ATK Teaser Review: ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ టీజర్ రివ్యూ.. రామ్ పోతినేని మంటపెట్టేశాడుగా?
ఉస్తాద్, టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చివరిగా డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఆయన మాస్ యాక్షన్ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కు రామ్ పోతినేని మరోసారి లవర్ బాయ్ గా చూడాలనే ఆసక్తి కనిపిస్తోంది. దీంతో రామ్ పోతినేని బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో పాటు యాక్షన్ కు కూడా కొదవ లేదనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ చిత్రమే ఆంధ్ర కింగ్ తాలూకా. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం రూపుదిద్దుకుంటోంది.
ఈ చిత్రానికి పీ మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఇప్పుడు రామ్ పోతినేనితో ఆంధ్ర కింగ్ తాలూకా అనే మూవీని ప్రేక్షకుల వద్దకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటించడం విశేషం. ఇప్పటికే రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సేకు సంబంధించిన గ్లింప్స్, సాంగ్స్ ప్రోమోను విడుదల చేసి వీరి ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోనుందనే హామీనిచ్చారు.

ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రాన్ని టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మాతలు నవీన్ యేర్నేని, వై రవి శంకర్ రూపొందిస్తున్నారు. వివేక్ – మెర్విన్ సంగీత దర్శకులు వ్యవహరిస్తుండటం విశేషం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పవర్ ఫుల్ టీజర్ ను తాజాగా విడుదల చేశారు. టీజర్ పలు ఆసక్తికరమైన అంశాలతో ఆకట్టుకుంటోంది. సినిమాపై మరింత హైప్ ను పెంచేసింది.
టీజర్ వివరాల్లోకి వెళితే.. తండ్రి రావు రమేశ్ తన కొడుకును సినిమా థియేటర్ తీసుకెళ్తాడు. ప్రతి సినిమాను చూపిస్తూ ఉంటాడు. ఆయన భార్య మాత్రం పిల్లాడిని సినిమాకు తీసుకెళ్లకూడదని, పాడై పోతాడని తిడుతూ ఉంటుంది. సినిమాలు చూసి ఎవరు పాడైపోతారే అని బదులిస్తాడు. కట్ చేస్తే రామ్ పోతినేని మాస్ ఎంట్రీ ఉంటుంది. రియల్ హీరో ఉపేంద్ర భారీ కటౌట్ ముందు రామ్ పోతినేని అభిమానిగా గర్వంగా చిందులేస్తూ ఉంటాడు. థియేటర్ ఎవరిదైనా ఈరోజు దాని మొగుడు మాత్రం ఆంధ్ర కింగ్ తాలూకాదే అంటూ పవర్ ఫుల్ డైలాగ్ వదులుతాడు.
Fake Alert : ప్రియాంక ఫేక్ ఫొటోలు వైరల్.. వెంటనే స్పందించిన యంగ్ హీరోయిన్.. ఏమందంటే?
ఆ వెంటనే భాగ్యశ్రీ బోర్సే రామ్ పోతినేని మధ్య పరిచయాన్ని, ఆ తర్వాత ప్రేమను, హీరోయిన్ కు ఏదో ఆపద వచ్చిందనే విషయాన్ని కూడా చూపించారు. వాళ్ల సమస్యను మన సమస్య అనుకోవడమే ప్రేమ అంటూ రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇక రామ్ థియేటర్ లో ఆపరేటర్ గా పనిచేస్తూ ఉంటాడని కూడా టీజర్ ద్వారా తెలుస్తోంది. సినిమాలు ఎంతో అభిమాని అయిన రామ్ పోతినేని థియేటర్ లోనే ఉద్యోగం చేస్తుంటాడు. అయితే అభిమాన హీరో కోసం రామ్ పోతినేని చేసే పనులనే ఆయన్ని సమస్యల్లో చిక్కుకునేలా చేస్తాయని తెలుస్తోంది.
Sasivadane Movie Review: కోమలి ప్రసాద్ శశివదనే మూవీ రివ్యూ!
టీజర్ చివర్లో మురళీ శర్మ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఫ్యాన్ ఫ్యాన్ అంటూ నువ్వు ఓ గుడ్డలు చించేసుకోవడమే గానీ, నువ్వు ఒకడివి ఉన్నావనే మీ ఆ హీరోకు తెలియదు. ఏం బతుకుల్రా మీవి.. ఛీ ఛీ’ అనే డైలాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఫ్యాన్స్ బయోపిక్ గా వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం టీజర్ ఇప్పుడు అందరి హీరోల ఫ్యాన్స్ అటెన్షన్ డ్రా చేసింది. అయితే ఈ చిత్రంలో ఉపేంద్ర కూడా సూర్య కుమార్ అనే పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. కీలక పాత్రల్లో రావు రమేశ్, మురళీ శర్మ, కమెడియన్ సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ నటిస్తున్నారు. 2025 నవంబర్ 28న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం విడుదల కాబోతోంది.



