Karthika deepam 2 October 13th: జ్యోత్స్న ఊహించని దెబ్బ.. అన్ని దారుల నుంచి కార్తీక్ బాబు, దీప ఎటాక్
Karthika deepam 2 October 13th Episode 487 : కార్తీక దీపం 2 అక్టోబర్ 11వ తేదీ 486వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు చేసిన మేలుకు శివ నారాయణ పొంగిపోతాడు. కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు కార్తీక్ బాబు ఎంతో తెలివిని ప్రదర్శించడం శివ నారాయణను మెప్పిస్తుంది. ముఖ్యంగా కార్తీక్ బాబు తమ రెస్టారెంట్ కు సంబంధించిన షేర్ హోల్డర్స్ తమ వాటాలను వైరాకు అమ్మకుండా అడ్డుకోవడంతో శివ నారాయణ, దశరథలు ఊపిరి పీల్చుకున్నారు. కంపెనీకి పెద్ద గండం తప్పిందని కార్తకీ్ బాబును ప్రశంసించారు. మరోవైపు అనవసరంగా వైరాకు తమ కంపెనీపై హక్కు వచ్చే సదావకాశాన్ని జ్యోత్స్న కల్పించిందని శివ నారాయణ, దశరథలు మండిపడుతాడు. ఇక జ్యోత్స్నకు కేవలం వారం రోజుల పాటే గడువు ఇచ్చి, నిన్ను సీఈవో పోస్ట్ నుంచి తొలగిస్తున్నామని చెప్పి హెచ్చరిస్తారు.
నీ అంతంట నువ్వే రాజీనామా చేస్తే అందరికీ మంచిదని జ్యోత్స్నను శివ నారాయణ, దశరథ హెచ్చరిస్తారు. అయినా జ్యోత్స్న మాత్రం అస్సలు ఒప్పుకోదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నెక్ట్స్ సీఈవో మాత్రం మారబోతున్నాడు ముందుగా రాజీనామా చేస్తే నీకే గౌరవం దక్కుతుందని శివ నారాయణ హెచ్చరించి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సుమిత్ర కూడా జ్యోత్స్నను హెచ్చరిస్తుంది. నువ్వే త్వరగా రాజీనామా చేసేయ్ జ్యోత్స్న అని సుమిత్ర కూడా చెబుతుంది. అయినా కూడా జ్యోత్స్న పట్టించుకోదు. తానే మళ్లీ జ్యోత్స్న గ్రూఫ్ ఆఫ్ రెస్టారెంట్ కు సీఈవోగా కొనసాగాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మరోవైపు శివ నారాయణ తమ రెస్టారెంట్స్ ను నడిపించేందుకు సరైన సీఈవో కావాలని అనుకుంటాడు. ఈ క్రమంలో నేరుగా కార్తీక్ బాబు దగ్గరకు వెళ్తాడు. నీతో కాస్తా మాట్లాడాలని చెప్పి బయటకి తీసుకెళ్తాడు. నువ్వు నాకో పెద్ద సాయం చేయాలని, నా కంపెనీని కాపాడే బాధ్యత నీ మీదనే ఉందని చెబుతాడు. ఇందుకు కార్తీక్ బాబు ఎలా స్పందించాడనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది. అక్టోబర్ 13వ తేదీ 487 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

శివ నారాయణకు జ్యోత్స్న వల్ల ఊహించని సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీంతో జ్యోత్స్నను రెస్టారెంట్ సీఈవో బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయిస్తాడు. ఆ తర్వాత శివ నారాయణ కార్తీక్ బాబును కలిసి తన కంపెనీ బాగుండాలంటే కార్తీక్ బాబు సాయం కావాలని అంటాడు. నేను ఇప్పుడు నీకు యజమానిగా కాదు, తాతగా మాట్లాడుతున్నాను. నాకు నువ్వు పెద్ద సాయం చేయాలి. ఇప్పటికే నాకు వయస్సు మీద పడుతోంది. నేను వయస్సులో ఉన్నప్పుడు ఎన్నో సవాళ్లను స్వీకరించాను. అన్నీ దాటుకొని ఈ స్థాయికి వచ్చాను. కానీ నాకు ఇప్పుడు శక్తి సరిపోవడం లేదు. నేను నాకున్న టెన్షన్లను భరించ లేకపోతున్నాను. ఇకపై కంపెనీ బాధ్యతలను నువ్వే చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే కంపెనీని కత్తిలా నడిపించే వాడి అవసరం ఉంటుంది. మనిషి కత్తి అయితే ఎలా ఉంటాడో.. అలాంటి వాడే ఇప్పుడు నా కంపెనీకి అండగా ఉండాలి. సరిగ్గా చెప్పాలంటే నీలాంటి వాడే కావాలని శివ నారాయణ ఎలాంటి మొహమాటం లేకుండా కార్తీక్ బాబును కోరుతాడు. కానీ కార్తీక్ బాబు మాత్రం నేను ఈ ఇంట్లో డ్రైవర్ ను అలాంటప్పుడు నేను ఏ అర్హతతో కంపెనీ బాధ్యతలను చూడగలనని అంటాడు. ఆ విషయాలన్నీ నేను చూసుకుంటానని శివ నారాయణ చెబుతాడు.
ATK Teaser Review: ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ టీజర్ రివ్యూ.. రామ్ పోతినేని మంటపెట్టేశాడుగా?
అలాగే నాకు మరో సాయం కూడా చేయాలని కార్తీక్ బాబును శివ నారాయణ అడుగుతాడు. వాళ్లిద్దరినీ దశరథ, సుమిత్రలను విడివిడిగా చూడలేకపోతున్నాను. ఇప్పటికే చాలా టెన్షన్స్ ఉన్నాయంటే ఇప్పుడు వీరిద్దరూ సరిగా మాట్లాడుకోవడం లేదు. ఇన్నాళ్లలో ఎప్పుడూ వారు దూరంగా ఉండటం నేను చూడలేదు. ఎలాగైనా నువ్వే వాళ్లిద్దరినీ కలపాలి. ముందు ఈ బాధ్యతనే నువ్వు నెరవేర్చాలి. నిజం చేస్తావ్ కదా అని శివ నారాయణ కార్తీక్ బాబు చేయిని తీసుకొని తన చేతిలో వేసుకొని మాట తీసుకుంటాడు. అందుకు కార్తీక్ బాబు స్పందిస్తూ ఒప్పటికే ఒకసారి మామ దశరథ, అత్త సుమిత్రలను కలిపేందుకు ప్రయత్నించానని, కానీ వారు మాత్రం అస్సలు తన మాట వినడం లేదని కార్తీక్ బాబు చెబుతాడు. మరోసారి నా ప్రయత్నం నేను చేస్తానని, మనం కాస్తా ఓపిగ్గా ఉంటే వాళ్లిద్దరే కలిసి పోతారని కార్తీక్ బాబు బదులిస్తాడు. అవన్నీ ఇకపై నువ్వే చక్కదిద్దాలని శివ నారాయణ చెబుతాడు. ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తాత. నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చింది మీరు. మీకోసం నేను ఏదైనా చేస్తానని కార్తీక్ బాబు శివ నారాయణకు మాట ఇస్తాడు.
Gunde Ninda Gudi Gantalu Serial Octobert 13th: ప్రభావతి కొత్త అవతారం.. వణికిపోయినా బాలు, సత్యం
మరోవైపు కాశీకి శ్రీధర్ కు మధ్య వాగ్వాదం జరుగుతుంది. కాశీకి ఉద్యోగం లేకపోవడంతో దిల్ కాస్తా దూరంగా ఉంటుంది. అంటిముట్టనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మునుపటిలాగా కాశీపై దిల్ శ్రద్ధ వహించదు. దాంతో శ్రీధర్ పలుమార్లు చెప్పుకుంటూనే వస్తున్నాడు. ఇక తాజాగా దిల్ కు శ్రీధర్ వార్నింగ్ ఇస్తాడు. అల్లుడి గారిని బాధ్యతగా చూసుకోవాల్సింది నువ్వే అని దిల్ కు చెబుతాడు. నేను ఆయన పట్ల మంచి భావనతోనే ఉన్నాను. పైగా ఆయన కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూనే వస్తున్నాను. కానీ ఈ విషయం కాశీకి అర్థం కావడం లేదని దిల్ తండ్రి శ్రీధర్ కు బదులిస్తుంది. ఇదే సమయంలో కాశీ కూడా ఇంట్లోకి వస్తాడు. నా వల్లనే మీరు ఎప్పుడూ గొడవలు పడుతున్నారు. నాకు ఇకపై ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేదు. మీరు నన్ను వదిలేయండి, నేను వెళ్లిపోతాను అని కాశీ ఆవేశంలో అంటాడు. దాంతో శ్రీధర్ సముదాయించి, నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు అల్లుడు అని చెబుతాడు. నువ్వు తలుచుకుంటే వ్యాపారం చేయొచ్చు అని శ్రీధర్ అంటాడు. కానీ కాశీ మాత్రం నాకు ఎలాంటి వ్యాపారం ఇష్టం లేదని చెబుతాడు. ఇక శ్రీధర్ స్పందిస్తూ నీకు చివరిగా ఒక అవకాశం ఇస్తున్నానని కాశీని హెచ్చరిస్తాడు.
Kajra Re Song: ఐశ్వర్య రాయ్ కజ్రా రే సాంగ్.. దారుణంగా అవమానించారు.. సింగర్ ఆవేదన
రేపు సాయంత్రం వరకు నీకు ఉద్యోగం వస్తేనా సరే లేదంటే రేపటి నుంచే నువ్వు మా బిజినెస్ లు అన్నీ చూసుకోవాల్సి ఉంటుందని చెబుతాడు శ్రీధర్. కానీ కాశీ నేను చేయనని, ఎప్పుడూ వ్యాపారాలు చేయలేదని చెబుతాడు. నువ్వు భయపడాల్సిన పనేమీ లేదు నేను, దిల్ నీకు సపోర్ట్ గా ఉంటామని చెబుతాడు. మరోవైపు దీప జ్యోత్స్నకు ఊహించని షాక్ ఇస్తుంది. జ్యోత్స్న కూర్చున్న సోఫాలోనే పక్కన వెళ్లి కూర్చుంటుంది. పని మనిషివి నా పక్కన కూర్చునేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని జ్యోత్స్న దీపను ప్రశ్నిస్తుంది. పని మనిషి అని అనుకోకు నేను కార్తీక్ భార్యగా మాట్లాడుతున్నాను. నాకు తెలిసి నీ స్థానం త్వరలోనే మారబోతోంది. నువ్వు ఉన్న స్థానం నీది కాదని దీప జ్యోత్స్నతో అంటుంది. దాంతో జ్యోత్స్న ఝల్లుమంటుంది. దీపకు అసలు నిజం తెలిసిపోయిందా అని కంగారు పడుతుంది. దీప మాత్రం అసలు విషయం మాట్లాడకుండా కంపెనీ సీఈవో స్థానంలో నువ్వు ఉండటం సరికాదని అంటుంది. దాంతో జ్యోత్స్న దీపకు అసలు విషయం తెలియలేదని ఊపిరిపీల్చుకుంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న కార్తీక్ బాబు దగ్గరకు వెళ్తుంది. తనకు సాయం కావాలని కోరుతుంది. నేను కంపెనీ సీఈవోగా ఉండాలంటే నాకు ఓ సాయం చేయాలని అడుగుతుంది. అందుకు కార్తీక్ బాబు నేను నీకు ఏం సాయం చేయగలని అంటాడు. బోర్డ్ మీటింగ్ లో ఎలాగైతే నీ ప్రతిభ చూపించావో మళ్లీ అలానే నాకు నీ నుంచి సాయం కావాలని అడుగుతుంది. ఆ తర్వాత జ్యోత్స్నకు కార్తీక్ బాబు ఎలా బదులిచ్చాడనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.



