?

Gunde Ninda Gudigantalu Latest Promo

గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 2వ ఎపిసోడ్ ముగింపులో ఆసక్తికరమైన ప్రోమోను వదిలారు. మనోజ్ ను కాపాడే ప్రయత్నంలో ప్రభావతి కూడా ఇరుక్కుపోతుంది. బంగారు నగల దొంగతనం విషయంలో మనోజ్ గుట్టును రట్టు చేసేందుకు బాలు నిమ్మకాయ డ్రామాను ప్రారంభించాడు. ఇక బాలు తెచ్చిన నిమ్మకాయ శక్తిని తిప్పికొట్టేలా ప్రభావతి కామాక్షి సాయంతో ఒక స్వామిజీ దగ్గరకు వెళ్తారు. ఇక స్వామిజీ విషయం తెలుసుకొని వారికి ఒక నిమ్మకాయను ఇస్తాడు. ఆ మంత్రించిన నిమ్మకాయ మిమ్మల్ని రక్షిస్తుందని భరోసా వ్యక్తం చేస్తాడు. కానీ మనోజ్, ప్రభావతి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు. దీంతో నెక్ట్స్ ఎపిసోడ్స్ పై ఆసక్తిని పెంచింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button