Karthika deepam 2 November 28th: జ్యోత్స్నను నిలదీసిన కార్తీక్ బాబు.. కోట్ల రూపాయల దోపిడీకి అసలు కారణం ఇదేనంటూ
Karthika deepam 2 November 28th Episode 527 : కార్తీక దీపం 2 సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతున్న ఈ ఫేమస్ సీరియల్ తాజా ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే నవంబర్ 27వ తేదీ 526వ ఎపిసోడ్ లో జ్యోత్స్న చేసిన కోట్ల దోపిడీ గురించి ఆసక్తికరమైన సన్నివేశాలు జరిగాయి. జ్యోత్స్నకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. శివ నారాయణ ఆస్తిని పూర్తిగా తన వశం చేసుకుందని అనుకున్న జ్యోత్స్నకు తాజాగా ఊహించని షాక్ తగిలింది. జ్యోత్స్న గ్రూఫ్ ఆఫ్ కంపెనీ సీఈవోగా జ్యోత్స్న దిగిపోయిన తర్వాత కొత్త సీఈవోగా శ్రీధర్ ను శివ నారాయణ నియమించాడు. దీంతో శ్రీధర్ కంపెనీ పాత వ్యవహారాలన్నింటినీ పరిశీలిస్తున్నాడు. దొంగ లెక్కలను బయట పెడుతున్నారు.
ఈ సందర్భంగా జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ కంపెనీల లావాదేవీల్లో కోట్లల్లో డబ్బు పక్క దారి పట్టిందని శ్రీధర్ సీఈవోగా శివ నారాయణకు తెలియజేస్తాడు. ఆ డబ్బును పక్కదారి మళ్లించింది కూడా మరెవరో కాదు మన జ్యోత్స్ననే అని శ్రీధర్ చెబుతాడు. దీంతో జ్యోత్స్న గుండె బద్ధలవుతుంది. తన గుట్టు రట్టు చేస్తుండటంతో ఎలా స్పందించాలో జ్యోత్స్నకు అంతు చిక్కదు. శ్రీధర్ చెప్పిన 2 కోట్ల 30 లక్షలు ఎందుకు నీ అకౌంట్ లోకి మళ్లించావని శివ నారాయణ, దశరథ జ్యోత్స్నను ప్రశ్నిస్తారు. అయితే జ్యోత్స్న మాత్రం ఆ డబ్బులను తానేమీ తినలేదని, సిటీకి అవుట్ కట్స్ లో ఒక ల్యాండ్ కొన్నానని చెబుతుంది. ఎందుకంటే తన తల్లిగా ఉన్న సుమిత్రకు బహూకరించేందుకు కొనుగోలు చేశానని అంటుంది. ఆ వెంటనే కార్తీక్ బాబు స్పందిస్తూ నువ్వు చెప్పేది అక్షరాల అబద్ధం అని అంటాడు. జ్యోత్స్న గురించి మరిన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నవంబర్ 28వ తేదీ 528వ ఎపిసోడ్ లో చూద్దాం..

కార్తీక్ బాబు షాకింగ్ కామెంట్స్..
మొత్తానికి జ్యోత్స్న గురించి కంపెనీ కొత్త సీఈవోగా బాధ్యతలు తీసుకున్న శ్రీధర్ నిజాలు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. జ్యోత్స్న చేసిన పనికి అంతా నోట మాటరాకుండా నిలబడి చూస్తారు. ఇదే సమయంలో కార్తీక్ బాబు మరో బాంబ్ పేల్చుతాడు. జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ కంపెనీకి సీఈవోగా పని చేసిన జ్యోత్స్న ఆ కంపెనీ నుంచి కోట్లు తప్పదీయడం పట్ల కార్తీక్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. జ్యోత్స్న కోట్ల రూపాయలు మళ్లీ తన తల్లి సుమిత్ర కోసం ఓపెన్ ల్యాండ్ కొనుగోలు చేసిందని చెబుతుంది. కానీ అది అసత్యమని కార్తీక్ బాబు అంటాడు. నువ్వు ఇప్పటికే ఆ ల్యాండ్ కొనుగోలు చేసి ఉంటే అసలు ఇప్పటికీ ఎందుకని సుమిత్ర అత్తకు బహూకరించలేదని ప్రశ్నిస్తాడు. దాంతో జ్యోత్స్న అసలు నేను బహూకరించాలని చాలా ప్రయత్నించానని, అది కూడా అమ్మనాన్నల పెళ్లి రోజే ఇవ్వాలని ఎదురు చూశాను. కానీ అదే సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. దాని వల్లనే నేను ఇవ్వలేక పోయాను అని జ్యోత్స్న చెప్పి తప్పించుకుంటుంది. ఇక కార్తీక్ బాబు కూడా గుచ్చిగుచ్చి అడగటం మానేస్తాడు.
Gunde Ninda Gudi Gantalu November 28th: ప్రభావతి, మనోజ్‌లకు ప్రాణగండం.. బాలు దెబ్బకు మైండ్ బ్లాక్
కాంచనపై శ్రీధర్ ఫైర్..
శివ నారాయణ ఇంటికి వచ్చిన తర్వాత శ్రీధర్ నేరుగా అక్కడి నుంచి కార్తీక్ బాబు ఇంటికి వెళ్తాడు. అక్కడ కార్తీక్ బాబును పిలవకుండా కాంచనను పిలుస్తాడు. ఇక కాంచన కొన్నాళ్లుగా శ్రీధర్ తో మాట్లాడటం మానేసింది. కానీ శ్రీధర్ మాత్రం కాంచనతో ప్రతి విషయం గురించి మాట్లాడుతూనే వస్తున్నాడు. ఈసారి కాంచనతో దీపా, కార్తీక్ ల గురించి మాట్లాడటానికి వచ్చాడు. అసలు దీపా కడుపుతో ఉందని నీకు తెలుసు కదా అని అంటాడు. అలాంటప్పుడు నువ్వు దీపాను ఎందుకని మీ నాన్న ఇంటికి పని కోసం పంపించావని కాంచనను ప్రశ్నిస్తాడు. ఇందులో ఏమైనా న్యాయం ఉందా? అని అడుగుతూ ఉంటాడు. అసలు పొట్టతో ఉండి కూడా దీపా పని మనిషిలా ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముందని అడుతాడు.
Karthika deepam 2 November 27th: కోట్లు దోచిన జ్యోత్స్న.. బయట పెట్టిన శ్రీధర్.. శివనారాయణ ఫైర్
తల దించుకున్న కార్తీక్ బాబు..
శ్రీధర్ తన మొదటి భార్య కాంచనను అన్నీ ప్రశ్నలు అడుగుతున్న సమయంలోనే కావేరి వస్తుంది. దీప కోసం అన్నీ స్వీట్లు తెచ్చి ఇస్తుంది. మరోవైపు కార్తీక్ బాబు, దీప తిరిగి ఇంటికి వస్తారు. ఇక కార్తీక్ బాబు ఇంటికి వచ్చే సరికే శ్రీధర్ రావడంతో ఏంటీ విషయం అని అడుగుతాడు. దీంతో మళ్లీ శ్రీధర్ మీ అమ్మకు అసలు దీప అంటే ఇష్టం లేదని అంటాడు. దీపపై కొంచెం కూడా ప్రేమ లేదని, అందుకే తన తండ్రి ఇంటికి ఈ ఇంటి కోడల్ని పనికి పంపిస్తున్నాడని చెబుతాడు. ఇదే విషయాన్ని ఎన్నో సార్లు అడిగినా ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదు అని ఆవేశంతో రగిలిపోతాడు. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోతాడు. ఇక కాంచన కూడా కార్తీక్ బాబు, దీపలపై కోపంతో ఉంటుంది. వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది.
దీపాపై జ్యోత్స్న కుట్ర..
శివ నారాయణ ఇంట్లో కాల్చిన తర్వాత అన్నీ శుభ శకునాలే జరుగుతుంటాయి. ఇక దీపా తల్లికాబోతుందనే వార్తను డాక్టర్ వెల్లడిస్తుంది. ఈ విషయం విన్నాక జ్యోత్స్న ఏమాత్రం జీర్ణించుకోలేక పోతుంది. అంతే కాదు ఎలాగైనా దీపకు ఆ సంతోషం దక్కకుండా చేయాలని దుర్బుద్ధితో ఉంటుంది. ఇదే విషయాన్ని నాన్నమ్మ పారుజాతానికి కూడా చెబుతుంది. అప్పుడు పారిజాతం కూడా దీపాను మందలిస్తుంది. నువ్వు ఇలాంటి పని చేయడం మానుకోమని చెబుతుంది. కార్తీక్ బాబు ఇక నీకు దక్కే అవకాశం లేదని చెబుతుంది. అసలు కార్తీక్ బావతో దీప అని తలుచుకుంటే నాకు తలతీసేసినట్టుగా ఉందని జ్యోత్స్న తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. ఎలాగైనా నేను దీపాకు ఆనందం లేకుండా చేస్తానని అంటుంది. ఇదే సమయంలో తండ్రి దాసు కూడా వచ్చి జ్యోత్స్న మాటలను వింటాడు. జ్యోత్స్న మళ్లీ చేయబోయే కుట్రను విని సహించలేకపోతాడు. నీకు ఎన్ని సార్లు చెప్పిన ఇంతేనా అని ఆవేశం తెచ్చుకుంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.



