కన్ఫమ్! రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ నిశ్చితార్థం.. 2026లో పెళ్లి డేట్ ఫిక్స్?
టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిశ్చితార్థం పూర్తైనట్టుగా చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ కొనసాగుతోంది. కొన్నాళ్లుగా వీరిద్దరూ డీప్ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ తరుచుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పలు మార్లు వీరి పెళ్లిపైనా కూడా బ్యాక్ టు బ్యాక్ రూమర్లు గుప్పుమంటూనే వస్తున్నాయి. కానీ ఎప్పుడూ కూడా ఇద్దరూ ఆ రూమర్లను కొట్టిపారేయ్యలేదు. పలు ఇంటర్వ్యూల్లోనూ తాము మంచి ఫ్రెండ్స్ అనే చెప్పుకుంటూ వచ్చారు. కానీ డేటింగ్ వార్తలను మాత్రం ఖండించలేదు. దాంతో వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అటూ ఊహాగానాలు మరింతగా ఊపందుకున్నాయి.
అందుకు తగ్గట్టుగానే రష్మిక మందన్నతో కలిసి విజయ్ దేవరకొండ తరుచుగా టూర్లు, వెకేషన్లు వెళ్తూ వస్తున్నారంటూ పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. పలు సందర్భాల్లో వీరిద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్స్ లో కలిసి కనిపించడం, తాము పంచుకునే సోషల్ మీడియా పోస్ట్స్ కూడా దాదాపుగా దగ్గరగా ఉండటంతో వీరిద్దరూ కలిసే వెకేషన్స్ ను ఎంజాయ్ చేస్తున్నారంటూ సందుకో వార్త బయటికి వస్తూనే ఉంది. అలాంటి సమయంలోనూ తమ రిలేషన్ షిప్ పై ఎలాంటి ఖండన లేకపోవడంతో ఇక పుకార్లకు మరింతగా బలం చేకూరింది. వీరిద్దరి డేటింగ్ కన్ఫమ్ అంటూ జోరుగా ప్రచారం జరిగింది. చివరిగా ఇద్దరూ కలిసి ఇండిపెండెన్స్ డే యూఎస్ఏ పరేడ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇక తాజాగా రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఎంగేజ్ మెంట్ పూర్తైనట్టుగా తెలుస్తోంది. ఎప్పటి నుంచో వీరి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని సోషల్ మీడియా కోడై కూస్తున్న క్రమంలో ఇక దసరా సందర్భంగా సెప్టెంబర్ 3న శుక్రవారం విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న నిశ్చితార్థం జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని విజయ్ టీమ్ నుంచి ఒకరు తెలియజేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని అంటున్నారు.
Karthika deepam 2 October 4th : శ్రీధర్ కు షాక్ ఇచ్చిన కార్తీక్ బాబు.. వంటక్కపై అసలు గురి
కానీ ఇటు రష్మిక మందన్న గానీ, అటు విజయ్ దేవరకొండ గానీ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తమ పెళ్లికి సంబంధించిన వార్తలను తెలియజేయలేదు. ఎలాంటి అనౌన్స్ మెంట్ కూడాలేదు. దీంతో ఇప్పటి వరకు వీరి ఎంగేజ్ మెంట్ వార్తలపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ స్ట్రాంగ్ బజ్ మాత్రం క్రియేట్ అయ్యింది. 2026 ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లికి ముహూర్తంగా కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మున్ముందు మరింత అప్డేట్ అందాల్సి ఉంది.
విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్.. కింగ్డమ్ కు ఎన్ని కోట్లంటే?
2018 నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ పుకార్లు వస్తూనే ఉన్నాయి. 7 ఏళ్లుగా వీరి డేటింగ్ రూమర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఫైనల్ గా మరికొద్ది నెలల్లో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారనే వార్తలతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో బ్యూటీఫుల్ ఆన్ స్క్రీన్ కపుల్ గా క్రేజ్ సంపాదించుకున్నారు.

