Gunde Ninda Gudi Gantalu Serial Octobert 13th: ప్రభావతి కొత్త అవతారం.. వణికిపోయిన బాలు, సత్యం
Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్ తెలుగు టెలివిజన్ డైలీ సీరియల్స్‌లో మంచి రేటింగ్‌తో ఆసక్తికరంగా కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 6వ తేదీ 526వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణికి అత్త ప్రభావతి నుంచి మరోవైపు మాజీ ప్రియుడు దినేష్ నుంచి సమస్యలు వస్తూనే ఉన్నాయి. తనకు వీలైనంత వరకు రోహిణి ఆ సమస్యలను పరిష్కరించుకోవాలనే ప్రయత్నిస్తోంది. దినేష్ ఇప్పటికే రోహిణి దగ్గర నుంచి లక్షలకు లక్షలే తీసుకుంటూ ఇబ్బంది పెడుతున్నాడు. ఇక రోహిణి కూడా తన గుట్టు బయట పడకూడదని దినేష్ డిమాండ్ చేసినంతగా డబ్బులు ఇస్తూనే వస్తోంది. ఇక తాజాగా ఏకంగా రోహిణి మనోజ్ ప్రారంభించిన ఫర్నీచర్ షాప్ కే దినేష్ వస్తాడు.
అక్కడ దినేష్ ను చూసిన రోహిణి షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. నాకు పర్నీచర్ కావాలని అడుగుతాడు దినేష్. ఇవ్వడం కుదరదని రోహిణి చెబుతుంది. ఇదే సమయంలోనే మనోజ్ కూడా ఫర్నీచర్ షాప్ లోకి వస్తాడు. వీరిద్దరూ మాట్లాడుకోవడం చూస్తాడు. ఇక రోహిణఇ బతిమిలాడటంతో దినేష్ అసలు నిజం చెప్పకుండా వెళ్లిపోతాడు. తనకు ఫర్నీచర్ కావాలని, డబ్బులు కూడా కావాలని రోహిణిపై ఒత్తిడి పెంచుతాడు. మరోవైపు అత్త ప్రభావతి నుంచి కూడా రోహిణికి టెన్షన్ మొదలవుతుంది. ప్రభావతి ఊరికనే ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వస్తుందని బాధ పడుతూ ఉంటుంది. ఇక ఏదైనా ఒక పనిచేస్తానని అంటుంది. ఈ క్రమంలో రోహిణి పార్లర్ కు వెళ్తాననే ఆలోచనలో ఉంటుంది. కానీ రోహిణి తెలివిగా మీకు డ్యాన్స్ వస్తుంది కదా అత్తయ్య, మీరు డ్యాన్స్ స్కూల్ పెడితే బాగుంటుందని చెప్పి సలహానిస్తుంది. ఇక ప్రభావతి కూడా తను డ్యాన్స్ స్కూల్ పెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందేని నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచింది. ఇక అక్టోబర్ 13వ తేదీ 529 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..?

ప్రభావతి తను డ్యాన్స్ స్కూల్ పెట్టాలనుకున్నట్టుగా కామాక్షితో చెబుతుంది. ఇక అందుకు కామాక్షి కూడా సంతోషిస్తుంది. నీకు డ్యాన్స్ వచ్చా మరీ అని ప్రశ్నిస్తుంది. డ్యాన్స్ వచ్చా ఏంటీ కామాక్షి నేను చిన్నప్పుడే డ్యాన్స్ లో ఆరితేరాను. నాకు ఆర్ట్స్ లో మంచి ప్రతిభ ఉంది. ఇలా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే నేను సొంతంగా ఒక స్కూల్ పెట్టుకోవడం గొప్పగా ఉంటుంది. రోహిణి కూడా అదే చెప్పిందని వివరిస్తుంది. ఇదే సమయంలో మీనా కూడా బయట పూల ఆర్డర్స్ ఇచ్చి తిరిగి ఇంటికి వస్తుంది. ఇక ప్రభావతి మాటలను వింటుంది. ఇన్నాళ్లకు మంచి నిర్ణయం తీసుకున్నారని అంటుంది. మీకు వచ్చిన పనేదోకటి చేయడం ఉత్తమే కదా అత్తయ్య అని అంటుంది. నీ పొగడ్తలు, సలహాలు నాకేమీ అవసరం లేదులే అని మీనా మాటలను కొట్టి పారేస్తుంది. అయినా కూడా మొత్తానికి ప్రభావతి డ్యాన్స్ స్కూల్ పెడ్తాననడంతో సంతోషిస్తుంది. మొత్తానికి రోహిణి ప్లాన్ ను ఇలా వర్కౌట్ చేస్తుంది. అత్త ప్రభావతి డ్యాన్స్ స్కూల్ ప్రారంభిస్తే ఇక తనకు మనశ్శాంతిగా ఉంటుందని రోహిణి అంటుంది. లేదంటే అత్త ప్రభావతి వచ్చి నా బ్యూటీ పార్లర్ లో కూర్చుంటానంటే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చేదని మనస్సులో అనుకుంటుంది.
Karthika deepam 2 October 13th: జ్యోత్స్న ఊహించని దెబ్బ.. అన్ని దారుల నుంచి కార్తీక్ బాబు, దీప ఎటాక్
ఇక మరోవైపు ఇంటికి తిరిగి వచ్చిన సత్యం కూడా ప్రభావతి మాటలు విని షాక్ అవుతాడు. ఈ వయస్సులో నీకు డ్యాన్స్ స్కూల్ అవసరమా అని ప్రశ్నిస్తాడు. మీరందరూ ఇలానే అంటారు. నాలోని ప్రతిభను తొక్కేయాలని చూస్తున్నారు మీరు అని ప్రభావతి ఫైర్ అవుతుంది. ఇక మీనా కూడా ప్రభావతికి సపోర్ట్ చేస్తుంది. అత్తయ్య తన కాళ్ల మీద తను నిలబడాలని అనుకుంటున్నారు. అందులో ఏమాత్రం తప్పు లేదు కదా మామయ్య అని అంటుంది. తనకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అని అంటుంది. నా ప్రతిభ మీకు తెలియడం లేదు. నేను డ్యాన్స్ స్కూల్ పెడితే ఒక్కొక్కరి దగ్గర నుంచి 2000 వరకు ఫీజు తీసుకుంటాను. అంతే కాదు పిల్లలు కూడా జాయిన్ అవుతూనే ఉంటాయి. 50 మంది పిల్లలు చేరితే నాకు నెలకే రూ.1 లక్ష ఆదాయం వస్తుంది. అలాంటి అవకాశాన్ని నేను అస్సలు వదులుకోను. డ్యాన్స్ స్కూల్ ప్రారంభించే తీరుతానని ప్రభావతి అంటుంది. ఇక ఇంట్లో వాళ్లందరి మెప్పు పొందడం కోసమని ఏకంగా తను భరతనాట్యం దుస్తులు ధరించి వస్తుంది. హాలులో తనకు వచ్చిన నాట్యం చేసి చూపిస్తుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. సత్యం, బాలు, రవి మాత్రం ప్రభావతి కొత్త అవతారాన్ని చూసి షాక్ అవుతారు. అసలు నీకు ఏమైంది అమ్మ అని రవి ప్రశ్నిస్తాడు. మరోవైపు నాకు చంద్రముఖిలానే కనిపిస్తుందని బాలు అంటాడు. ఇలా వాళ్లు ప్రభావతిపై కామెంట్లు చేస్తూనే ఉంటారు.
ATK Teaser Review: ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ టీజర్ రివ్యూ.. రామ్ పోతినేని మంటపెట్టేశాడుగా?
కానీ ప్రభావతి మాత్రం వాళ్ల మాటలను అస్సలు పట్టించుకోదు. తన పని తనదే అన్నట్టుగా ముందుకు వెళ్లాలని అనుకుంటుంది. వెంటనే డ్యాన్స్ స్కూల్ పెట్టాలని చెప్పి భర్త సత్యం దగ్గర పర్మిషన్ తీసుకొని స్కూల్ ఏర్పాట్లు చేయిస్తుంది. ఇక మరుసటి రోజు క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ ను ప్రారంభిస్తారు. ఈ సందర్బంగా డ్యాన్స్ స్కూల్ ను పూలు, ఫ్లెక్సీలు, ప్రభావతి స్టిల్ ఫ్లెక్సీలతో మంచిగా అలంకరిస్తారు. ఈ సందర్భంగా డ్యాన్స్ స్కూల్ ను ప్రారంభించేందుకు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయాలని కామాక్షి చెబుతుంది. అయితే ముందు నా చిన్న కోడలు శృతి దీపం వెలిగిస్తుందని అంటుంది. శృతితో దీపం వెలిగిస్తుంది. ఆ తర్వాత రోహిణితో మరో దీపం వెలిగిస్తుంది. ఇక మీనాను మాట వరసకైనా పిలవకుండా అవమానిస్తుంది. దీంతో బాలు ప్రభావతిపై ఫైర్ అవుతాడు. మా దగ్గర డబ్బులు లేవనే నువ్వు ఇలా అవమానిస్తున్నావు కదా అమ్మ అని బాలు అడుగుతాడు. అదేం లేదు అక్కడ రెండు వత్తులు మాత్రమే ఉన్నాయి. వాటిని వాళ్లు వెలిగించారు. ఇక మూడోది లేదు కదా అని బదులిస్తుంది. ఏదేమైనా మీనా కూడా ఫీల్ అవ్వకుండా మీ డ్యాన్స్ స్కూల్ పెద్ద ఎత్తున నడవాలని కోరుకుంటున్నట్టుగా చెబుతుంది. ఇక ఆ మరుసటి రోజు డ్యాన్స్ స్కూల్ కు ఎవరు రావడంతో ప్రభావతి ఒక్కతే దోమలు కొట్టుకుంటూ కూర్చుంటుంది. అదే సమయంలో డ్యాన్స్ స్కూల్ మీనా, బాలు వెళ్తారు. ఇక మీనా నాకు భరత నాట్యం నేర్పించమని అత్త ప్రభావతిని అడుగుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.



