Gunde Ninda Gudi Gantalu December 1st: రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మనోజ్, ప్రభావతి.. తాట తీసిన బాలు
Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్ తెలుగు టెలివిజన్ డైలీ సీరియల్స్‌లో మంచి రేటింగ్‌తో ఆసక్తికరంగా కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. గుండె నిండా గుడి గంటలు నవంబర్ 28వ తేదీ 564 ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన సన్నివేశాలు సాగాయి. మౌనికా సంగతి ముగిన వెంటనే బాలు తన అన్న సంజూపై ఫోకస్ పెడుతాడు. అసలు ఇంట్లో దాచిన మీనా నగలు ఎలా నకిలీగా మారుతాయనే సందేహంలో మునిగిపోతాడు. ఎలాగైనా ఈ విషయంలో నిజానిజాలు తేల్చాల్సిందేనని పట్టుబట్టుకుని కూర్చుంటాడు. దీంతో వెంటనే మనోజ్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి అసలు విషయాలను తెలుసుకుంటాడు. మనోజ్ ఇంట్లో బంగారం అమ్మేశాడనే నిజాన్ని బాలు జీర్ణించుకోలేకపోతాడు.
ఇక మనోజ్ నోటితోనే అసలు నిజాన్ని కక్కించాలని ప్రయత్నిస్తాడు. ఇందుకు ఒక స్వామీజీ దగ్గరకు వెళ్లినట్టు ఇంట్లో వాళ్లందరికీ చెబుతాడు. ఆ స్వామీజీ తనకు ఒక మంత్రించిన నిమ్మకాయను ఇచ్చాడని, ఆ నిమ్మకాయ బంగారం దొంగలించిన వారి గురించి చెబుతుందని అంటాడు. ఆ నిమ్మకాయ చాలా పవర్ ఫుల్ అని, దాన్ని ఒక్కరోజు ఇంట్లో ఉంచితే ఆ దొంగల శరీరంలోని పూర్తి అవయవాలను పని చేయకుండా చేస్తుందని భయపెడుతాడు. బాలు మాటలకు అందరూ భయపడి పోతారు. ముఖ్యంగా మనోజ్, ప్రభావతి తమకు ఏమౌతుందోనని వణికిపోతారు. అప్పటికే వారికి కాళ్లు చేతులు పడిపోతున్న లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మనోజ్ కు, ప్రభావతికి రాత్రి నిద్ర కూడా పట్టదు. ఎవరి గదిలో వారు తమ శరీరాన్ని పదే పదే తడుముతూ, అద్దంలో చూసుకుంటూ ఉంటారు. అంతే కాదు తామిద్దరూ రాత్రి ఒకరినోకరు కలుసుకుంటారు. నిమ్మకాయను తీసి బయట పడేయాలని చూస్తారు. అయితే ఇదే సమయంలోనే ప్రభావతికి పక్షవాతం వచ్చినట్టు, ఇంట్లో వాళ్లందరూ తనను ఎలా తిడుతారనేది ఊహించుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది (Gunde Ninda Gudi Gantalu December 1st Episode Number 565) డిసెంబర్ 1వ తేదీ 565వ ఎపిసోడ్ లో చూద్దాం..

ప్రభావతి మాస్టర్ ప్లాన్..
బాలు ఇంట్లోకి మంత్రించిన నిమ్మకాయను తీసుకొని వచ్చినప్పటి నుంచి మనోజ్, ప్రభావతికి మనస్సు మనస్సులో ఉండదు. ఆ నిమ్మకాయ చాలా పవర్ ఫుల్ అని బాలు పదే పదే చెప్పడంతో వారిద్దరికి ఒంట్లో వణుకు పుడుతుంది. అంతే కాదు తమ శరీరాలు కూడా అందవికారంగా మారిపోయినట్టు ఊహించుకుని భయంతో చచ్చిపోతుంటారు. ఇక ఈ నిమ్మకాయ సమస్య నుంచి తమను కాపాడే గల వ్యక్తి కేవలం కామాక్షి అని ప్రభావతి తెలుసుకుంటుంది. దీంతో కామక్షికి వెంటనే ఫోన్ చేస్తుంది. తమకు కలిగిన సమస్యను ప్రభావతి కామాక్షికి వివరిస్తుంది. దీంతో కామాక్షి వారిద్దరికి మంచి ఉపాయం చెబుతుంది. బాలు ఏ స్వామీజీ దగ్గరికి వెళ్లి నిమ్మకాయను తీసుకొచ్చాడో గానీ.. మనం మరో స్వామీజీ దగ్గరకు వెళ్లి దానికి విరుగుడు తీసుకొని వద్దామని సలహా ఇస్తుంది. తెల్లవారాక నా దగ్గరికి వస్తే ఆ స్వామీజీ దగ్గరకు తీసుకొని వెళ్తాను అని కామాక్షి చెబుతుంది. దాంతో సరే వస్తామని చెబుతారు.
బాలు ప్రశ్నల వర్షం..
కామాక్షి చెప్పినట్టుగా మనోజ్, ప్రభావతి ఉదయమే నిద్ర లేస్తారు. ఎప్పుడూ ఉదయం లేవడానికి బద్ధకించే మనోజ్ కూడా ఈరోజు ముందుగానే నిద్ర నుంచి మేల్కోంటాడు. ఇక స్నానం చేసి మంచిగా రెడీ అవుతాడు. సెంట్ కూడా కొట్టుకుంటాడు. అయితే ఆ చప్పుడుకు రోహిణి కూడా నిద్ర నుంచి మేల్కొంటుంది. అంత పొద్దున్నే రెడీ అయిన మనోజ్ ను ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నిస్తుంది. దాంతో మనోజ్ ఎక్కడికి లేదు, అమ్మను బయటికి తీసుకెళ్లాలి అందకే త్వరగా రెడీ అయ్యానని చెబుతాడు. అయినా అత్తయ్య ఇంత ఉదయం ఏం పని మీద వెళ్తుందని ప్రశ్నిస్తుంది. దానికి మనోజ్ కామాక్షి అత్త వాళ్ల ఇంటికి వెళ్తున్నామని, ఫంక్షన్ అని అబద్ధం చెబుతాడు. కానీ హాలులో వెయిట్ చేస్తున్న ప్రభావతి మాత్రం కామాక్షి ఆరోగ్యం బాలేదని బాలుతో అబద్ధం చెబుతుంది. మనోజ్ కిందికి వచ్చిన తర్వాత అసలు ఫంక్షన్ కు వెళ్తున్నారా? ఆస్పత్రికి వెళ్తున్నారా? అని ప్రశ్నిస్తాడు. దాంతో ప్రభావతి, మనోజ్ తడబడుతూ సమాధానాలు చెబుతారు. దీంతో బాలు మరింతగా ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. ఇక ప్రభావతి బాలును లెక్క చేయకుండా మనోజ్ ను వెంట పెట్టుకొని ఇంటి నుంచి బయటికి వెళ్తుంది.
Karthika deepam 2 November 29th: జ్యోత్స్నకు వణుకు పుట్టించిన కార్తీక్ బాబు.. శ్రీధర్ ఆవేదన
స్వామిజీతో నిజం చెప్పిన ప్రభావతి..
ప్రభావతి, మనోజ్, కామాక్షి ముగ్గురు కలిసి సిటీలో పేరు మోసిన ఒక స్వామిజీ దగ్గరకు వెళ్తారు. అయితే స్వామిజీ వాళ్లను చూసి సమస్య ఏంటని ప్రశ్నిస్తాడు. దాంతో ప్రభావతి స్పందిస్తూ నా కొడుకు బాలు మా ఇంట్లోకి మంత్రించిన నిమ్మకాయను తీసుకొని వచ్చాడు. ఆ నిమ్మకాయ వల్ల మా శరీరంలోని అవయవాలు పనిచేయకుండా పోతాయని బెదిరించాడు. ఆ నిమ్మకాయను మా ఇంట్లోని పూజ గదిలో పెట్టాడు. అప్పటి నుంచి మాకు చాలా భయం వేస్తుంది స్వామీజీ అని ప్రభావతి అంటుంది. దాంతో స్వామిజీ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అసలు విషయం ఎందుకు దాస్తున్నారు. మీరేదో పెద్ద తప్పు చేశారు. మీరేం తప్పు చేయకుంటే అసలు మీరిద్దరే ఎందుకు భయపడుతున్నారు. అసలు విషయం చెప్పండి, నా దగ్గర దాచాలని ప్రయత్నిస్తే మీకే మంచిది కాదని హెచ్చరిస్తాడు. దీంతో భయపడ్డ ప్రభావతి అసలు విషయాన్ని చెబుతుంది. తన కొడుకు మనోజ్ తో కలిసి మీనా బంగారాన్ని అమ్మేశామని చెబుతుంది. ఈ సమస్య నుంచి మీరే కాపాడాలని స్వామిజీని వేడుకుంటుంది. మరో వైపు కామాక్షి కూడా ప్రభావతిని రక్షించండి స్వామీ అంటూ కోరుతుంది.
Gunde Ninda Gudi Gantalu November 28th: ప్రభావతి, మనోజ్‌లకు ప్రాణగండం.. బాలు దెబ్బకు మైండ్ బ్లాక్
మరో మంత్రించిన నిమ్మకాయ..
స్వామిజీకి అసలు విషయం తెలిసిపోతుంది. తమ తప్పును స్వామిజీ దగ్గర ప్రభావతి, మనోజ్ ఒప్పుకోవడం, మళ్లీ అలాంటి తప్పు చేయమని చెప్పడంతో స్వామిజీ కరుణ చూపిస్తాడు. వారిని రక్షించేందుకు మరో మంత్రించిన నిమ్మకాయను అందిస్తాడు. ఆ నిమ్మకాయను తీసుకెళ్లి తమ ఇంట్లో ఇప్పటికే పెట్టిన నిమ్మకాయకు ఎడమవైపున పెట్టమని చెబుతాడు. ఏ నిమ్మకాయ అయితే తెల్లవారే సరికి నల్లగా మారుతుందో అందులోని శక్తి క్షీణిస్తుందని అర్థమని చెబుతాడు. నేను మంత్రించి ఇచ్చిన నిమ్మకాయ మీకు రక్షగా ఉంటుందని భరోసానిస్తాడు. దీంతో ప్రభావతి, మనోజ్ ఇద్దరు ఆ నిమ్మకాయను తీసుకొని ఇంటికి తిరిగి వెళ్తారు. ఈ సందర్భంగా ఆ నిమ్మకాయను దేవుడి గదిలో బాలు పెట్టిన నిమ్మకాయకు పక్కన పెట్టి వెళ్లిపోతారు.
బాలు కంటపడ్డ రెండో నిమ్మకాయ..
ప్రభావతి, మనోజ్ ఇద్దరు స్వామిజీని కలిసిన తర్వాత తమకేం తెలియదన్నట్టుగా తమ గదుల్లోకి వెళ్లిపోతారు. ఇక అంతా నిమ్మకాయ మీదనే భారం వేసి ధైర్యంగా ఉంటారు. అయితే మీనా హాలులోకి వచ్చి టీ పెట్టడానికి దేవుడి గదిని దాటి కిచెన్ లోకి పాలు తీసుకొని వెళ్తుంది. ఆ వెంటనే బాలు కూడా వస్తాడు. అయితే బాలు చూపు దేవుడి గదిపై పడుతుంది. దగ్గరకు వెళ్లి చూసే సరికి రెండు నిమ్మకాయలు కనిపిస్తాయి. వెంటనే మీనాను పిలిచి ఇక్కడ మరో నిమ్మకాయను నువ్వు పెట్టావా? అని బాలు ప్రశ్నిస్తాడు. లేదు నేను పెట్టలేదని బదులిస్తుంది. ఇక ఆ వెంటనే బాలు ఇంట్లో వాళ్లందరినీ, ముఖ్యంగా మనోజ్, ప్రభావతిని పిలుస్తాడు. వారిద్దరితో పాటు రోహిణి కూడా గబగబా కిందికి వస్తుంది. వెంటనే బాలు తను మంత్రించి తెచ్చి పెట్టిన నిమ్మకాయ ఇప్పుడు 2 గా మారిందని చెబుతాడు. దాంతో రోహిణి, మీనా షాక్ అవుతారు. ఇక ప్రభావతి, మనోజ్ తమకేం తెలియదన్నట్టుగా ఉంటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది.
Gunde Ninda Gudigantalu Latest Promo
డిసెంబర్ 1వ ఎపిసోడ్ ముగింపులో గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ప్రోమో Gunde Ninda Gudi Gantalu Latest Promo ఆసక్తికరంగా మారింది. రాబోయే ఎపిసోడ్స్ లో ప్రభావతి, మనోజ్ ల గుట్టును బాలు రట్టు చేస్తాడు. మంత్రించిన నిమ్మకాయలు చాలా పవర్ ఫుల్ అని చెబుతూ వారిలో భయం పుట్టిస్తాడు. దాంతో వారు ఎలాగైనా ఆ నిమ్మకాయలను ఇంట్లో నుంచి తీసి బయట పడేయాలని నిర్ణయించుకుంటారు. ఎవ్వరికి కనిపించకుండా 2 నిమ్మకాయలు తీసుకొని వెళ్తున్నామని మెయిన్ ఎంట్రన్స్ వరకు వెళ్తారు. కానీ అప్పటికే బాలు లైట్స్ ఆన్ చేసి, అందరికీ వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాడు. ఆ తర్వాత చాలా వాగ్వాదం జరుగుతుంది. దీంతో మనోజ్ నిజం ఒప్పుకుంటాడు. బంగారం నేనే అమ్మేశాడననే నిజాన్ని కక్కుతాడు. దీంతో సత్యం మనోజ్ ను చితక బాదుతాడు… అసలు మనోజ్ నిజం ఎలా ఒప్పుకోవాల్సి వచ్చింది. అందుకు బాలు ఏం చేశాడనేది ఈ వారం ఎపిసోడ్స్ పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.



