Nani x Sujeeth: నాని – సుజీత్ సినిమా కథ ఏంటీ? రిలీజ్ ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్‌గా సుజీత్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ డైరెక్టర్ గా దుమ్ములేపుతున్నారు. పాతికేళ్ల వయస్సులోనే ఇండియాలోనే టాప్ స్టార్స్ తో భారీ చిత్రాలను తెరకెక్కిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో ఇప్పటి వరకు కేవలం 3 సినిమాలు మాత్రమే వచ్చాయి. 22 ఏళ్లకే సుజీత్ దర్శకుడిగా మారి టాలీవుడ్ సంచలనంగా మారాడు. టాలీవుడ్ స్టార్ శర్వానంద్ తో రన్ రాజా రన్, ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సాహో వంటి భారీ యాక్షన్ ఫిల్మ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు.

అతి చిన్న వయస్సులోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయింది. స్టార్ హీరోల దృష్టిని తనపై పడేలా చేశాడు. ఇక రీసెంట్ గా సుజీత్ ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ THEY CALL HIM OG సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడులైంది. తొలిరోజు నుంచే సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా హిట్ కావడంతో ప్రస్తుతం డైరెక్టర్ సుజీత్ పేరు మారుమోగుతోంది.

Nani Sujeeth Movie Release Date

ఈ క్రమంలో డైరెక్టర్ సుజీత్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. దీంతో ఏమాత్రం ఆలస్యం లేకుండా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను నేచురల్ స్టార్ నానితో సుజీత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న సుజీత్ – నాని కాంబినేషన్ కు సంబంధించిన ప్రాజెక్ట్ సంప్రదాయ బద్ధంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఇప్పటికే సుజీత్ ఈ చిత్రానికి BLOODY ROMEO అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ప్రస్తుతం టైటిల్ తోనే సినిమా పనులు జరుగుతుండటం విశేషం.

కన్ఫమ్! రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ నిశ్చితార్థం.. 2026లో పెళ్లి డేట్ ఫిక్స్?

ఇక బ్లడీ రొమియో చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను సుజీత్ ఇప్పటికే కంప్లీట్ చేయడం విశేషం. నాని డేట్స్ కోసం సుజీత్ ఎదురు చూస్తూ ఉన్నారు. కాగా బ్లడీ రొమాయో సినిమా కథ రోటీన్ భిన్నంగా ఉండబోతుందని చెప్పారు. బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో పాటు డార్క్ కామెడీ, ట్విస్టులతో కూడిన యాక్షన్ సీన్లు ఉంటాయని ఇప్పుడే హైప్ పెంచేశారు. కాగా ఈ సినిమాతో సుజీత్ యూనిక్ మ్యూజిక్‌ను ఆడియెన్స్‌కు అందించబోతున్నారంట. ఈ క్రమంలో బ్లడీ రొమియో సినిమా కథపై మరింత ఆసక్తి నెలకొంది.

7 రోజుల్లో OG బాక్సాఫీస్ కలెక్షన్.. పవర్ స్టార్ మూవీ కలెక్షన్ల తుఫాన్.. ఎన్ని కోట్లంటే?

కాగా సుజీత్ -నాని ప్రాజెక్ట్‌ను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపొందించబోతున్నారని తెలుస్తోంది. నిర్మాతగా వెంకట్ బోయనపల్లి వ్యవహరిస్తున్నారు. త్వరలోనే మిగితా తారాగణం, టెక్నీషియన్ల ఎంపికను పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించే పనిలో ఉన్నారు. 2025 డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని సినీ ప్రముఖులు తెలుపుతున్నారు. కాగా ఈ మూవీని 2026 క్రిస్టమస్ కానుకగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button