Karthika deepam 2 December 1st: కార్తీక్ బాబుకు కొత్త సవాల్.. దీపాకు అత్త కాంచన వార్నింగ్
Karthika deepam 2 December 1st Episode 529 : కార్తీక దీపం 2 సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతున్న ఈ ఫేమస్ సీరియల్ తాజా ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే నవంబర్ 29వ తేదీ 528వ ఎపిసోడ్ లో కార్తీక్ బాబు జ్యోత్స్నకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అంతకంటే ముందు శివ నారాయణ అల్లుడు శ్రీధర్ శివ నారాయణ ఇంటికి వెళ్లి తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు. కొన్నాళ్లుగా తను అనుభవిస్తున్న బాధను కాంచన అన్నయ్య దశరథతో చెప్పుకుంటాడు. కాంచనను శ్రీధర్ వదిలి పెట్టి వెళ్లడంతో ఇక కాంచన అస్సలే మాట్లాడటం మానేసింది. అయితే కాంచనతో ఎన్నడూ శ్రీధర్ బంధాన్ని తెంచుకోలేదు. ప్రస్తుతం కుటుంబ వ్యవవహారాలన్నీ చక్కదిద్దుతున్నా కాంచన శ్రీధర్ మధ్య బంధం చిగురించడం లేదు.
దాంతో శ్రీధర్ తన బావమరిది దశరథను ఇలా వేడుకుంటాడు. తనతో కాంచన మాట్లాడేలా చేయాల్సిన బాధ్యత నీపైనే ఉందని శ్రీధర్ అంటాడు. కానీ దశరథ మాత్రం ఎలాంటి సమాధాం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇదే సమయంలో పారుజాతం ఎంట్రీ ఇస్తుంది. శ్రీధర్ జీవితం గురించి చాలా కఠినంగా మాట్లాడుతుంది. నీకు ఇద్దరు పెళ్లాలు కావాల్సి వచ్చిందా? అల్లుడు అని ప్రశ్నిస్తుంది. దాంతో పారుజాతంపై కార్తీక్ బాబు, దీపా ఫైర్ అవుతారు. వీలైతే సాయం చేయాలే కానీ దెప్పి పోవడం మంచి పద్ధతి కాదని దీపా అంటుంది. మరోవైపు దీపాను కిందపడేయాలని జ్యోత్స్న కాలు అడ్డం పెడుతుంది. దాంతో దీపాపై అందరికీ మరింత సానుభూతి పెరుగుతుంది. అది చూసిన జ్యోత్స్న తట్టుకోలేకపోతోంది. ఈ విషయంలోనే కార్తీక్ బాబు జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు. ఇలాంటివి మానుకోవాలని హెచ్చరిస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది డిసెంబర్ 1న తేదీ 529వ ఎపిసోడ్ లో చూద్దాం..




