Gunde Ninda Gudi Gantalu Octobert 6th : లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మీనా.. పోలీస్ స్టేషన్‌లో చిక్కుకున్న బాలు

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ తెలుగు టెలివిజన్ డైలీ సీరియల్స్‌లో మంచి రేటింగ్‌తో ఆసక్తికరంగా కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక అక్టోబర్ 3వ తేదీ 526వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగిన సంగతి తెలిసిందే. బాలు మీనా మధ్య గొడవ జరగడంతో మీనా కోపంగా ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. మీనా ఇంట్లో లేకపోవడంతో బాలు కంగారు పడుతాడు. మీనా ఎప్పుడూ చెప్పకుండా ఎక్కడికి వెళ్లదు కదా? ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్లింది? ఎందుకు వెళ్లింది బాలు కంగారు పడుతాడు. ఇక వెంటనే మీనా కోసం వెతకడం ప్రారంభిస్తాడు. మీనా మాత్రం ఎక్కడ కనిపించదు. తనకు తెలిసిన అన్ని చోట్లా మీనా ఆచూకీ కోసం తిరుగుతూనే ఉంటాడు బాలు. కానీ మీనా జాడ మాత్రం కనిపించదు. దాంతో బాలు టెన్షన్ పడుతుంటాడు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తి నెలకొంది. ఇక అక్టోబర్ 6వ తేదీ 525 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..?

బాలు మీనా కోసం వెతుకుంటూ ఉంటాడు. పూల షాపులు, తెలిసిన వాళ్ల ఇంటికి వెళ్లి కూడా అడిగి చూస్తాడు. కానీ ఎవ్వరినీ అడిగినా మీనా తమ వద్దకు రాలేదనే సమాధానం ఇస్తారు. దీంతో బాలు కంగారు పడుతూ ఉంటాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఇక ఇంటి దారి పడుతాడు. మరోవైపు రాత్రి అయినా కూడా మీనా ఇంటికి రాలేదనే టెన్షన్ మాత్రం ఇంట్లో ఎవ్వరిలోనూ ఉండదు. ప్రభావతి ఏంచక్కా తన ఇద్దరు కోడళ్లు రోహిణి, శృతి, ఇద్దరు కొడుకులు మనోజ్, రవిలతో కలిసి మంచిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని రాత్రి భోజనం తింటూ ఉంటారు. హాలులో మాత్రం సత్యం టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఇక మీనా ఇంట్లో లేక పోవడంతో రోహిణినే వంట చేస్తుంది. అసలే తనకు వంట కూడా రాకపోవడంతో అన్నీ వంటలను అడ్డదిడ్డంగా వండి తినండి అని చెబుతుంది. దాంతో మనోజ్, ప్రభావతి తమకు నచ్చకపోయినా తింటారు. ఇక రవి, శృతి తినడం మానేస్తారు. ప్రభావతి తినేది తినకుండా సత్యాన్ని పిలిచి మరీ తినడానికి రండి అని అంటుంది. నాకు ఆకలిగా లేదు నువ్వు తిను అని సత్యం అంటాడు. అలాగేతై మీ ఆరోగ్యం పాడవ్వదా అని ప్రభావతి ప్రశ్నిస్తుంది. ఒక్క రోజు తినకపోతే కొంపలేమీ అంటుకుపోవడని సత్యం తిరిగి బదులిస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 525 Octobert 6th

అసలు మీనా ఇంటికి రాలేదనే బాధ, కంగారు ఏ ఒక్కరిలోనైనా ఉందా? అని సత్యం అందరిపై కంగారు పడుతాడు. అత్త, ఆడపడుచు, భర్తపై, తోటి కోడళ్లపై ఫిర్యాదు చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయే కాలంలో కూడా మీనా ఎంతో ఓపిగ్గా ఈ ఇంట్లో పడి ఉంటుంది. గద్దలాంటి అత్త పోరును భరిస్తూ వస్తోంది. మీనా గొప్పతనం నీకు మున్ముందు తెలుస్తుంది. మీనా లేకుంటే ఈ ఇంట్లో కలనే ఉండదని సత్యం ప్రభావతిపై మండి పడుతాడు. ఇక ఇదే సమయంలో బాలు ఇంటికి తిరిగి వస్తాడు. దాంతో సత్యం మీనా ఆచూకీ ఏమైనా తెలిసిందా? అని అడుగుతాడు. బాలు తెలియలేదని అంటాడు. అంటే మీనా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని నువ్వు నమ్ముతున్నావారా బాలు అని సత్యం ప్రశ్నిస్తాడు. బాలు అదేం కాదు నాన్న, ఎక్కడికి వెళ్లిన మీనా కనిపించకపోవడంతో చాలా కంగారుగా ఉందని అంటాడు. ఇక రవి కూడా బాలుకు సాయంగా ఉంటాడు. ఇద్దరం కలిసి మరోసారి వెతుకుదాం అన్నయ్య అని అంటాడు. కానీ బాలు నేను రాజేష్ ఇద్దరం వెళ్లి వెతుకుతామని చెబుతాడు. ఆ వెంటనే బాలు రాజేష్ మీనా వెళ్లే ప్లేస్ లన్నింటీకి వెళ్లి వెతకడం ప్రారంభించారు. కానీ మీనా ఎవ్వరి ఇంటికి రాలేదని అందరూ చెబుతూ ఉంటారు. మీనా ఎక్కడా కనిపించకపోవడంతో బాలు మరింత దిగులవుతూ ఉంటాడు.

Karthika deepam 2 October 6th : అతి తెలివి ప్రదర్శించిన జ్యోత్స్న.. అగ్రిమెంట్‌ పేపర్లను కార్తీక్‌కు ఇచ్చేసిన శివనారాయణ

మరోవైపు రవి కూడా అన్ని పూల కొట్టుల దగ్గరకు వెళ్లి మీనా గురించి అడిగి వస్తాడు. కానీ మీనా తమ వద్దకు రాలేదని, రోజు వచ్చేది కానీ ఇవ్వాలనే రాలేదని అంటారు. చేసేదేమీ లేక ఇక రవి కూడా ఇంటికి తిరిగి వస్తాడు. తండ్రి సత్యంతో మీనా జాడ దొరకలేదని చెబుతాడు. ఇక ప్రభావతి మాత్రం తన నోటికి వచ్చినంతగా మాట్లాడుతుంది. మీనా ఇంటికి తిరిగి రాదని అంటుంది. దాంతో సత్యం ఒళ్లు మండిపోతుంది. ఎందుకు నువ్వే ఇంట్లో నుంచి పంపించేశావా? అని ప్రశ్నిస్తాడు. నేనెందుకు పంపిస్తాను. బాలు గాడితో ఉండటం ఇష్టం లేకనే, ఇన్నాళ్లు భరించి ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అంటుంది. ఇక ఎవ్వరికి కనిపించకుండా దూరంగా వెళ్లిపోయి ఉంటుందని ప్రభావతి అంటుంది. ఇక ప్రభావతి మాటలకు సత్యం మండి పడిపోతాడు. అసలు నీది నోరా లేక ఇంకేదైనానా? మీనా ఎక్కడికి వెళ్లిపోయిందని మేమంతా టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేవో ఇలా మాట్లాడుతున్నావని సత్యం ఫైర్ అవుతాడు. కనీసం మీ వదిన కామాక్షి వాళ్ల ఇంటికైనా వెళ్లిందేమో ఫోన్ చేసి కనుక్కోమని అంటాడు. ఇక ప్రభావతి వెంటనే కామాక్షి ఫోన్ చేసి జరిగిన విషయం చెబుతుంది. కామాక్షి హుటాహుటిన ఇంటికి చేరుకుంటుంది. మీనా అసలు ఎందుకు ఇంట్లో నుంచి వెళ్లి పోయిందనే వివురాలను అడుగుతుంది. ప్రభావతి జరిగింది వివరంగా చెబుతుంది.

Nani x Sujeeth: నాని – సుజీత్ సినిమా కథ ఏంటీ? రిలీజ్ ఎప్పుడో తెలుసా?

దాంతో కామాక్షి ప్రభావతిని మరింతగా భయపెడుతుంది. మీ వల్లనే మీనా ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉంటుందని అంటుంది. ఇన్నాళ్లు అత్త ప్రభావతి చిత్ర హింసలు పెట్టడం వల్లనే ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయి ఉంటుందని కామాక్షి అంటుంది. దాంతో ప్రభావతి నేం అనలేదు మీనాను, తన భర్తతోనే గొడవ పెట్టుకొని వెళ్లిపోయింది కదా అని ప్రభావతి స్పందిస్తుంది. నన్నేమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోనని అంటుంది. అలా గట్టిగా అరవకు ఒకవేళ మీనా గనుక గృహ హింస చట్టం కింద నీపై కేసు పెట్టిందనుకో పోలీసులు నిన్ను జీవితాంతం జైలుకే పంపిస్తారని అని కామాక్షి ప్రభావతిని భయపెడుతుంది. ఇక ప్రభావతి కూడా వణికిపోతుంది. ఇంతకీ మీనా తన గదిలో ఏదైనా లెటర్ రాసి వెళ్లిపోయిందా అని వెతకడం ప్రారంభిస్తారు. ప్రభావతి, కామాక్షి వెతుకుతూ ఉంటే మీనా గదిలోకి శృతి, రోహిణి కూడా వస్తారు. వాళ్లు కూడా భయపడి లెటర్ ఏమైనా ఉందా? అని వెతకడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో శృతికి లెటర్ దొరుకుతుంది. దాంతో ప్రభావతి గుండె ఝల్లుమంటుంది. ఇక అందులో ఏం రాసి ఉంటుందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది. మరోవైపు ప్రోమోలో మీనా తమ్ముడు శివ బాలుపై పోలీస్ కేసు పెడుతాడు. ఇక మీనా ఆచూకీ కోసమని బాలు అదే పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. శివ అడ్డదిడ్డం మాట్లాడటంతో కాలర్ పట్టుకొని వార్నింగ్ ఇస్తాడు. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది మున్ముందు ఎపిసోడ్స్ లో తెలియనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button